జైస్వాల్‌ గురించి రోహిత్‌ చెప్పిన మాట అక్షర సత్యమైంది!

Yashasvi Jaiswal-Rohit Sharma: టీమిండియా యువ సంచలనం యశస్వీ జైస్వాల్ గురించి రోహిత్ శర్మ్ గతంలో చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలుగా దర్శనమిస్తున్నాయి. మరి రోహిత్ చేసిన ఆ వ్యాఖ్యలు ఏంటి? ఆ వివరాలు..

Yashasvi Jaiswal-Rohit Sharma: టీమిండియా యువ సంచలనం యశస్వీ జైస్వాల్ గురించి రోహిత్ శర్మ్ గతంలో చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలుగా దర్శనమిస్తున్నాయి. మరి రోహిత్ చేసిన ఆ వ్యాఖ్యలు ఏంటి? ఆ వివరాలు..

‘అద్భుతాలు జరిగే ముందు ఎవ్వరూ గుర్తించరు.. జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు’ అన్న త్రివిక్రమ్ డైలాగ్ మనందరికి తెలిసిందే. కానీ కొన్ని అద్భుతాలను ముందుగానే పసిగడతారు కొందరు మహానుభావులు. అలా రోహిత్ పసిగట్టిన అద్భుతమే యశస్వీ జైస్వాల్. కొన్ని సంవత్సరాల క్రితమే జైస్వాల్ ఆటను గుర్తించిన హిట్ మ్యాన్.. టీమిండియాకు కాబోయే నెక్స్ట్ సూపర్ స్టార్ ఇతడే అంటూ కితాబిచ్చాడు. ఆ మాటలు అక్షర సత్యాలుగా నేడు మన ముందు నిలుస్తున్నాయి. ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో అద్వితీయమైన ద్వితియ సెంచరీ సాధించాడు ఈ యువ ఆటగాడు.

యశస్వీ జైస్వాల్.. ప్రస్తుతం టీమిండియాలో మారుమ్రోగుతున్న పేరు. అద్భుతమైన ఆటతీరుతో అతి తక్కువ కాలంలోనే జట్టులో కీ ప్లేయర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ లా బ్యాటింగ్ చేస్తూ.. బౌలర్లకు వణుకుపుట్టిస్తున్నాడు. ఆడింది తక్కువ మ్యాచ్ లే అయినప్పటికీ.. జట్టుకు తానెంత అవసరమో సమయం వచ్చినప్పుడల్లా చాటిచెబుతూనే ఉన్నాడు. తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. రోహిత్, గిల్, అయ్యర్ లాంటి స్టార్ బ్యాటర్లు విఫలం అయిన వేళ.. ఒక్కడే ఇంగ్లీష్ బౌలర్లకు ఎదురొడ్డి నిలబడ్డాడు. ఇక ఈ మ్యాచ్ లో మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్ 290 బంతులు ఎదుర్కొని 19 ఫోర్లు, 7 సిక్సర్లతో 209 పరుగులు సాధించాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

 

ఇదిలా ఉండగా.. జైస్వాల్ లో ఓ సూపర్ స్టార్ ఉన్నాడని కొన్ని సంవత్సరాల క్రితమే గుర్తించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అతడి ఆటను ఆదిలోనే కనిపెట్టిన రోహిత్.. టీమిండియాకు కాబోయే సూపర్ స్టార్ ఇతడే అంటూ కితాబిచ్చాడు. ఇప్పుడు ఆ మాట అక్షరాలా నిజమైంది. అతడి కెప్టెన్సీలోనే అద్బుతంగా రాణిస్తున్నాడు. గత కొంతకాలంగా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఈ యువ ఓపెనర్. అండర్సన్ లాంటి దిగ్గజ బౌలర్లను ఎదుర్కొని మరి డబుల్ సెంచరీ చేయడం మామూలు విషయం కాదు. ప్రస్తుతం రోహిత్ చేసిన అప్పటి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో టాలెంట్ ను గుర్తుపట్టడంలో మీకు మీరే సాటి రోహిత్ భాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి జైస్వాల్ విషయంలో రోహిత్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments