Tirupathi Rao
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు వడ్డీలేని రుణాల పథకం ప్రారంభం ఎప్పటినుంచి అనేది వెల్లడించారు.
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు వడ్డీలేని రుణాల పథకం ప్రారంభం ఎప్పటినుంచి అనేది వెల్లడించారు.
Tirupathi Rao
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రోజునుంచి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ పోతోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తోంది. రూ.500 గ్యాస్ సింలిండర్ కు సంబంధించి కూడా వేగంగా చర్యలు తీసుకుంటోంది. అలాగే నెలకు రూ.2500 పథకం, వడ్డీలేని రుణాలు కూడా ఉన్నాయి. వీటిలో ప్రభుత్వం తాజాగా వడ్డీలేని రుణాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ రుణాలకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన హామీలను శరవేగంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఫ్రీ బస్ అమలు అవుతుండగా.. రూ.500కే గ్యాస్ సిలిండర్ పై కూడా విధి విధానాలు ప్రకటించాల్సి ఉంది. అలాగే ఇప్పుడు అందరూ వడ్డీలేని రుణాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అందుకు సంబంధించి ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. వడ్డీలేని రుణాలకు సంబంధించి శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ రుణాలపై అధికారులతో కూలంకషంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. సమీక్ష తర్వాత వడ్డీలేని రుణాలపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ పథకాన్ని మార్చి 12న ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అంటే ఇంకో మూడ్రోజుల్లో వడ్డీలేని రుణాల పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. “తెలంగాణలో ఉన్న ఆడవాళ్లని కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మిలా భావిస్తోంది. వారిని తగిన రీతిలో గౌరవిస్తోంది. కానీ, గత ప్రభుత్వం సహాయక బృందాలను నిర్వీర్యం చేసింది. ఈ వడ్డీలేని రుణాల పథకం ద్వారా సూక్ష్మ, చిన్న పరిశ్రమలు స్థాపించుకునేందుకు మహిళా సంఘాలకు అవకాశం కల్పిస్తాం” అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఈ వడ్డీలేని రుణాల వల్ల మహిళలకు ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడగలిగే శక్తి లభిస్తుంది. మరో కొంత మందికి ఉపాధి కల్పించేందుకు ఆస్కారం కూడా దొరుకుతుంది.
ఈ రుణాలు వడ్డీలేనివి కాబట్టి వ్యాపారం అభివృద్ధి చెందితే లాభాలు కూడా ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇంక ఈ వార్త విన్న తర్వాత తెలంగాణ రాష్ట్ర మహిళల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ రుణాలతో వారి కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు లభించినట్లు అవుతుందంటూ అభిప్రాయ పడుతున్నారు. అలాగే రైతు బంధు మీద భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలలకు రైతుబంధు ప్రారంభించింది అన్నారు. వారికంటే తక్కువ సమయంలోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినట్లు తాము కొండలు, గుట్టలు, రోడ్లకు రైతుబంధు ఇవ్వమని చెప్పారు. ప్రస్తుతానికి పాత డేటా ప్రకారం 4 ఎకారాల లోపు ఉన్న వారికి డబ్బు జమ చేస్తామన్నారు. త్వరలో ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి రైతుబంధు ఇస్తామన్నారు. అలాగే వ్యవసాయ పంపులకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు అంటూ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.