Shreyas Iyer: బంగ్లాతో తొలి టెస్ట్.. షమీ, అయ్యర్ లకు చోటు దక్కకపోవడానికి కారణం ఏంటి?

Mohammed Shami, Shreyas Iyer, Team India Squad: బంగ్లాదేశ్ తో జరగబోయే తొలి టెస్ట్ మ్యాచ్ కు టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. సీనియర్ ప్లేయర్లు అయిన మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్ లకు టీమ్ లో చోటు దక్కలేదు. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Mohammed Shami, Shreyas Iyer, Team India Squad: బంగ్లాదేశ్ తో జరగబోయే తొలి టెస్ట్ మ్యాచ్ కు టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. సీనియర్ ప్లేయర్లు అయిన మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్ లకు టీమ్ లో చోటు దక్కలేదు. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. సెప్టెంబర్ 19 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఆదివారం భారత జట్టును ప్రకటించింది. 2022లో కారు ప్రమాదానికి గురైన స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి టెస్ట్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ సీనియర్ ప్లేయర్లు అయిన మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్లకు ఊహించని షాక్ తగిలింది. యశ్ దయాళ్, ఆకాశ్ దీప్ లాంటి వారికి టీమ్ లో చోటు దక్కగా షమీకి నిరాశ ఎదురైంది. అలాగే అయ్యర్ కు కూడా. మరి వీళ్లకు జట్టులో చోటు దక్కకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బంగ్లాదేశ్ తో జరగబోయే తొలి టెస్ట్ మ్యాచ్ కు టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. చాలా కాలం తర్వాత టెస్ట్ జట్టులోకి పంత్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే యంగ్ ప్లేయర్ యశ్ దయాళ్ తొలిసారి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక దులీప్ ట్రోఫీలో తొలి మ్యాచ్ లోనే 9 వికెట్లు తీసి అదరగొట్టిన ఆకాశ్ దీప్ జాక్ పాట్ కొట్టాడు. అయితే ఊహించని విధంగా సర్జరీ తర్వాత కోలుకుని ప్రాక్టీస్ మెుదలుపెట్టిన మహ్మద్ షమీకి జట్టులో స్థానం దక్కలేదు. అతడితో పాటుగా సీనియర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు కూడా షాక్ తగిలింది. అయితే వీరిద్దరి ఎంపిక చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కాగా.. మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్ లను బంగ్లాతో జరిగే తొలి టెస్ట్ కు బీసీసీఐ ఎంపిక చేయలేదు. ఇది అందరికి ఆశ్చర్యం కలిగించింది. సర్జరీ చేయించుకున్న తర్వాత ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు షమీ. అదీకాక అతడిని బంగ్లాతో టెస్ట్ సిరీస్ కు పరిగణంలోకి తీసుకుంటామని ఛీప్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ సైతం ఓ సందర్భంలో తెలిపాడు. కానీ.. అనూహ్యంగా అతడు జట్టులో ప్లేస్ దక్కించుకోలేకపోయాడు. దానికి ఓ కారణం ఉంది. జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలన్నది ప్రస్తుతం బీసీసీఐ విధించిన రూల్. షమీ దులీప్ ట్రోఫీలో ఆడలేదు. కానీ అక్టోబర్ లో జరగబోయే రంజీ ట్రోఫీలో ఆడతనని ఇప్పటికే అతడు ప్రకటించాడు. అక్కడ తన సత్తా నిరూపించుకుని జట్టులోకి రావాలన్నది షమీ ఆలోచన. అందుకే షమీకి ఈ సిరీస్ లో చోటు దక్కలేదు.

ఇక శ్రేయస్ అయ్యర్ పరిస్థితి మరో రకంగా ఉంది. ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సరీస్ లో గాయపడిన శ్రేయస్.. ఆ సాకుతో రంజీ ట్రోఫీ ఆడలేదు. దాంతో బీసీసీఐ ఆగ్రహానికి గురై.. సెంట్రల్ కాంట్రాక్ట్ ను కోల్పోయాడు. అయితే ప్రస్తుతం దులీప్ ట్రోఫీ ఆడుతున్న అతడికి సెంట్రల్ కాంట్రాక్ట్ తో పాటుగా జట్టులో స్థానం కల్పిస్తారని అందరూ భావించారు. కానీ, ఊహించని విధంగా అయ్యర్ కు షాక్ తగిలింది. గత ఐపీఎల్ సీజన్ లో కోల్ కత్త నైట్ రైడర్స్ ను విజేతగా నిలిపినప్పటికీ.. సుదీర్ఘ ఫార్మాట్ లో దారుణంగా విఫలం అవుతున్నాడు. ఇటీవలే ముగిసిన బుచ్చిబాబు ట్రోఫీలోనూ పెద్దగా ప్రభావం చూపించలేదు. దాంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మరి షమీ, అయ్యర్ లను బంగ్లాతో మ్యాచ్ కు ఎంపిక చేయకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments