స్కూల్ హాస్టల్ బిల్డింగ్ పైకి వెళ్లిన స్టూడెంట్.. కాసేపటికే

వాతావరణం చల్లగా ఉండటంతో ఎంజాయ్ చేద్దామని స్కూల్ హాస్టల్ మేడ మీదకు స్నేహితురాలితో కలిసి వెళ్లింది పదో తరగతి అమ్మాయి. ఫ్రెండ్ కిందకు వెళ్లగా.. ఒక్కర్తే మేడ మీద ఉంది. అంతలోనే..

వాతావరణం చల్లగా ఉండటంతో ఎంజాయ్ చేద్దామని స్కూల్ హాస్టల్ మేడ మీదకు స్నేహితురాలితో కలిసి వెళ్లింది పదో తరగతి అమ్మాయి. ఫ్రెండ్ కిందకు వెళ్లగా.. ఒక్కర్తే మేడ మీద ఉంది. అంతలోనే..

ఆడపిల్లలు చదువుల తల్లి సరస్వతి దేవీలతో పోలుస్తుంటారు. ఈ రోజుల్లో తమ కాళ్ల మీద తాము నిలబడాలని, తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలని, ఇళ్లు, బంగారం కొనుక్కోవాలని ఆలోచిస్తున్నారు. ఆ తర్వాతే పెళ్లి ప్రస్తావన తెస్తున్నారు. ఒకప్పుడు 18 కాగానే పెళ్లి ఎప్పుడు..? పప్పన్నం ఎప్పుడు పెడతారంటూ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అయ్యేవారు పేరెంట్స్. కానీ నేడు సెటిల్ అయ్యాకే చేస్తామని చెబుతున్నారు. కానీ ఇంతలోనే అనూహ్యంగా ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. తాజాగా అల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. బిల్లింగ్ పై నుండి పడిపోయింది. వెంటనే ప్రిన్సిపాల్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ఆత్మహత్య యత్నంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని అల్లాపూర్ గురుకుల పాఠశాలలో బేగరి మల్లీశ్వరి అనే యువతి పదో తరగతి చదువుతోంది. సోమవారం ఉయం 7 గంటలకు మరో విద్యార్థినితో కలిసి హాస్టల్ బిల్లింగ్ పైకి వెళ్లింది. కాసేపటికే ఆమెకు తోడుగా వచ్చిన విద్యార్థిని కిందకు వచ్చేగా.. మల్లీశ్వరీ అక్కడే ఉండిపోయింది. అక్కడ ఓసైడ్ వాల్ ఎత్తుగా ఉండటంతో బకెట్ పైన నిల్చుని వాతావరణాన్ని చూస్తుండగా.. హఠాత్తుగా కిందకు పడిపోయింది. అయితే సైడ్ వాల్ పట్టుకుని పదినిమిషాలు వేలాడగా.. పట్టు తప్పి కిందకు పడిపోయింది. రెండో అంతస్థు నుండి పడిపోవడంతో మల్లీశ్వరీకి తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. తనను ఎవరో తేసేశారంటూ చెబతుంది. తన కాళ్లు పట్టుకుని ఎవరో కిందకు నెట్టారని చెబుతుంది.

కింద పడిన ఆమెను ప్రిన్పిపల్ హుటాహుటిన జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి, ఆపై సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారుు. మల్లీశ్వరీ మల్లీశ్వరి బ్యాక్ బోన్, కుడికాలు, పక్కటెముకలు విరిగాయని డాక్టర్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మల్లీశ్వరిని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రిన్సిపాల్ మాత్రం ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదంటూ.. అందుకే ఆత్మహత్యాయత్నం చేసి ఉండవచ్చునని చెబుతున్నారు. తోసేశారని చెబుతున్న మాటల్లో నిజం లేదని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. మల్లీశ్వరీ తల్లిదండ్రులు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని చెబుతున్నారు. మల్లీశ్వరీ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

Show comments