వీడియో: విరాట్‌ కోహ్లీతో గొడవ పెట్టుకున్న శ్రీలంక బౌలర్‌ అసిత్‌ ఫెర్నాండో

Virat Kohli, Asitha Fernando, IND vs SL: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ-శ్రీలంక బౌలర్‌ మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, Asitha Fernando, IND vs SL: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ-శ్రీలంక బౌలర్‌ మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

కొలంబో వేదికగా బుధవారం శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. మూడు వన్డేల సిరీస్‌ను 0-2తో కైవసం చేసుకుంది శ్రీలంక. తొలి వన్డే టై కాగా.. రెండు, మూడో వన్డేల్లో అద్భుత ప్రదర్శనతో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించారు లంకేయులు. టీ20 సిరీస్‌ 0-3 తేడాతో ఓడిపోయినా.. వన్డే సిరీస్‌ను గెలిచి లెక్కసరి చేశారు. అయితే.. వన్డే సిరీస్‌లో ఇలాంటి ఫలితాన్ని భారత జట్టు ఊహించి ఉండదు. అసలు స్పిన్‌ ఏ మాత్రం ఆడలేకపోయారు. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ ఆటగాళ్లు ఎలా స్పిన్‌కు తడబడతారో అలా మారిపోయింది భారత క్రికెటర్ల పరిస్థితి. విరాట్‌ కోహ్లీ దిగ్గజ క్రికెటర్‌ సైతం మూడు ఇన్నింగ్స్‌ల్లో స్పిన్నర్ల బౌలింగ్‌లో లెగ్‌ బిఫోర్‌గా అవట్‌ కావడం కలవరపెట్టే అంశం.

అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి సంగతి కొద్ది సేపు పక్కనపెడితే.. మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసింది. అగ్నిపర్వతం బద్దలు అయ్యేలా కనిపించింది. అదేంటంటే.. విరాట్‌ కోహ్లీకి, శ్రీలంక బౌలర్‌ అసిత పెర్నాండో మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అసిత పెర్నాండో వేసిన ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌ చివరి బంతిని కోహ్లీ.. డిఫెన్స్‌ ఆడాడు. విరాట్‌ కోహ్లీని రెచ్చగొట్టేందుకు పెర్నాండో నోరు పారేసుకున్నాడు. బాల్‌ వేసిన తర్వాత ఫాలో త్రోలో ఇంకాస్త ముందుకు వచ్చిన పెర్నాండో కోహ్లీని ఏమో అన్నాడు.

ముందు కూల్‌గానే ఉన్న కోహ్లీ.. అతను ఏదో అంటున్నాడని తెలిసి.. పాత కోహ్లీకి బయటికి తీశాడు. సీరియస్‌గా పెర్నాండో వైపు చూస్తూ.. కోహ్లీ కూడా మాటకు మాట బదులిచ్చాడు. తర్వాత.. రోహిత్‌తో కలిసి.. బచ్చాగాడు ఏదో అంటున్నాడు అంటూ నవ్వుకున్నాడు కోహ్లీ. అయితే.. విరాట్‌ కోహ్లీ అలా చూసిన క్రికెట్‌ అభిమానులు వింటేజ్‌ విరాట్‌ అలా వచ్చి ఇలా వెళ్లాడు అని కామెంట్‌ చేస్తున్నారు. మరో మ్యాచ్‌ ఉంటే.. పెర్నాండోకు బుద్ధి చెప్పేవాడు అంటున్నారు. అయితే.. ఈ సిరీస్‌లో కోహ్లీ పెద్దగా సక్సెస్‌ కాదు. తన స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్‌ చేయలేదు. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ వర్సెస్‌ పెర్నాండో మాట యుద్ధంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments