లాస్ట్‌ 2 ఓవర్లు రింకూ, సూర్యనే ఎందుకేశారు? ఈ ప్లాన్‌ ఎవరిది?

లాస్ట్‌ 2 ఓవర్లు రింకూ, సూర్యనే ఎందుకేశారు? ఈ ప్లాన్‌ ఎవరిది?

IND vs SL, Rinku Singh, Suryakumar Yadav, Gautam Gambhir: 12 బంతుల్లో 9 పరుగులు కావాలి.. ఏ టీమ్‌ అయినా సులువుగా గెలుస్తుంది. కానీ, శ్రీలంక మాత్రం.. చివరి రెండు ఓవర్లలో తొలిసారి బంతి పట్టుకున్న ఇద్దరు పార్ట్‌టైమ్‌ బౌలర్లను ఎదుర్కొలేక ఓడిపోయింది. మరి ఆ చివరి రెండు ఓవర్లు రింకూ, సూర్యతోనే ఎందుకు వేయించారు? అసలు ఈ ప్లాన్‌ ఎవరిదో ఇప్పుడు తెలుసుకుందాం..

IND vs SL, Rinku Singh, Suryakumar Yadav, Gautam Gambhir: 12 బంతుల్లో 9 పరుగులు కావాలి.. ఏ టీమ్‌ అయినా సులువుగా గెలుస్తుంది. కానీ, శ్రీలంక మాత్రం.. చివరి రెండు ఓవర్లలో తొలిసారి బంతి పట్టుకున్న ఇద్దరు పార్ట్‌టైమ్‌ బౌలర్లను ఎదుర్కొలేక ఓడిపోయింది. మరి ఆ చివరి రెండు ఓవర్లు రింకూ, సూర్యతోనే ఎందుకు వేయించారు? అసలు ఈ ప్లాన్‌ ఎవరిదో ఇప్పుడు తెలుసుకుందాం..

శ్రీలంకతో జరిగిన చివరిదైన మూడో టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. స్లో స్కోరింగ్‌ థ్రిల్లర్‌లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య.. మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. చివరికి టీమిండియానే విజేతగా నిలిచి.. మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. అయితే.. ఈ మ్యాచ్‌లో నిజానికి శ్రీలంక గెలవాల్సింది. ఎందుకంటే.. కేవలం 138 పరుగుల స్వల్ప టార్గెట్‌ను ఛేదించే క్రమంలో.. 15 ఓవర్ల తర్వాత కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 110 పరుగులు చేసింది లంక. టాపార్డర్‌లోని ముగ్గురు బ్యాటర్లు సూపర్‌గా బ్యాటింగ్‌ చేసి.. దాదాపు విజయాన్ని ఖాయం చేశారు. కానీ, చివర్లో వాషింగ్టన్‌ సుందర్‌, రింకూ సింగ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ అత్యాద్భుతంగా బౌలింగ్‌ చేసి.. ఒత్తిడిలో ఉన్న లంకను చిత్తుచేశారు.

ముఖ్యంగా చివరి రెండు ఓవర్లు వేసిన రింకూ సింగ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంత మెచ్చకున్న తప్పులేదు. శ్రీలంక విజయానికి చివరి 12 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే కావాలి.. చేతిలో ఏకంగా 6 వికెట్లు ఉన్నాయి. ఇలాంటి దశలో శ్రీలంక ఓడిపోతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ, అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదన్నట్లు.. రింకూ, సూర్య సూపర్‌ బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పేశారు. 19 ఓవర్‌ వేసిన రింకూ సింగ్‌.. అంత ఒత్తిడిలోనూ అద్భుతంగా బౌలింగ్‌ చేసి.. కేవలం 3 రన్స్‌ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక చివరి ఓవర్‌లో సూర్య కేవలం 5 రన్స్‌ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి.. మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌కు తీసుకెళ్లాడు. మరో విశేషం ఏంటేంటే.. ఈ ఇద్దరికి తమ కెరీర్‌లో ఇవే తొలి ఓవర్లు. అయితే.. చివరి రెండు ఓవర్లు వీరిద్దరితోనే వేయించాలనే ఐడియా మాత్రం గౌతమ్‌ గంభీర్‌దే అని తెలుస్తోంది.

ఎందుకంటే.. ఈ సిరీస్‌తోనే హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్‌.. డే వన్‌ నుంచి జట్టులోని స్టార్‌ బ్యాటర్లతో బౌలింగ్‌ కూడా ప్రాక్టీస్‌ చేయించాడు. బౌలింగ్‌ వేయడం వచ్చిన ప్రతి బ్యాటర్‌ కూడా బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ.. మ్యాచ్‌లో అవసరం అయితే బౌలింగ్‌కు సిద్ధంగా ఉండాలనే సూచనలు ఇచ్చాడు. శ్రీలంకతో సిరీస్‌ కోసం రియాన్‌ పరాగ్‌, రింకూ, సూర్య, శుమ్‌మన్‌ గిల్‌ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం చూశాం. పైగా నిన్నటి మ్యాచ్‌లో ఖలీల్‌ అహ్మద్‌కు మరో ఓవర్‌ మిగిలి ఉన్నా.. అతను భారీగా పరుగులు ఇస్తున్నాడు. సిరాజ్‌ 3 ఓవర్లలో 11 రన్స్‌ మాత్రమే ఇచ్చినా.. అతన్ని కూడా కాదని చివరి ఓవర్‌ను సూర్యను వేయాలని సూచించాడు గంభీర్‌. ఈ ప్లాన్‌ అద్భుతంగా వర్క్‌ అవుట్‌ అయింది. ఎందుకంటే.. 6 పరుగుల డిఫెండ్‌ చేయాడానికి మెయిన్‌ బౌలర్‌ను బరిలోకి దింపుతారని శ్రీలంక ప్రిపేర్‌ అయి ఉంటుంది.. కానీ, ఎప్పుడూ బాల్‌ పట్టిని సూర్య బౌలింగ్‌కు రావడంతో వాళ్లు సర్‌ప్రైజ్‌ అయి షాక్‌లో ఉన్నారు. పైగా ఒత్తిడి కూడా సూర్యకు ప్లస్‌ అయింది. మొత్తంగా రింకూ, సూర్యతో చివరి రెండో ఓవర్లు వేయించాలనే గంభీర్‌ ప్లాన్‌ అద్భుతంగా వర్క్‌అవుట్‌ అయింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments