ఓయో రూమ్స్ లో కొత్త రూల్స్.. Hyderabad పోలీసులు హెచ్చరికలు..!

Hyderabad Police-OYO Hotels: హైదరాబాద్ లోని ఓయో హోటల్ మేనేజర్స్ కి నగర పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాలు...

Hyderabad Police-OYO Hotels: హైదరాబాద్ లోని ఓయో హోటల్ మేనేజర్స్ కి నగర పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాలు...

ఏకాంతంగా గడపాలనుకునే దంపతులు, లవర్స్ కి ఓయో రూమ్ లు మంచి అవకాశంగా మారాయి. అదే సమయంలో ఇవి కొన్ని నేరాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. తాజాగా శంషాబాద్ లోని ఓ ఓయో హోటల్ నిర్వాహకుడు.. గదిలో సీక్రెట్ కెమరా పెట్టి.. అక్కడకు వచ్చిన వారు ఏకాంతంగా గడిపిన సమయాన్ని రికార్డు చేసి.. ఆ తర్వాత బేదిరింపులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ పోలీసులు ఓయో హోటల్ నిర్వాహకులకు కీలక అలర్ట్ జారీ చేశారు. కొత్త రూల్స్ తీసుకు వచ్చారు. వాటిని పాటించపోతే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ వివరాలు..

తెలంగాణ ఉమెన్స్ సేఫ్టీ డిజి శికా గోయల్.. తాజాగా ఓయో రూమ్ నిర్వాహకులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న ఓయో రూంల నిర్వహణ తీరు, తదితర అంశాలపై పలువురు హోటల్స్ మేనేజర్స్ తో చర్చించారు. మహిళల భద్రతకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ సమావేశంలో ఓయో రూమ్ నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు పలు కీలక సూచనలు చేశారు.

కొత్త రూల్స్..

  • హోటల్ కు వచ్చే ప్రతి ఒక్కరి ఐడి ప్రూఫ్ చెక్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
  • ఓయో హోటళ్లు తమ సీసీటీవీ ఫుటేజీ నిల్వను 90 రోజులు మించి ఉంచాలి.
  • ప్రతి వారం, నెలలకు ఒక్కసారైనా ఈ సీసీటీవీ వ్యవస్థల పనితీరుని పరిశీలించాల్సి ఉంటుంది.
  • ఓయో హోటల్ గదులు, రిసెప్షన్ ప్రాంతాల్లో అత్యవసర టెలిఫోన్ నెంబర్లు, అందుబాటులో ఉంచాలి.
  • హోటల్ సిబ్బందికి మహిళల భద్రతకు సంబంధించిన విధానాలపై శిక్షణ ఇప్పించాలి.
  • ఓయో హోటళ్లు మహిళా అతిథులకు ప్రత్యేక భద్రతా సదుపాయాలు అందించాలి.
  • ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహించకూడదు.
  • ఒకవేళ అలా ఉంటే హోటల్ మేనేజ్మెంట్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
  • హోటల్ బుకింగ్ సమయంలో ఈ మెయిల్స్, ఎస్ఎంఎస్ ద్వారా అతిథులకు భద్రతా సూచనలు పంపించబడతాయి.

ఈ విధానం, తెలంగాణలోని హోటళ్లలో సురక్షిత వాతావరణం సృష్టించడానికి, వారి భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి రూపొందించబడింది అన్నారు పోలీసులు. మహిళల భద్రతా విభాగం, స్థానిక పోలీస్ అధికారులతో కలిసి, ఈ మార్గదర్శకాల అమలు, సమీక్ష చేయడానికి పనిచేస్తుంది. ఈ సమావేశానికి హైదరాబాదులోని వివిధ ఓయో రూమ్స్ నిర్వాహకుల ప్రతినిధులు హాజరయ్యారు. వీరితోపాటు యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ అధికారులు పాల్గొన్నారు. ఇకపై నగరంలోని ఓయో హోటల్ నిర్వాహకులు కచ్చితంగా ఈ రూల్స్ ని పాటించాలని.. లేదంటే కఠిన చర్యలు తప్పవు అన్నారు.

Show comments