శిఖర్ ధావన్ రిటైర్మెంట్‌పై యువరాజ్‌ సింగ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌!

Yuvraj Singh Emotional On Shikhar Dhawan Retirement: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అతడు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. గబ్బర్ రిటైర్మెంట్ పై లెజెండ్ యువరాజ్ సింగ్ రియాక్ట్ అయ్యాడు.

Yuvraj Singh Emotional On Shikhar Dhawan Retirement: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అతడు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. గబ్బర్ రిటైర్మెంట్ పై లెజెండ్ యువరాజ్ సింగ్ రియాక్ట్ అయ్యాడు.

టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అతడు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ తో పాటు డొమెస్టిక్ క్రికెట్ కు అతడు గుబ్ బై చెప్పేశాడు. ఇన్నాళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందన్న గబ్బర్.. తన ప్రయాణంలో సహకరించిన బీసీసీఐ, చిన్ననాటి కోచ్ లు, కుటుంబం, అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. దేశం కోసం ఎంతో ఆడానని, ఇక మీదట ఛాన్స్ రాదని తన మనసుకు చెబుతున్నానని తెలిపాడు. ధావన్ రిటైర్మెంట్ పై అతడి సహచర క్రికెటర్లు రియాక్ట్ అవుతున్నారు. తాజాగా లెజెండ్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ఈ విషయంపై ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

ధావన్.. అద్భుతమైన కెరీర్ కు కంగ్రాట్స్. నీలాంటి అసామాన్యమైన ఆటగాడితో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నందుకు గర్వంగా ఉంది. దక్కిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడం నీకే సాధ్యమైంది. ప్రతి మ్యాచ్ లోనూ 100 పర్సెంట్ ఎఫర్ట్ పెట్టావ్. దేనికీ భయపడకుండా నువ్వు ఆడిన ఫియర్ లెస్ నాక్స్ అద్భుతం. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్స్ లో నువ్వు ఆడిన తీరు సూపర్. ఫార్మాట్లకు అతీతంగా ఆడిన ప్రతి చోట మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడటం నిన్ను రియల్ గబ్బర్ చేశాయి. అందుకే నిన్ను చూసి అపోజిషన్ టీమ్స్ భయపడేవి. లెజెండ్స్ క్లబ్ లోకి నీకు స్వాగతం మిత్రమా‘ అని ఆ పోస్ట్ లో యువరాజ్ రాసుకొచ్చాడు.

ఐసీసీ టోర్నీల్లో ధావన్ లా అంత ఫియర్ లెస్ గా ఆడటం ఈజీ కాదన్నాడు యువరాజ్. దేనికీ భయపడకుండా ఆడే అతడి నేచర్ ను చూసి ప్రత్యర్థులు వణికేవారని చెప్పాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో సాధించిన ఈ అపూర్వ ఘనతల విషయంలో ధావన్ గర్వపడాలన్నాడు యువీ. రిటైర్మెంట్ తర్వాత కూడా అతడు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. గబ్బర్ కు దేవుడి ఆశీస్సులు ఉంటాయన్నాడు యువీ. ధావన్ రిటైర్మెంట్ మీద నెటిజన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. మిస్టర్ ఐసీసీ మెరుపుల్ని ఇక క్రికెట్ లో చూడలేమని అంటున్నారు. ధావన్ ను చూసి యంగ్ జనరేషన్ ఇన్ స్పైర్ అవ్వాలని చెబుతున్నారు. అతడిలా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడటం, ఫియర్ లెస్ అప్రోచ్ తో ముందుకు వెళ్లడం నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ధావన్ లాంటి ఆటగాళ్ల అవసరం టీమిండియాకు ఎంతో ఉందని చెబుతున్నారు.

Show comments