Nidhan
పొట్టి కప్పులో ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. లీగ్ స్టేజ్‌లో ఫ్లాప్ అయిన కింగ్.. సూపర్-8లో అయినా గాడిన పడాలని అనుకుంటున్నాడు.
పొట్టి కప్పులో ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. లీగ్ స్టేజ్‌లో ఫ్లాప్ అయిన కింగ్.. సూపర్-8లో అయినా గాడిన పడాలని అనుకుంటున్నాడు.
Nidhan
టీ20 ప్రపంచ కప్-2024 కీలక దశకు చేరుకుంది. గ్రూప్ స్టేజ్ మ్యాచెస్‌తో ఆడియెన్స్‌కు మస్తు వినోదాన్ని పంచిన జట్లు.. సూపర్-8 ఫైట్స్‌తో మరింత ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక మీదట అన్నీ నాకౌట్ మ్యాచ్‌లే కానున్నాయి. ఓడితే రేసులో ఉండటం కష్టం.. కాబట్టి గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డిందేకు టీమ్స్ రెడీ అవుతున్నాయి. సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే నెగ్గడం తప్ప ఇంకో ఆప్షన్ లేకపోవడంతో తమ రియల్ టాలెంట్‌ను బయటకు తీసేందుకు ఆటగాళ్లు కూడా సన్నద్ధమవుతున్నారు. టీమిండియా ప్లేయర్లు కూడా నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. సూపర్ పోరులో ఆఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ బెండు తీయాలని ఫిక్స్ అయ్యారు.
సూపర్-8లో భాగంగా రేపు డేంజరస్ టీమ్ ఆఫ్ఘానిస్థాన్‌ను ఢీకొట్టనుంది టీమిండియా. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి ఆసీస్, బంగ్లాకు వార్నింగ్ ఇవ్వాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కింగ్ కోహ్లీ ఫామ్ జట్టును ఇబ్బంది పెడుతోంది. మెగా టోర్నీలో ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి 5 పరుగులు చేసిన విరాట్.. అందర్నీ తీవ్రంగా నిరుత్సాహపర్చాడు. మ్యాన్ విన్నర్ అవుతాడనుకుంటే టీమ్‌కు భారంగా మారాడు. రెగ్యులర్‌గా ఆడే థర్డ్ డౌన్లో కాకుండా ఓపెనర్‌గా వచ్చి అతడు ఫెయిల్ అవుతున్నాడు. ఫస్ట్ బాల్ నుంచి గుడ్డిగా బాల్‌ను ఊపేందుకు ప్రయత్నించి బౌలర్లకు దొరికిపోతున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అతడికి కీలక సూచన చేశాడు. ఫామ్ అందుకోవాలంటే కోహ్లీ దూకుడును వదిలేయాలని చెప్పాడు.
‘విరాట్ కోహ్లీ తిరిగి గాడిన పడాల్సిన సమయం వచ్చేసింది. ఆఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌లో అతడు ఫామ్‌ను అందుకోవాలి. తిరిగి టచ్‌లోకి రావడానికి ఈ మ్యాచ్‌ను వాడుకోవాలి. ఆఫ్ఘాన్ చిన్న టీమ్ అని చెప్పి ఈ మ్యాచ్‌తో ఫామ్‌ను అందుకోవాలని చెప్పడం లేదు. కోహ్లీ సామర్థ్యం ఏంటో అందరికీ తెలుసు. అతడు బిగ్ మ్యాచెస్ ప్లేయర్. వరల్డ్ కప్‌కు ముందు అతడు పరుగుల వరద పారించాడు. ఆ లయను తిరిగి అందుకోవాలి. మెగాటోర్నీలో కోహ్లీ అగ్రెసివ్నెస్ వల్ల ఫెయిల్ అవుతున్నాడు. అనవసర దూకుడు అతడ్ని పరుగులు చేయకుండా ఆపుతోంది. అటాకింగ్ అప్రోచ్‌ను పక్కనబెట్టి క్రీజులో కుదురుకోవడంపై అతడు ఫోకస్ చేయాలి. వికెట్ మీద నిలదొక్కుకుంటే పరుగులు అవే వస్తాయి. పిచ్‌పై సెటిల్ అయితే ఫామ్ అదే వచ్చేస్తుంది’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కోహ్లీ క్రీజులో ఎక్కువ టైమ్ గడపాలని, అక్కడ సెటిల్ అవడం మీద దృష్టి పెట్టాలని పేర్కొన్నాడు. ఈ పని చేస్తే అతడికి తిరుగుండదని స్పష్టం చేశాడు. మరి.. కోహ్లీ ఫామ్ అందుకోవాలంటే ఏం చేయాలని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
Akash Chopra “Virat Kohli should return to form against afghanistan,not bcz of opponents but bcz of the caliber & the form he exhibited coming into WC.He dismissed bcz of overlay aggressiveness but if he give himself a time then his form won’t be concern”pic.twitter.com/5yQuDACRwk
— Sujeet Suman (@sujeetsuman1991) June 19, 2024