Hyd ట్యాంక్ బండ్ పై RTC బస్సు అద్దాలు ధ్వంసం.. ఏం జరిగిందంటే?

Hyderabad: హైదరాబాద్ నగరంలో వరుస ఆర్టీసీ బస్సులపై తమ ప్రతాాపాన్ని చూపుతున్నారు కొందరు ఆకతాయిలు. యువకులే కాదు మహాలక్ష్ములు సైతం ఆర్టీసీ ధ్వంసాలకు పాల్పడుతుండటం గమనార్హం. తాజాగా

Hyderabad: హైదరాబాద్ నగరంలో వరుస ఆర్టీసీ బస్సులపై తమ ప్రతాాపాన్ని చూపుతున్నారు కొందరు ఆకతాయిలు. యువకులే కాదు మహాలక్ష్ములు సైతం ఆర్టీసీ ధ్వంసాలకు పాల్పడుతుండటం గమనార్హం. తాజాగా

ఈ మధ్య కాలంలో ప్రజా ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారు కొంత మంది పోకిరీలు. ఏకంగా ఆర్టీసీ బస్సుల ధ్వంసానికి పూనుకుంటున్నారు. రోడ్డుపై ఆర్టీసీ బస్సులతో పోటీ పడుతూ డ్రైవ్ చేయడం, ఇష్టాను సారంగా వాహనాలకు అడ్డు వెళుతూ వీరంగం సృష్టించడం చేస్తున్నారు ఆకతాయిలు.  వీరు తప్పు చేస్తూ పై పెచ్చు సైడ్ ఇవ్వలేదంటూ బస్సులపై, డ్రైవర్, కండక్టర్లపై తమ ప్రతాపాన్ని చూపించిన దాఖలాలున్నాయి. తాజాగా ఓ మహిళ మద్యం తాగి బస్సు అద్దాలు పగుల కొట్టడంతో పాటు పామును కండక్టర్‌పైకి విసిరేసింది. ఈ ఘటన మర్చిపోక ముందే ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది. బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడన్న కారణంగా ఇద్దరు యువకులు బస్సు అద్దాలు పగులకొట్టి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన హైదరాబాద్ నగరం నడి బొడ్డున చోటుచేసుకుంది.

ట్యాంక్ బండ్ పై టీజీఎస్ ఆర్టీసీ బస్సు అద్దాలను ఇద్దరు యువకులు ధ్వంసం చేశారు. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. బస్సు వెళుతున్న దారిలోనే ఇద్దరు యువకులు బైక్ పై వెళుతున్నారు. అంతలో ఆర్టీసీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో బస్సు ఆగిపోయింది. వెనకాల వస్తోన్న బైక్ బస్సును ఢీకొట్టింది. బస్సును బైక్ ఢీ కొట్టగా.. రివర్స్‌లో ద్విచక్రంపై వస్తున్న యువకులే.. ఆర్టీసీ డ్రైవర్‌పై గొడవకు దిగారు. సడెన్ బ్రేక్ ఎందుకు వేశావంటూ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. కోపంతో ఊగిపోయిన యువకులు అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తేలింది. నిన్న ఓ సంఘటన కలవర పాటుకు గురి చేసింది.

చెయ్యెత్తినా ఆర్టీసీ బస్సును ఆపలేదన్న కోపంతో మద్యం మత్తులో ఉన్న ఫాతిమా బాబీ అలియాస్ అసీం గురువారం సాయంత్రం విద్యానగర్‌ చౌరస్తాలో దిల్‌సుఖ్‌నగర్‌ డిపో 107 వీ/ఎల్‌పై తన చేతిలో ఉన్న బీర్ బాటిల్ విసిరింది.  దీంతో బస్సు వెనకద్దం పలిగింది. వెంటనే డ్రైవర్ బస్సు ఆపగా.. కండక్టర్ స్వప్న బస్సు దిగి ఫాతిమా చేతిని గట్టిగా పట్టుకుంది. తనను వదలాలని, లేకుంటే తన బ్యాగ్ లో ఉన్న పామును వదులుతానంటూ బెదిరించింది. స్వప్న వదలకపోవడంతో.. నాలుగు అడుగుల పొడవున్న పామును (జెర్రిపోతు) బయటికి తీసి కండక్టర్‌పైకి విసిరింది. అది స్వప్న ఒంటిమీద పడి నేలపైకి జారిపోయింది. ప్రయాణికులు, స్థానికులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫాతిామాను అదుపులోకి తీసుకున్నారు.

Show comments