అఫీషియల్: లక్నో మెంటార్​గా లెజెండ్ జహీర్ ఖాన్.. స్పెషల్ వీడియోతో అనౌన్స్​మెంట్!

Zaheer Khan Appointed As New Mentor For LSG: లక్నో సూపర్ జియాంట్స్​కు కొత్త మెంటార్ వచ్చేశాడు. ఓ టీమిండియా దిగ్గజం ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకున్నాడు. స్పెషల్ వీడియోతో నయా మెంటార్​ గురించి అనౌన్స్​మెంట్ చేసింది ఎల్​ఎస్​జీ.

Zaheer Khan Appointed As New Mentor For LSG: లక్నో సూపర్ జియాంట్స్​కు కొత్త మెంటార్ వచ్చేశాడు. ఓ టీమిండియా దిగ్గజం ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకున్నాడు. స్పెషల్ వీడియోతో నయా మెంటార్​ గురించి అనౌన్స్​మెంట్ చేసింది ఎల్​ఎస్​జీ.

ఐపీఎల్-2025కు ఇంకా చాలా టైమ్ ఉంది. మెగా ఆక్షన్ కూడా ఏడాది ఆఖర్లో జరగనుంది. కానీ ఇప్పటి నుంచే ఫ్రాంచైజీలు అలర్ట్ అవుతున్నాయి. తమకు కావాల్సిన ప్లేయర్లను అట్టి పెట్టుకోవడం, వద్దనుకున్న వారికి బైబై చెప్పడం స్టార్ట్ చేస్తున్నాయి. ఈ మేరకు వారికి సమాచారం ఇస్తున్న టీమ్స్.. కోచింగ్ స్టాఫ్​ను కూడా మార్చేస్తున్నాయి. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్​కు ఢిల్లీ క్యాపిటల్స్ టాటా చెప్పేసింది. ఇతర జట్లు కూడా తమ కోచ్​లు, కెప్టెన్లను మార్చే పనిలో పడ్డాయి. ఈ తరుణంలో లక్నో సూపర్ జియాంట్స్ ఫ్రాంచైజీ కీలక ప్రకటన చేసింది. తమ కొత్త మెంటార్​గా టీమిండియా లెజెండరీ పేసర్ జహీర్​ ఖాన్​ను నియమించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది ఎల్​ఎస్​జీ.

లక్నోలోని యంగ్ క్రికెటర్లు బౌలింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది ఎల్​ఎస్​జీ. ఈ ప్లేయర్లందరూ జహీర్ ఖాన్ బౌలింగ్ యాక్షన్​ను కాపీ చేస్తూ కనిపించారు. అతడి మాదిరిగానే పరిగెత్తుతూ జంప్ చేసి బౌలింగ్ చేశారు. ఆ తర్వాత జహీర్​ భారత్ తరఫున ఆడినప్పటి విజువల్స్​ను చూపించారు. ఆఖర్లో ఎంట్రీ ఇచ్చిన జహీర్.. లక్నోకు వచ్చేశా అని అన్నాడు. ఈ వీడియోతో పాటు మరో ఫొటోను ఎల్​ఎస్​జీ ఫ్రాంచైజీ షేర్ చేసింది. ఇందులో టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా 34వ నంబర్ జెర్సీని జహీర్​కు ఇస్తూ జట్టులోకి ఆహ్వానించడాన్ని చూడొచ్చు. జహీర్ లక్నోకు మెంటార్​గా వెళ్లడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. సరైనోడ్ని దింపారని, ఇంక ఎల్​ఎస్​జీకి తిరుగుండదని అంటున్నారు.

గౌతం గంభీర్​కు సరైన రీప్లేస్​మెంట్ జహీర్ అని అంటున్నారు నెటిజన్స్. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ క్రికెట్​తో పాటు ఐపీఎల్​లో అతడికి సుదీర్ఘ కాలం ఆడిన అనుభవం ఉందని.. అది టీమ్​కు ఎంతో ప్లస్ చేస్తుందని చెబుతున్నారు. కూల్​గా, కామ్​గా తన పని తాను చేసుకుపోయే జహీర్ వల్ల ఎంతో మంది యంగ్ టాలెంట్ వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక, మెంటార్​గా బాధ్యతలు చేపట్టిన జహీర్ తన బెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఈ పొజిషన్​లో ఉన్న గంభీర్.. మెంటార్​గా సక్సెస్ అయ్యాడు. లక్నో టీమ్​ను బాగా నడిపించాడు. ఆ తర్వాత కేకేఆర్​కు మెంటార్​గా వెళ్లి అక్కడా సక్సెస్ అయి.. ఇప్పుడు టీమిండియా కోచ్​గా బిజీగా ఉన్నాడు. గౌతీ రోల్​లోకి వెళ్తున్నాడు కాబట్టి జహీర్​పై అంచనాలు, ఒత్తిడి రెండూ ఉంటాయి. దీన్ని అధిగమించి అతడు టీమ్​ను ఎలా నడిపిస్తాడో చూడాలి. మరి.. ఎల్​ఎస్​జీ మెంటార్​గా జహీర్ సక్సెస్ అవుతాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

Show comments