కలెక్టర్‌ను వదలని కేటుగాళ్లు.. మరో నయా దందాకు తెర తీశారు

ఇటీవల కాలంలో సైబర్ కేటుగాళ్ల నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందది. తరుచు రకరకాల మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు.  తాజాగా ఈసారి ఏకంగా కలెక్టర్‌ పేరుతోనే సైబర్‌ నేరానికి ఒడిగట్టారు. ఇంతకి ఏం జరిగిందంటే..

ఇటీవల కాలంలో సైబర్ కేటుగాళ్ల నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందది. తరుచు రకరకాల మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు.  తాజాగా ఈసారి ఏకంగా కలెక్టర్‌ పేరుతోనే సైబర్‌ నేరానికి ఒడిగట్టారు. ఇంతకి ఏం జరిగిందంటే..

ఈజీ మనీకి అలవాటు పడిపోయిన కొందరు కేటుగాళ్లు ఈ మధ్యకాలంలో లేనిపోని దందాలు, స్కామ్ లు, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా అతి తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులను సంపాదించాలనే మనిషి అత్యాశనే అవకాశంగా మార్చుకుంటూ అమాయక ప్రజలకు వల వేస్తుంటారు. ఈ క్రమంలోనే భారీ మోసాలకు పాల్పడుతూ.. లక్షల రూపాయాలను కొల్లగొడుతుంటారు. అయితే నిన్న మొన్నటి వరకు బ‍్యాంకు మెసేజ్‌లు,  గిప్టులు, కూపన్లు, ఈ కేవైసీలు,కొరియర్‌ ఫార్శిల్స్‌, డ్రగ్స్ పార్శిల్, ఢీప్‌ ఫేక్‌ ఫోటోల పేరుతో అమాయకులను టార్గె్ట్ చేసి మోసాలకు పాల్పడ్డారు. కానీ, ఇప్పుడు కొంచెం రూటు మార్చి సరికొత్త దందాకు పాల్పడుతున్నారు.  ఈసారి తాజాగా కలెక్టర్‌ పేరుతో ఫేస్‌ బుక్‌ అకౌంట్‍ క్రియేట్‍ చేసి సైబర్‌ నేరానికి పాల్పడ్డారు కొందరు కేటుగాళ్లు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవల కాలంలో సైబర్ కేటుగాళ్ల నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందది. తరుచు రకరకాల మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు.  తాజాగా ఈసారి ఏకంగా కలెక్టర్‌ పేరుతోనే సైబర్‌ నేరానికి ఒడిగట్టారు. ఇంతకి ఏం జరిగిందంటే.. వరంగల్‍ కలెక్టర్‍ ప్రావీణ్య పేరుతో కొందరు సైబర్‍ నేరగాళ్లు ఫేక్‍ ఫేస్‍బుక్‍ అకౌంట్‍ క్రియేట్‍ చేశారు. అంతేకాకుండా ప్రొఫైల్‍ కూడా కలెక్టర్ ఫొటోనే పెట్టారు. ఇక ఆ అకౌంట్​నుంచి పలువురికి ఫ్రెండ్​ రిక్వెస్టులు పెట్టడంతోపాటు డబ్బులు కావాలంటూ మెసేజ్​లు పెట్టారు. పైగా డబ్బులు పంపాల్సిన నంబర్​(94776 414080) కూడా ఇచ్చారు. అయితేఈ మెసేజ్‌లకు స్పందించిన వారితో మాటలు కూడా కలిపారు. అలాగే తాను అర్జెంట్​మీటింగ్​లో ఉన్నానని,ఈ నంబర్​కు డబ్బులు పంపి స్క్రీన్​షాట్స్​ పెట్టాలని సూచించారు.

ఇలా కలెక్టర్‌ పేరుతో కొంతమంది ఈ సైబర్‌ నేరాలకు పాల్పడుతుండటంతో.. పలువురి ద్వారా కలెక్టర్‌ ప్రావీణ్య ఈ విషయం తెలుసుకున్నారు.  ఇక వెంటనే తన ఒరిజినల్‍ ఫేస్‍బుక్‍ ఖాతా ద్వారా సైబర్‍ ఫ్రాడ్‍ విషయాన్ని షేర్‍ చేశారు.  అంతేకాకుండా తన పేరుతో ఎవరు డబ్బులడిగినా ఇవ్వొద్దని సూచించారు. అలాగే అలాంటి మెసేజెస్​ వచ్చిన అకౌంట్​ను బ్లాక్‍ చేయాలని చెప్పారు. ఇక విషయం పై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయం తెలిసిన కొందరు ఇలా కలెక్టర్‌ పేరుతోనే మోసాలు చేస్తుండటం చూసి ఆశ్చర్యపోతున్నారు. పైగా పోలీసులు కూడా ఇలాంటి విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఫేక్‌ మోసాలను గుర్తించి జాగ్రత్తగా ఉండాలని చూసిస్తున్నారు. మరి, కలెక్టర్‌ ప్రావిణ్య పేరుతో ఫేస్‌బుక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి మోసాలకు పాల్పడటం మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Show comments