Keerthi
తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన భారత్ రైస్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ రైస్ విక్రయాలు అనేవి కొన్ని ప్రైవేట్ సంస్థలు, వ్యాపారుల ద్వారా మొదలయ్యాయి. అంతేకాకుండా.. ఈ భారత్ రైస్ అనేవి హైదరాబాద్ నగరంలో పలు స్టోర్లలో అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. ఇంతకి ఈ భారత్ రైస్ హైదరాబాద్ లో ఎక్కడ అమ్ముతున్నారో తెలుసుకుందాం.
తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన భారత్ రైస్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ రైస్ విక్రయాలు అనేవి కొన్ని ప్రైవేట్ సంస్థలు, వ్యాపారుల ద్వారా మొదలయ్యాయి. అంతేకాకుండా.. ఈ భారత్ రైస్ అనేవి హైదరాబాద్ నగరంలో పలు స్టోర్లలో అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. ఇంతకి ఈ భారత్ రైస్ హైదరాబాద్ లో ఎక్కడ అమ్ముతున్నారో తెలుసుకుందాం.
Keerthi
ప్రస్తుతం మార్కెట్ లో బియ్యం ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అయితే దేశమంతటా వరి ఉత్పత్తి బాగా పెరిగినప్పటికీ.. బియ్యం ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం భారత్ రైస్ అందిస్తామని ప్రకటించింది.కేవలం రూ. 29కే సన్నబియ్యం అందిస్తామని చెప్పి 50 రోజులు కావొస్తున్నా.. కేంద్రం నుంచి బియ్యం జాడే ఇప్పటి వరకు లేదు. అయితే అతి తక్కువ ధరకు సబ్సిడీ బియ్యం ఎప్పుడూ వస్తాయా.. అని సామన్యులు, నిరుపేద ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్నా భారత్ రైస్ కోసమే అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ భారత్ రైస్ అనేది తాజాగా మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ రైస్ విక్రయాలు అనేవి కొన్ని ప్రైవేట్ సంస్థలు, వ్యాపారుల ద్వారా మొదలయ్యాయి. ఇంతకి ఈ భారత్ రైస్ హైదరాబాద్ లో ఎక్కడ అమ్ముతున్నారంటే..
తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన భారత్ రైస్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ రైస్ విక్రయాలు అనేవి కొన్ని ప్రైవేట్ సంస్థలు, వ్యాపారుల ద్వారా మొదలయ్యాయి. కాగా, ఈ రైస్ విక్రయ బాధ్యతలను..నేషనల్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్)(NAFED), నేషనల్ కో–ఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సీసీఎఫ్), కేంద్రీయ భండార్ వంటి సంస్థలకు అప్పగించింది. ప్రస్తుతం భారత్ రైస్ విక్రయాలు అనేవి నాఫెడ్ ద్వా రా గ్రేటర్ పరిధిలోని 24 కేంద్రాల్లో జరుగుతున్నాయి. దాదాపు 15 రోజుల నుంచి ఈ అమ్మకాలు మొదలుపెట్టినట్లు నాఫెడ్ అధికారులు తెలిపారు. ఇక తెలంగాణలో భారత్ రైస్ విక్రయాలను 5 వేల క్వింటాళ్ల వరకు అమ్మకాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా తెలిపారు. కానీ, ఎటువంటి ప్రచారం లేకపోవడంతో.. భారత్ రైస్ అమ్మకాలు ఊపందుకోలేదు. ఈ రైస్ మొదటి రకానికి అయి ఉంటాయని చాలా మంది భావించారని, అన్నం వండిన తర్వాత కాస్త దొడ్డుగా ఉంటోందని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు.
ఇక అన్నం రుచిగా ఉంటున్నప్పటికీ.. సన్నగా ఉండకపోవడం వల్ల చాలామంది ఈ రైస్ పై ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. ఓ ట్రెడర్ తెలిసిన వారికి పది కిలోల బ్యాగ్‌లను విక్రయించానని తెలిపారు. అయితే పది కిలోల బ్యాగ్‌లను 40 వరకు తెచ్చి, అమ్మడానికి నానా తంటాలు పడ్డానని చెప్పారు. కాగా, రెండోసారి ఎవరూ ఈ బియ్యం తీసుకోలేదన్నారు. అలాగే, కాచిగూడలోని ఓ ట్రేడర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. తాను 15 రోజుల నుంచి అమ్మకాలు చేస్తున్నానని, వినియోగదారులకు ముందుగా నమునా బియ్యం చూపించి విక్రయిస్తున్నానని చెప్పారు. మొదట 10 కిలోల బ్యాగులు 200 తెప్పించి, పూర్తిగా విక్రయించానని, రెండో సారి 100 తీసుకొచ్చినట్లు తెలిపారు. మరి నగరంలో పలు ప్రాంతాల్లో ఈ భారత్ రైస్ ను పంపిణీ చేస్తున్నారు. అయితే ఆ పంపీణీ కేంద్రాలు ఈ కింద విధంగా ఉన్నాయి.