CM రేవంత్ రెడ్డిది కూడా కూల్చేస్తాం..హైడ్రా కమిషనర్ సంచలన కామెంట్స్!

Hydra Commissioner Ranganath: ఇప్పటికే నగర వ్యాప్తంగా హైడ్రా పై పలు విమర్శలు గుప్పు మంటున్నాయి. ముఖ్యంగా హైడ్రా కావలనే ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కొందరంటే.. హైడ్రా దూసుకుపోతూ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయం పై ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమిషనర్ సంచలనమైన కామెంట్స్ చేశారు.

Hydra Commissioner Ranganath: ఇప్పటికే నగర వ్యాప్తంగా హైడ్రా పై పలు విమర్శలు గుప్పు మంటున్నాయి. ముఖ్యంగా హైడ్రా కావలనే ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కొందరంటే.. హైడ్రా దూసుకుపోతూ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయం పై ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమిషనర్ సంచలనమైన కామెంట్స్ చేశారు.

హైడ్రా ప్రస్తుతం నగరంలో అక్రమ నిర్మాణలపై ఏ స్థాయిలో కొరడా ఝుళిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నగరంలోని చెరువులు, నాలాలు, బఫర్ జోన్ లో ఉన్న అక్రమ స్థలాలను కబ్జాలు చేసి నిర్మించిన భవనాలను హైడ్రా నిర్ధాక్ష్యంణంగా కూల్చేస్తుంది. ఇక ఈ విషయంలో సామాన్యులు, ధనికులు అనే తేడా లేకుండా రూల్స్ కు భిన్నంగా ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించి తమ తన బుల్డోజర్లు తో విరుచుకుపడుతుంది. అయితే ఈ చర్యలపై ఇప్పటికే నగర వ్యాప్తంగా పలు విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే.. హైడ్రా కావలనే ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కొందరంటే.. హైడ్రా దూసుకుపోతూ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కానీ, కొన్ని చోట్ల హైడ్రా రాజకీయ నేతలు అక్రమించే నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని, హైడ్రా ఉక్కుపాదం పేదవారు, మధ్యతరగతి కుటుంబలపైనే అని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంతేకాకుండా.. ప్రభుత్వంలో ఉన్నవారికి చెందిన భవనాలను కూలుస్తారా  వారు అక్రమించిన ఇళ్ల స్థలాలపై చర్యలు తీసుకుంటరా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇక ఇదే విషయం పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న  హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఎదురవ్వగా ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఆ వివరాాళ్లోకి వెళ్తే..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు.. ఇటీవల కాలంలో గతం కంటే హైడ్రా కూల్చివేతలు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే ఈ హైడ్రా కూల్చివేతలు సామన్యులకేనా.. ప్రభుత్వ అధికారంలో ఉన్న వారు అక్రమించే స్థలాలను ఎందుకు గుర్తించడం లేదు? వాటిని ఎందుకు కూల్చడం లేదు? ఇది ఎంత వరకు కారెక్ట్.. దీనిపై మీ స్పందన ఏమిటంటూ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. ‘నగరంలో హైడ్రా కూల్చివేతలు అనేవి కొనసాగుతునే ఉంటాయి. హైడ్రా ఎప్పుడు నిబంధనాలకు లోబడే హైడ్రా ఎల్లావేళాలా పని చేస్తుంది. కనుక అక్రమాలకు పాల్పడిన వారేవ్వరైనా సరే మేము విడిచిపెట్టాం.

అందుకు మాకు  ప్రభుత్వం ఫుల్ ఫ్రీడమ్, రైట్స్ అనేవి ఇచ్చింది. కనుక తప్పు చేసింది ఎవరైనా సరే అది పెద్ద చిన్న అనేది చూడాం. అది సీఎం రేవంత్ రెడ్డి అయినా సరే.. వారి అక్రమ నిర్మాణాలు ఉన్నా తక్షణమే కూల్చివేస్తాం. అందుకు మాకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుంది. కనుకు ఈ  విషయంలో హైడ్రా ఎవరిపై కక్షచర్యలకు పాల్పడటం లేదు. ఇందులో ఎలాంటి రాజకీయ బేధాలు చూపడం లేదని’ ఆయన  పేర్కొన్నారు. ప్రస్తుతం హైడ్రా కమిషనర్ చేసిన సంచలన కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి, తప్పు చేస్తే సీఎం రేవంత్ రెడ్డిది అయిన కూల్చేస్తాం అంటూ కమిషనర్ రంగనాథ్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments