HYDRA: హైడ్రా దూకుడు.. నెక్స్ట్ టార్గెట్ మల్లారెడ్డి.. అక్రమ కట్టడాల పరిశీలన

HYDRA-Jawahar Nagar, Medchal: హైడ్రా దూకుడుగా ముందుకు సాగుతుంది. తాజాగా జవరహర్ నగర్ లో కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటన సంచలనంగా మారింది. ఆ వివరాలు..

HYDRA-Jawahar Nagar, Medchal: హైడ్రా దూకుడుగా ముందుకు సాగుతుంది. తాజాగా జవరహర్ నగర్ లో కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటన సంచలనంగా మారింది. ఆ వివరాలు..

అక్రమార్కుల గుండెల్లో హైడ్రా గుబులు పుట్టిస్తుంది. ఎప్పుడు, ఎక్కడ ఎవరికి నోటీసులు వస్తాయో తెలియక.. ఎక్కడ బుల్డోజర్లు కూల్చి వేతలు చేపడతాయో అర్థం కాక.. జుట్టు పీక్కుంటున్నారు. కానీ హైడ్రా మాత్రం.. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా.. పేద, ధనిక, సామాన్య, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ముందుకు సాగుతుంది. అక్రమం అని తెలిస్తే చాలు.. తొలగింపు చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలో తాజాగా హైడ్రా.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అడ్డాలోని ఆక్రమణలపై గురి పెట్టినట్లుగా తెలుస్తోంది. గతంలో ఆయన మీద అనేక భూ కబ్జా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాాజగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. జవహర్ నగర్ ప్రాంతంలో పర్యటించడం సంచలనంగా మారింది.

తాజాగా హైడ్రా కమీషనర్.. ఏవీ రంగనాథ్ అధికారులతో కలిసి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అడ్డా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లో పర్యటించారు. ఆ ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాల గురించి ఆరా తీశారు. ఈక్రమంలో మాజీ మేయర్ మేకల కావ్యకు చెందిన ఫామ్‌హౌస్‌కు అనుమతులు లేవని గుర్తించారు. అంతేకాకుండా అంబేడ్కర్ నగర్‌లోని ఇంద్రా చెరువు, డంపింగ్ యార్డు సమీపంలోని నాలా ఆక్రమణకు గురైనట్టు హైడ్రా అధికారులు తేల్చారు. ఈ క్రమంలో మాజీ మేయర్ ఫామ్‌హౌస్‌కు అనుమతులు జారీ చేసిన అధికారులపై.. అలానే చెరువు ఆక్రమణలపై అలసత్వం ప్రదర్శించిన అధికారులపైనా చర్యలు తీసుకోనున్నట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. ఆక్రమణదారులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. అక్రమ నిర్మాణాల విషయంలో పేద వారిపై అయినా కాస్త జాలి చూపిస్తామేమో గాని.. చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన బడా బాబులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అంతేకాక అక్రమంగా నిర్మించిన ఫామ్‌హౌస్‌లను, నిర్మాణాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చి వేస్తామని రంగనాథ్ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాక పేదల పేరుతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వాన్ని మోసం చేయాలని చూసే వారి విషయంలో మరింత కఠినంగా ఉంటామని.. అలాంటి వారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Show comments