RTC ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

TGSRTC: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. అయితే సీఎం ఆదేశాలనేవి రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయాణికులకు మంచి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు.

TGSRTC: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. అయితే సీఎం ఆదేశాలనేవి రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయాణికులకు మంచి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మహాలక్ష్మీ పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథంకం  అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసిన ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా జీరో టికెట్ తీసుకొని రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే సౌకర్యం ఉండటంతో..  ఆర్టీసీ ప్రయాణికుల రద్దీ రోజు రోజుకి డబుల్ అవుతుంది.  కనీసం టికెట్లు తీసుకొని బస్సులో ప్రయాణించే వారికి సీట్లు కూడా దొరకడం లేదు.

ఒక రకంగా చెప్పలంటే.. బస్సులో కాలు పెట్టేందుకు కూడా చోటు లేని విధంగా ప్రయాణికులతో బస్సులు రద్దీగా నడుస్తున్నాయి. దీంతో పరిస్థితి బాగా దారుణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే చాలామంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యనికి గురవ్వడంతో.. రాష్ట్రంలో అధనంగా ఆర్టీసీ బస్సులు వేయాలంటూ ప్రభుత్వానికి కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ సమస్య పై దృష్టి సారించిన ప్రభుత్వం అదనంగా ఆర్టీసీ బస్సులతో పాటు కొత్తగా కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టారు. అయినా సరే రద్దీ తగ్గకపోవటంతో మరిన్నీ సర్వీసులు నడపాలనే డిమాండ్లు రావడంతో తాజాగా ఈ విషయం పై సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్నతాధికారలుకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలేంటో చూద్దాం.

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి  మంగళవారం సమీక్ష ఏర్పాటు చేసి కీలక సూచనలు జారీ చేశారు. ఇక ఈ సమావేశంలో..   మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆర్టీసీ కార్యకలాపాలపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా.. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటి వ‌ర‌కు 83.42 కోట్ల మంది మ‌హిళ‌లు ఉచితంగా ప్రయాణం చేయగా, తద్వారా ప్రయాణికులకు రూ. 2,840.71 కోట్లు ఆదా అయినట్లు అధికారులు చెప్పారు. దీంతో ఫ్రీ బస్సు పథకం రాష్ట్రంలో సక్సెస్ కావటం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వీలైనంత త్వరగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక  ఈ బస్సులు కనుక అందుబాటులోకి వస్తే.. ప్రయాణికుల ఇబ్బందులు తీరనున్నాయని, ఇకపై ఎవరు బస్సులో నిల్చొని ప్రయాణం చేయకుండా.. సంతోషంగా కూర్చొని ప్రయాణించే అవకాశం ఉంటుదని పేర్కొన్నారు. మరీ, రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయాణికుల సమస్య పై దృష్టి సారించి అదనంగా బస్సులు  ఏర్పాటు చేయాలని సర్కార్ ఇచ్చిన ఆదేశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments