హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పు చేస్తే రూ.1000 జరిమానా!

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ నగర సుందరీకరణ కోసం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది.

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ నగర సుందరీకరణ కోసం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది.

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఇకపై పొరపాటున ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే మీ జేబుకు చిల్ల పడాల్సిందే. జీహెచ్ఎంసీ అధికారులు మీరు చేసే తప్పి ఈజీగా పట్టేస్తారు. ఇకపై చెత్త విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచితని హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలామంది నగరవాసులు ఉదయం పూట ఎవరైనా చూస్తారని సైలెంట్ గా రాత్రి పూట కవర్లలో చెత్త నింపుకొని రోడ్డు సైడ్ పడవేస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడంతో దుర్గంధంతో పాటు స్థానికులు రోగాలభారిన పడుతున్నారు. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ టెక్నాలజీ ని అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

నగరంలో గత కొంత కాలంగా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే సంస్కృతి పెరిగిపోతుంది. ఈ నిర్లక్ష్యపు వైఖరిని శాశ్వతంగా పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటుంది. ఇప్పటిక ప్రతి ఇంటికి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ప్రకారం చెత్త సేకరణ జరుగుతుందో లేదో అన్న విషయం ట్రాకింగ్ చేయనుంది. దీంతో పాటుగా కాలనీల్లో ఎవరైనా నిబంధనలుకు విరుద్దంగా చెత్త వేస్తారో అక్కడ సైరన్ మోగేలా కొత్త విధానం అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆయా వెల్ఫేర్ కమిటీలతో అధికారులు మాట్లాడతున్నారు. అన్ని కాలనీలో సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తర్వాత కొత్త టెక్నాలజీనీ అనుసంధానిస్తామని అధికారులు తెలిపారు.

లిట్టర్ కంట్రోల్ కాషన్ కెమెరాలు.. పక్కనే మైక్ ఏర్పాటు చేయనున్నారు. ఎవరైనా అనుమతి లేని ప్రాంతాల్లో చెత్త వేస్త సీసీ కెమెరా గుర్తిస్తుంది.. వెంటనే అలారం మోగుతుంది.ఈ వినూత్న ప్రయోగానికి ఉప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు ఇటీవలే శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంత కాలంగా రోడ్డు మూల మలుపుల వద్ద, నిర్మాణుష్య ప్రాంతాలు, రోడ్డు వెంట రాత్రి వేళల్లో కొంతమంది నడుచుకుంటూ, బైక్స్ పై వచ్చి చెత్త వేసి వెళ్తున్నారు. వారిని గుర్తించడం జీహెచ్ఎంసీకి కష్టంగా మారింది. ఇలా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే దురలవాటుకు స్వస్తి పలికేందుకు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నాం’ అని అన్నారు. రోడ్డు మీద చెత్త వేస్తే మీ ఫోటోలు ఆటోమెటిక్ గా సేవ్ అవుతాయి.. మీకు జరిమానా పడుతుంది.

ఈ వ్యవస్థను నగర వ్యాప్తంగా అమలు చేయడంపై బల్దియా కూడా దృష్టి సారించింది. అందువల నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కొత్తగా 23 సీసీ కెమెరాలను అమర్చామని ఆంజనేయులు అన్నారు. ఇప్పటికే 300 మందికి పైగా రోడ్డపై నిర్లక్ష్యంగా చెత్త వేసిన వారిని గుర్తించామని అన్నారు. వారికి రూ.500, రూ.1000 చొప్పున జరిమానా విధించామని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే అలవాటుకు స్తస్థి పలకడంలో సీసీ కెమెరాల ప్రయోగం సక్సెస్ అయ్యిందని జరిమానా విధిస్తారనే భయం జనాల్లో కలుగుతుందని అన్నారు.ఈ ప్రయోగంతో కొంత మేర జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఊపిరి పీల్చుకుంటున్నారని ఆంజనేయులు అన్నారు. అందరం కలిసి హైదరాబాద్ ని సుందర నగరంగా తీర్చి దిద్దాలని కోరారు. ఇకపై చెత్తను చెత్త బుట్టల్లో వేయాలి.. లేదా మున్సిపల్ వెహికిల్స్ లో పడవేయాలి. అంతేకానీ ఇష్టమొచ్చినట్లు ఎక్కడ బడితే అక్కడ వేస్తామంటే సీసీ కెమెరాలు క్లిక్ మనిపించడం.. జెబుకు చిల్లు పడటం ఖాయం అంటున్నారు.

Show comments