P Krishna
Hyderabad: ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమ పథకాల అమలు విషయంలో తమదైన మార్క్ చాటుకుంటున్నారు.
Hyderabad: ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమ పథకాల అమలు విషయంలో తమదైన మార్క్ చాటుకుంటున్నారు.
P Krishna
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాల అమలుపై హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీ పథకాలపై ప్రత్యేక ఫోకస్ పెడుతూనే ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ అమలు చేశారు. అలాగే అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ చేశారు. తాజాగా దసరా పండుగ సందర్భంగా హైదరాదీలకు గొప్ప శుభవార్త చెప్పారు. అదేంటో చూద్దాం..
హైదరాబాద్ వాసులకు ఇది నిజంగా పండుగలాంటి వార్తే.. నగరంలో ఉండే చాలా మంది కొన్నేళ్ళుగా వాటర్ బిల్స్ కట్టకుండా పెండింగ్ లో ఉంచారు. ఈ క్రమంలోనే వాటర్ బోర్డుకు ఎన్నో ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన పెండింగ్ బిల్లులకు మోక్షం కల్పించే పనిలో పడ్డారు అధికారులు. ఈ క్రమంలోనే హెచ్ఎంఎస్‌ఎస్బీ వాటర్ బోర్డు కార్యదర్శి కీలక ప్రకటన చేశారు. దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ బకాయిలపై ఉన్న ఆలస్య రుసుము, వడ్డీని పూర్తిగా మాఫీ చేసి వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (OTS) ను ప్రకటించారు. ఇందులో బాగంగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా తాగునీటి బిల్స్ కట్టుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తుంది. ఈ సదావకాశం ఈ నెల 31 వరకు మాత్రమే అమలు లో ఉంటుందని మున్సిపల్ కార్యదర్శి దాన కిషోర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. దసరా కానుకగా నగరవాసులకు ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే.. వాటర్ బోర్డులో నీటి బకాయిలు అంతకంత పేరుకుపోతుండటంతో వాటిని తగ్గించేందుకు ఓటీఎస్ ను అమలు చేయాలని వాటర్ బోర్డు గత నెల 19న ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలకంగా స్పందించడంతో.. తాజాగా ఉత్తర్వులు వెలువురించినట్లు సమాచారం. గతంలో ఈ పథకాన్ని 2016 తర్వాత 2020లో అమలు చేశారు. అప్పుడు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ఒక్కో విడత ర.500 కోట్లకు పైగా పెండింగ్ బకాయీలు వసూలైనట్లు తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇలాంటి ఛాన్స్ వచ్చినపుడే సద్వినియోగం చేసుకుంటే మంచిది.. పెండింగ్ బిల్లులు ఉన్నవారు క్లీయర్ చేసుకుంటే బెటర్ అంటున్నారు.