Nidhan
Gautam Gambhir, Jasprit Bumrah, IND vs BAN: టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. బంగ్లాదేశ్‌తో త్వరలో ఆరంభమయ్యే టెస్ట్ సిరీస్‌లో అతడు బరిలోకి దిగనున్నాడు. వికెట్ల వేటను మొదలుపెట్టేందుకు కసిగా సాధన చేస్తున్నాడు.
Gautam Gambhir, Jasprit Bumrah, IND vs BAN: టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. బంగ్లాదేశ్‌తో త్వరలో ఆరంభమయ్యే టెస్ట్ సిరీస్‌లో అతడు బరిలోకి దిగనున్నాడు. వికెట్ల వేటను మొదలుపెట్టేందుకు కసిగా సాధన చేస్తున్నాడు.
Nidhan
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. బంగ్లాదేశ్‌తో త్వరలో ఆరంభమయ్యే టెస్ట్ సిరీస్‌తో అతడు బరిలోకి దిగనున్నాడు. వికెట్ల వేటను మొదలుపెట్టేందుకు కసిగా సాధన చేస్తున్నాడు. బంగ్లాతో టెస్ట్ సిరీస్ కోసం ఆదివారం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో బుమ్రా కూడా ఉన్నాడు. దీంతో ఆ టీమ్ బ్యాటర్లతో బుమ్రా ఆడుకోవడం ఖాయమని అంతా అంటున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు రెస్ట్ మోడ్‌లో ఉన్న ఈ టాప్ పేసర్.. సడన్‌గా టీమ్‌లోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత జట్టుకు ఎంతో కీలకమైన బుమ్రాను చాలా జాగ్రత్తగా వాడుకోవాలని అటు టీమ్ మేనేజ్మెంట్తో పాటు ఇటు బీసీసీఐ కూడా డిసైడ్ అయింది. అందుకే డొమెస్టిక్ క్రికెట్లో తప్పక ఆడాలనే రూల్ నుంచి అతడికి మినహాయింపు ఇచ్చింది. పెద్ద జట్లతో జరిగే కీలక సిరీస్‌లు, ఐసీసీ టోర్నమెంట్స్లోనే బుమ్రా సేవలు వాడుకోవాలని భావించారు. అయితే హఠాత్తుగా అతడ్ని బంగ్లా సిరీస్‌కు ఎంపిక చేయడంతో అంతా షాకవుతున్నారు.
గాయం కారణంగా చాన్నాళ్లు టీమిండియాకు దూరమైన బుమ్రా.. ఆ తర్వాత కోలుకొని వన్డే వరల్డ్ కప్‌తో పాటు టీ20 ప్రపంచ కప్‌లోనూ అదరగొట్టాడు. పొట్టి కప్పులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అయితే బుమ్రాకు ఇంజ్యురీలు తిరగబెట్టే ప్రమాదం ఉండటంతో అతడి సేవల్ని జాగ్రత్తగా వాడుకోవాలని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. అక్టోబర్ మధ్యలో ప్రారంభమయ్యే న్యూజిలాండ్ సిరీస్ వరకు అతడు రెస్ట్ మోడ్‌లోనే ఉంటాడని గట్టిగా వినిపించింది. బంగ్లాదేశ్‌పై నంబర్ వన్ బౌలర్‌ను ఆడించాల్సిన అవసరం లేదనే కామెంట్స్ వచ్చాయి. కివీస్ సిరీస్‌తో పాటు ఏడాది ఆఖర్లో ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉండటంతో అతడికి మరింత విశ్రాంతి ఇస్తారని అనుకున్నారు. కానీ వారం కింద బుమ్రా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇప్పుడు బంగ్లా సిరీస్‌కు సెలెక్ట్ చేశారు. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. గంభీర్‌కు బంగ్లా అంటే ఎందుకంత భయం? బుమ్రాను ఆడించాల్సిన అవసరం ఏం ఉందని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
బంగ్లాపై బుమ్రా అవసరమా? అని నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. అయితే కోచ్ గంభీర్‌తో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఒత్తిడి వల్లే అతడు టీమ్‌లోకి వచ్చాడని సమాచారం. ముఖ్యంగా గంభీర్ రిస్క్ చేయాలని అనుకోవడం లేదట. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. అటు స్పిన్నర్లతో పాటు ఇటు బ్యాటర్లు అదరగొట్టారు. ఆ జట్టు దూకుడైన ఆటతీరు చూశాక రిస్క్ అక్కర్లేదని గౌతీ భావించాడట. అదే సమయంలో శ్రీలంక సిరీస్‌లో మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ లాంటి స్టార్ బౌలర్లు ఫెయిల్ అవడంతో బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలనే నిర్ణయాన్ని అతడు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
చిన్న పామును పెద్ద కర్రతో కొట్టాలనే ఆలోచనతో పేసుగుర్రాన్ని బరిలోకి దింపాలని డిసైడ్ అయ్యాడని వినిపిస్తోంది. రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లాంటి క్వాలిటీ స్పిన్నర్లకు తోడు బుమ్రా టీమ్‌లో ఉంటే బంగ్లాను ఈజీగా చిత్తు చేయొచ్చని.. పాక్ మాదిరి సంచలనాలు జరగకుండా ఉండేందుకు టాప్ బౌలర్‌ను ఆడిస్తున్నట్లు సమాచారం. మరి.. బంగ్లా సిరీస్‌కు బుమ్రాను సెలెక్ట్ చేయడం కరెక్టేనా? లేదా మరింత రెస్ట్ ఇవ్వాల్సిందా? మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.