Honor నుంచి రెండు కొత్త 5జి ఫోన్స్ లాంచ్.. తక్కువ ధర, క్రేజీ ఫీచర్లు!

Honor: హానర్ నుంచి కొత్తగా హానర్ ఎక్స్60, హానర్ ఎక్స్60 ప్రొ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇవి తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ ఫీచర్లని కలిగి ఉన్నాయి.

Honor: హానర్ నుంచి కొత్తగా హానర్ ఎక్స్60, హానర్ ఎక్స్60 ప్రొ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇవి తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ ఫీచర్లని కలిగి ఉన్నాయి.

బడ్జెట్ ధరలో మంచి స్మార్ట్ ఫోన్స్ తీసుకొచ్చే కొంపెనీలు కొన్ని ఉన్నాయి. వాటిలో హానర్ కంపెనీ కచ్చితంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ తో పాటు క్రేజీ స్పెసిఫికేషన్స్ తో కొత్త మొబైల్స్ ను లాంఛ్ చేస్తుంది. అది కూడా అందుబాటు ధరకే. ఇప్పటికే ఎన్నో క్రేజీ ఫోన్లని తీసుకొచ్చిన హానర్ తాజాగా మరో రెండు క్రేజీ 5జి ఫోన్లని లాంచ్ చేసింది. ఇందులో అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి. యువతను కచ్చితంగా ఈ క్రేజీ ఫీచర్స్ ఆకట్టుకోవడం ఖాయం. Honor X60 సిరీస్ లో Honor X60, Honor X60 Pro అనే రెండు మొబైల్స్ లాంచ్ చేసింది కంపెనీ. ఇక ఈ బ్రాండ్ న్యూ 5 జి స్మార్ట్ ఫోన్స్ లో ఎలాంటి ఫీచర్లు వస్తాయి? వీటి ధరలు ఎంత? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముందుగా Honor x 60 విషయానికి వస్తే.. ఈ ఫోన్ డిస్ ప్లేను చాలా బాగా డిజైన్ చేశారు. దీన్ని రెగ్యులర్ గా కాకుండా లేటెస్ట్ వెర్షన్ లో డిజైన్ చేశారు. ఇది 6.8 ఇంచెస్ ఉంటుంది. ఇది FHD + 120 HZ LED స్క్రీన్. 850 బ్రైట్నెస్ తో మిలమిల మెరిసిపోతుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా 6nm ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇక ర్యామ్ విషయానికి వస్తే 12GB దాకా RAM ఉంటుంది. ఇందులో 512GB దాకా ఇంటర్నల్ ఆన్‌బోర్డ్ స్టోరేజీ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో అన్నిటికంటే కూడా కెమెరా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. దీనికి 108 MP Samsung HM 6 బ్యాక్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ Honor x 60 స్మార్ట్ ఫోన్ కి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. హానర్ స్టాండర్డ్ వేరియంట్ లో 35 w ఫాస్ట్ ఛార్జింగ్ ఆడాప్టర్, 5800 mah బ్యాటరీలు ఉంటాయి. ఇందులో హై స్టాండర్డ్ సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.

ఇక Honor X60 Pro విషయానికి వస్తే.. దీనికి 66 w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పెద్ద బ్యాటరీ ఉంటుంది. ఇది 6600 mah బ్యాటరీ. ఇది స్కై బ్లూ, బర్నింగ్ ఆరెంజ్, బ్లాక్ కలర్స్ లో వస్తుంది. దీని ఫీచర్స్ కూడా honor x 60 లాగానే ఉంటాయి. దీని స్క్రీన్ 6.8 ఇంచెస్ ఉంటుంది. ఇది FHD + 120 HZ LED స్క్రీన్. 850 బ్రైట్నెస్ తో ఈ స్క్రీన్ వస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ కూడా మీడియా టెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా 6nm ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇక ర్యామ్ విషయానికి వస్తే 12GB దాకా RAM ఉంటుంది. ఇందులో కూడా 512GB దాకా ఇంటర్నల్ ఆన్‌బోర్డ్ స్టోరేజీ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో కూడా కెమెరానే స్పెషల్ అట్రాక్షన్. దీనికి 108 MP Samsung HM 6 బ్యాక్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో కూడా హై స్టాండర్డ్ సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్స్ ధరల విషయానికి వస్తే.. HONOR X60 8GB+128GB వేరియంట్ 14,160 రూపాయలు, HONOR X60 8GB+256GB – Rs. 16,520, HONOR X60 12GB+256GB – Rs. 18,880, HONOR X60 12GB+512GB – Rs. 21,245, HONOR X60 Pro 8GB+128GB – Rs. 17,700, HONOR X60 Pro 8GB+256GB – Rs. 20,065, HONOR X60 Pro 12GB+256GB – Rs. 23,605 దాకా ఉంటాయి. ప్రస్తుతం చైనాలో చలామణి అవుతున్న ఈ స్మార్ట్ ఫోన్లు త్వరలోనే ఇండియాలో సేల్స్ జరుపుకొనున్నాయి. ఇక తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ తో రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments