టీమిండియా యువ క్రికెటర్‌ గుండెకు రంధ్రం! NCAలో టెస్ట్‌తో బయటపడిన నిజం!

Yash Dhull, Hole in Heart, NCA: గుండెకు రంధ్రం ఉందని తెలిస్తే.. ఎవరైనా భయపడతారు. కానీ, ఆ యువ క్రికెటర్‌ అలానే దేశం కోసం ఆడాడు. ఆ క్రికెటర్‌ ఎవరో? ఏంటా స్టోరీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Yash Dhull, Hole in Heart, NCA: గుండెకు రంధ్రం ఉందని తెలిస్తే.. ఎవరైనా భయపడతారు. కానీ, ఆ యువ క్రికెటర్‌ అలానే దేశం కోసం ఆడాడు. ఆ క్రికెటర్‌ ఎవరో? ఏంటా స్టోరీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

క్రికెట్‌ అభిమానుల గుండెల్లో రాయి పడే పిడుగులాంటి వార్త ఒకటి తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీమిండియా ఫ్యూచర్‌ స్టార్‌ అయిన యష్ ధుల్ గుండెకు రంధ్రం ఉన్నట్లు తేలింది. బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో జరిపే జనరల్‌ చెకప్‌లో భాగంగా ఈ రహస్యం బయటపడింది. ఇది జరిగిన మూడు నెలలపైనే అవుతున్నట్లు సమాచారం. కానీ, విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. భారత​ అండర్‌ 19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన యశ్‌ ధుల్‌.. సాధారణ క్యాంప్‌ కోసం మరికొంత మంది ఆటగాళ్లతో కలిసి నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి వెళ్లాడు. అక్కడ ఆటగాళ్లకు నిర్వహించే జనరల్‌ హెల్త్‌ చెకప్‌లో యశ్‌ హృదయానికి హోల్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

వెంటనే సర్జరీ చేయించికుంటే మంచిదని కూడా సూచించారు. ఎన్‌సీఏ వైద్యుల సలహా మేరకు యశ్‌ ధుల్‌ సర్జరీ కూడా చేయించుకున్నాడు. ఆ సర్జరీ తర్వాత కేవలం రెండు నెలల్లోనే కోలుకొని.. తిరిగి గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. తాజాగా ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌లో కూడా ఆడాడు. ఈ క్రమంలోనే అతను సర్జరీ చేయించుకొని ఆడుతున్నట్లు తెలిసింది. ఇదే విషయంపై యశ్‌ తండ్రి విజయ్‌ మాట్లాడుతూ.. ఇదో చిన్న సర్జరీ అని.. అంత సీరియస్‌ ఏం కాదని, యశ్‌కు గుండెకు రంధ్రం చిన్నతనం నుంచే ఉందని, ఎన్‌సీఏ బృందం సూచించడంతోనే తాము సర్జరీకి వెళ్లామంటూ తెలిపారు. యశ్‌ మాట్లాడూత.. గతంలో చాలా విషయాలు జరిగాయి.. కానీ, ఇప్పుడు నేను కోలుకుంటున్నాను.. నా గేమ్‌పై వందశాతం ఎఫర్ట్‌ పెడుతున్నాను’ అంటూ పేర్కొన్నాడు.

మరో యువరాజ్‌లా..

అండర్‌ 19 క్రికెటర్‌గా మంచి రికార్డు కలిగి ఉన్న యశ్‌ ధుల్‌.. అతని కెప్టెన్సీలో టీమిండియా 2022లో అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ గెలిచింది. ఇంగ్లండ్‌పై ఫైనల్‌ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. ఆ టోర్నీలో కెప్టెన్‌ ధుల్‌ సూపర్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడని ధుల్‌.. 4 మ్యాచ్‌లు ఆడాడు. అయితే.. ధుల్‌ తండ్రి చెప్పినట్లు.. అతనికి చిన్నతనం నుంచే గుండెకు రంధ్రం ఉంది. అలానే క్రికెట్‌ ఆడుతున్నాడు. అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ కూడా అలానే ఆడి.. భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. 2011 వన్డే వరల్డ్‌ కప్‌ సమయంలో కూడా టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ క్యాన్సర్‌తో బాధపడుతూనే ఆడి.. భారత్‌కు వరల్డ్‌ కప్‌ అందించాడు. వరల్డ్‌ కప్‌ మధ్యలో ఒక మ్యాచ్‌లో గ్రౌండ్‌లోనే రక్తం కక్కుకుంటూ కనిపించాడు. అప్పుడు యువీలానే.. ఇప్పుడు యశ్‌ ధుల్‌ సైతం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా దేశం కోసం ఆడాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments