Hydలో కల్తీ పాల మాఫియా దారుణం.. ప్రాణాంతకరమైన కెమికల్స్‌తో..

Adulterated Milk Center: కాదేదీ కల్తీకి అనర్హం అన్న చందంగా కల్తీరాయుళ్ళు రెచ్చిపోతున్నారు. కాసులకు కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో అక్కడ కల్తీ దందాలు కొనసాగిస్తూనే ఉన్నారు.

Adulterated Milk Center: కాదేదీ కల్తీకి అనర్హం అన్న చందంగా కల్తీరాయుళ్ళు రెచ్చిపోతున్నారు. కాసులకు కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో అక్కడ కల్తీ దందాలు కొనసాగిస్తూనే ఉన్నారు.

దేశంలో కొంతమంది కేటుగాళ్ళు డబ్బు సంపాదన కోసం ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. తక్కువ సమయంలో లక్షలు సంపాదించాలన్న యావతో ఎదుటి వాళ్ల ప్రాణాలు ఎంత విలువైన విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. మొన్నటి వరకు కారం, వెల్లుల్లి, టీ పొడి, నూనెలు, నెయ్యి, చిన్న పిల్లలు తినే తినుబండారాలు, ఐస్ క్రీమ్ లు కల్తీ జరిగేవి. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు ఇలాంటి మాఫియా పై ఉక్కుపాదం మోపుతున్నాం అని చెబుతున్నారు. కానీ, ఇలాంటి దారుణాలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో కల్తీ పాల మాఫియా గుట్టు రట్టు చేశారు పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లో చిన్నపిల్లలు తాగే పాలను కల్తీ చేసే మాఫియా గుట్టు రట్టు చేశారు SWOT పోలీసులు. కల్తీ పాల గ్యాంగ్ గురించి పక్కా సమాచారం అందడంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పిర్జాదీగూడలో పాల ఉత్పత్రి కేంద్రాలపై దాడులు నిర్వహించారు. గజేందర్ సింగ్ అనే వ్యక్తి తన గ్యాంగ్ తో కలిసి గుట్టుగా కల్తీ పాల దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రమాదకరమైన యాసిడ్స్, పామాయిల్, కెమికల్స్ వంటివి వాడి ఆయా పాలకు బ్రాండెడ్ స్టిక్కర్లు అంటించి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే కల్తీ పాలు, పన్నీరు, బట్టర్, పెరుగు తయారీ చేస్తున్న ముఠాను గుర్తించారు. పాలపొడిలో ఎసిటిక్ యాసిడ్, లిక్విడ్ గ్లూకోజ్, పామాయిల్ కలిపి కల్తీ పాలు తయారుచేస్తూ.. ప్రతిరోజూ దాదాపు 5 వేల లీటర్లకు పైగా పాలను పలు ప్రాంతాల్లోని హూటల్స్, వీధిల్లో ఉండే టీస్టాల్స్ కి సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంత పెద్ద దందా నడుస్తుందన్న విషయం తెలుసుకొని ఎస్ఓటీ పోలీసులు షాక్ కి గురయ్యారు.ఈ క్రమంలోనే సికింద్రబాద్ బోయిగూడకు చెందిన గజేందరర్ సింగ్ న్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం మార్కెట్ లో లభించే ప్రముఖ డెయిరీ పాల ఉత్పత్తుల ధరతో పోలిస్తే వీటి ధర చాలా తక్కువ. అందుకే వీధి వ్యాపారులు, హూటల్ యజమానులు, కొంతమంది వినియోగదారులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ పాల ఉత్పత్తులు వాడటం వల్ల క్రమంగా అనారోగ్యం పాలవుతారని పోలీసులు అంటున్నారు. ఇది బ్రాండెడ్ కంపెనీ పాలకన్నా చాలా చిక్కగా ఉంటాయని, వెన్నె శాతం ఎక్కువగా ఉంటుందని నమ్మిస్తూ వ్యాపారులకు అమ్ముతున్నారు. శ్రీకృష్ణ, కోహినూర్ బ్రాండ్ల పేరుతో తయారు చేసి పాలు, వాటివ అనుబంధ ఉత్పత్తులను నగరంలో దాదాపు 50 నుంచి 70 హూటళ్లకు, పలు స్వీట్ హౌస్ లకు విక్రయించినట్లు ఎస్ఓటీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రధానంగా మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో ఈ నకిలీ దందా సాగుతుందని విమర్శలు వస్తున్నాయి. గౌడౌన్ నుంచి టన్నుల కొద్ది పామాయిల్, మిల్క్ పౌడర్, యాసిడ్ స్వాధానం చేసుకున్నారు పోలీసులు. ఎవరికైనా ఇలాంటి నకిలీ ఉత్పత్తులపై అనుమానాలు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Show comments