హైడ్రా బాధితులకు అండగా సీఎం.. కీలక నిర్ణయం!

HYDRAA: నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా మునపటి కంటే ఇప్పుడు కాస్త జోరు పెంచిందనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఏకకాలంలో నగరంలో పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణా భవనాలను కూల్చివేసింది. దీంతో చాలామంది మధ్యతరగతి కుటుంబాలు నిలువ నీడ లేకపోవడంతో వాపోతున్నారు. అయితే ఈ విషయం స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అధికారులకు తాజాగా కీలక ఆదేశాలను జారీ చేశారు. అలాగే హైడ్రా బాధితులను దృష్టిలో పెట్టుకొని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

HYDRAA: నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా మునపటి కంటే ఇప్పుడు కాస్త జోరు పెంచిందనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఏకకాలంలో నగరంలో పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణా భవనాలను కూల్చివేసింది. దీంతో చాలామంది మధ్యతరగతి కుటుంబాలు నిలువ నీడ లేకపోవడంతో వాపోతున్నారు. అయితే ఈ విషయం స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అధికారులకు తాజాగా కీలక ఆదేశాలను జారీ చేశారు. అలాగే హైడ్రా బాధితులను దృష్టిలో పెట్టుకొని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మణాలపై హైడ్రా ఏ స్థాయిలో కొరడా ఝులిపిస్తోందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా రోజు రోజుకి మరీంత దూకుడుగా వ్యవహారిస్తుంది. ఇక ఈ విషయంలో సామాన్యులు, ధనవంతులు, సెలబ్రిటీస్ లేకుండా.. రూల్స్ కి భిన్నంగా ఉన్న నిర్మాణా భవనాలను గుర్తించి హైడ్రా నిర్ధాక్ష్యణంగా కూల్చేస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు హైడ్రా మునపటి కంటే ఇప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేతపై కాస్త జోరు పెంచిందనే చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే.. ఏకకాలంలో హైడ్రా కూకట్‌పల్లిలో, అమీన్‌పూర్‌ మునిసిపాలిటీలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో ప్రభుత్వ భూములును అక్రమించి నిర్మించిన కోట్ల రూపాయాల విల్లాలను నేలమట్టం చేసింది. దీంతో నగరంలో హైడ్రా ఉక్కుపాదంలో పేదలు, మధ్యతరగతి కుటుంబాలు కూడా నలిగిపోతున్నారు. అంతేకాకుండా.. నిలవ నీడ కూడా లేకుండా రోడ్డున పడుతున్నమంటూ వాపోతున్నారు. అయితే ఈ విషయం స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అధికారులకు తాజాగా కీలక ఆదేశాలను జారీ చేశారు. అలాగే హైడ్రా బాధితులను దృష్టిలో పెట్టుకొని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, హైదరాబాద్ మెట్రో రైలుపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నిన్న సమావేశమయ్యారు. ఇక ఈ సమావేశానికి MA&UD ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ హజరయ్యారు. అయితే ఆ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి  మాట్లాడుతూ.. నగరంలో చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు… మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు.

అంతేకాకుండా.. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇకపోతే ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. మరి, హైడ్రా బాధితుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments