P Krishna
CM Revanth Reddy Key Decision: ప్రస్తుతం ఎక్కడికి వెళ్లాలన్నా చేతిలో బైక్ లేదా కారు ఏదో ఒకటి ఉండాల్సిందే. ప్రయాణాలు సులభతరం అవుతుందన్న ఉద్దేశ్యంతో వాహనాల కొనుగోలు విపరీతంగా పెరిగిపోతుంది. నిత్యం వాహనాల రద్దీతో గాలి, శబ్ధ కాలుష్యం పెరిగిపోతుంది.
CM Revanth Reddy Key Decision: ప్రస్తుతం ఎక్కడికి వెళ్లాలన్నా చేతిలో బైక్ లేదా కారు ఏదో ఒకటి ఉండాల్సిందే. ప్రయాణాలు సులభతరం అవుతుందన్న ఉద్దేశ్యంతో వాహనాల కొనుగోలు విపరీతంగా పెరిగిపోతుంది. నిత్యం వాహనాల రద్దీతో గాలి, శబ్ధ కాలుష్యం పెరిగిపోతుంది.
P Krishna
గత కొంత కాలంగా హైదరాబాద్ మహానగరంలో గాలి, శబ్ధ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే కొంత కాలం తర్వాత జనాల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త మోటర్ వెహికల్ పాలసీ తెస్తామని చెప్పారు. 15 ఏళ్లు దాటిన వ్యక్తిగ, ఎనిమిదేళ్లు దాటిని వాణిజ్య వాహనాలు తుక్కుగా (స్క్రాప్) పరిగణించనున్నారు. ఈ పాలసీ ప్రస్తుతానికి గ్రేటర్ హైదరాబాద్ కి మాత్రమే పరిమితం అన్నారు. కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు రాష్ట్రంలో రెండు కేంద్రాలను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం, సిద్దిపేట జిల్లా వర్గల్ సమీపంలో మరొకటి ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు 15 ఏళ్లు దాటిన వాహనాలు ఎన్ని ఉన్నాయి.. వాటిలో హైదరాబాద్ లో తిరుగుతున్న వాహనాలు ఎన్నీ అన్న వివరాల గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 ఏళ్లు దాటిన వాహనాల సంఖ్య 21 లక్షలు. అందులో హైదరాబాద్ నగరంలో తిరుగుతున్న వాహనాల సంఖ్య 9 లక్షలు. అందులో ఎక్కువ శాతం బైకులు ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ సిటీలో 1.3 లక్షల బైకులు, రంగారెడ్డి లో 1.8 లక్షల బైకులు, మేడ్చల్ జిల్లాలో 1.5 లక్షలు, కరీంనగర్ లో 1.5 లక్షలు, నిజామాబాద్ 1.2 లక్షల బైకులకు కాలం చెల్లింది. ఇవి మొత్తం స్క్రాప్ కిందకు వస్తాయని అధికారులు అంటున్నారు. ఇవి రోడ్లపై తిరగడానికి అనుమతి ఉండదు. వీటిని ఇప్పటికిప్పుడే స్క్రాప్ నకు పంపాల్సిన అవసరం లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 15 ఏళ్లు దాటినా ఆ వెహికిల్స్ ఫిట్ నెస్ బాగుంటే.. టెస్ట్ లో పాసయితే మునపటిలా నడుపుకోవచ్చు. ఒకవేళ ఫిట్ నెస్ టెస్ట్ లో ఫెయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా స్క్రాప్‌కు వెళ్లాల్సిందే. వెహికల్ ఫిట్ నెస్ పాసయితే.. రూ.5 వేలు గ్రీన్ ట్యాక్స్ చెల్లించి 5 ఏళ్ల పాటు నడుపుకునే వీలు ఉంటుంది. ఆ తర్వాత కూడా వాహనం ఫిట్ నెస్ ఉందంటే రూ.10 వేలు చెల్లించి మరో ఐదేళ్లు నడుపుకోవచ్చు. అంటే గ్రీన్ ట్యాక్స్ చెల్లించి వెహికిల్స్ నడుపుకోవచ్చు. ఒకవేళ ఫిట్ నెస్ లేకుంటే మాత్రం స్క్రాప్ కి అప్పగించి కొత్త వెహికిల్ కొనుగోలు చేస్తే.. దానికి ట్యాక్స్ మినహాయింపు ఇస్తారు.
ఇక ప్రభుత్వ వాహనాలు, ప్రైవేట్ వాహనాలకు సంబంధించి కేంద్రం తెచ్చిన 15 ఏళ్ల గడువుకు సంబందించిన గ్రీన్ ట్యాక్స్ కింద కొన్ని మినహాయింపులు ఉంటాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన వాహనాలతో పాటు ఆర్టీసీ, గ్రేటర్ మున్నిపల్ కార్పోరేషన్లకు చెందిన కాలం చెల్లిన వాహనాలు 8 నుంచి 10 వేల వరకు ఉండొచ్చు అని అంచనా.. వాటిని దశలవారీగా తుక్కుకు వేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం చూస్తే.. 15 ఏళ్లు దాటిన వాహనాలు హైదరాబాద్ రోడ్లపై తిరగడానికి వీలు లేదు. కాకపోతే ఆ వాహనదారుల ముందు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి..అవేంటో చూద్దాం. 15 ఏళ్లు దాటిన వాహనాలు ఇతర జిల్లాల్లో వాడుకోవచ్చు లేదా వేరే జిల్లాల్లో అమ్మవొచ్చు. పాత వాహనం అప్పగించిన తర్వాత కొత్త వాహనం కొనుగోలు చేయాలి. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో వాహనదారుల గుండెల్లో గుబులు పుడుతుంది. కొంతమంది ఆర్థిక పరిస్థితి వల్ల కొత్త వాహనం కొనుగోలే చేయలేరు. తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ పాలసీ పై తెలంగాణ సర్కార్ స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని వాహనదారులు కోరుతున్నారు.