ఈ టీమిండియాకు ఏమైంది? ఎవరూ రన్స్‌ చేయట్లేదేంటి? ఈ ధోరణికి పాడాలి చరమగీతం!

ఈ టీమిండియాకు ఏమైంది? ఎవరూ రన్స్‌ చేయట్లేదేంటి? ఈ ధోరణికి పాడాలి చరమగీతం!

Virat Kohli, IND vs SL: శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా తడబడుతోంది. గెలవాల్సిన తొలి వన్డే టై అయింది, రెండో వన్డేలో ఓడిపోయింది.. ఈ పరిస్థితి కారణం ఏంటి? కోహ్లీ ఎందుకు ఫెయిల్‌ అవుతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli, IND vs SL: శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా తడబడుతోంది. గెలవాల్సిన తొలి వన్డే టై అయింది, రెండో వన్డేలో ఓడిపోయింది.. ఈ పరిస్థితి కారణం ఏంటి? కోహ్లీ ఎందుకు ఫెయిల్‌ అవుతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

నెల రోజుల క్రితం టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచి.. టీ20 ఛాంపియన​్‌గా అవతరించింది టీమిండియా. ఆ వెంటనే శుబ్‌మన్‌ గిల్‌ కుర్రాళ్లతో వెళ్లి జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్‌ ఆడి 4-1తో సిరీస్‌ గెలిచాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో టీమిండియా శ్రీలంకపై 3-0తో టీ20 సిరీస్‌ నెగ్గింది.. కానీ, వన్డే సిరీస్‌కు వచ్చే సరికే టీమిండియా తుస్సుమంటోంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ లాంటి హేమాహేమీ ఆటగాళ్లు ఉన్న వరల్డ్‌ క్లాస్‌ టీమ్‌.. పెద్ద టీమ్‌కు తక్కువ, పసికూనకు ఎక్కువ లాంటి శ్రీలంకపై తొలి వన్డేలో.. గెలవాల్సిన తొలి వన్డేను టై చేసుకుంది, రెండో వన్డేలో కూడా దాదాపు అంతే టార్గెట్‌ను ఛేజ్‌ చేయలేక ఓటమి పాలైంది. దాదాపు ఇదే జట్టు గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌లో ఒక్క ఓటమి కూడా లేకుండా.. వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి.. ఫైనల్‌కు వెళ్లింది. కానీ, ఇప్పుడు లంకపై రెండు మ్యాచ్‌ల్లోనూ చెత్త ప్రదర్శన కనబర్చింది. ఎందుకిలా జరుగుతుంది..?

కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ తన హండ్రెడ్‌ పర్సెంట్‌ ఎఫర్ట్‌ ఇస్తున్నాడు. అలాగే ఓపెనర్‌గా కూడా టీమిండియాకు మంచి స్టార్ట్‌ అందిస్తున్నాడు. కానీ, టీ20 మూడ్‌లోనే ఉండి పోయిన రోహిత్‌ శర్మ అదే ఇంటెంట్‌తో మంచి స్టార్ట్‌ దక్కినా.. దాన్ని పెద్ద స్కోర్‌గా మల్చలేకపోతున్నాడు. మంచి స్టార్ట్‌ లభించిన తర్వాత ప్రాపర్‌ వన్డే ఇన్నింగ్స్‌ ఆడి ఉంటే.. రెండు మ్యాచ్‌ల్లోనూ రోహిత్‌ శర్మ సెంచరీ పూర్తి చేసుకునే వాడు. కానీ, అతను టీ20 స్టైల్‌లోనే బ్యాటింగ్‌ చేస్తూ.. అగ్రెసివ్‌ ఇంటెంట్‌తో ఆడుతూ వికెట్‌ సమర్పించుకుంటున్నాడు. వన్డే వరల్డ్‌ కప్‌లోనూ రోహిత్‌ ఇలాగే ఆడాడు.. కానీ, అప్పుడు విరాట్‌ కోహ్లీ నుంచి రోహిత్‌కు మంచి సపోర్ట్‌ లభించేది. అలాగే శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ కూడా మంచి వన్డే స్టైల్‌ ఇన్నింగ్స్‌లతో రాణించేవారు. కానీ, ఇప్పుడు అదే మిస్‌ అవుతుంది.

రోహిత్‌ సేమ్‌ వన్డే వరల్డ్‌ కప్‌లో ఆడినట్లే ఇక్కడా ఆడుతున్నాడు.. కానీ, కోహ్లీ, అయ్యర్‌, రాహుల్‌ నుంచే సపోర్ట్‌ మిస్‌ అవుతుంది. ఇక ఛేజ్‌ మాస్టర్‌గా పేరున్న విరాట్‌ కోహ్లీ అయితే.. దారుణంగా విఫలం అవుతున్నాడు. స్పిన్నర్లను ఆడటం అంటే అదేదో పెద్ద సాహసంలా భావిస్తున్నాడు. కొన్ని ఏళ్లపాటు స్పిన్‌ బౌలింగ్‌ను చీల్చిచెండాడిన కోహ్లీ.. కొన్ని నెలలుగా స్పిన్‌ను ఆడేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు శ్రీలంకతో సిరీస్‌లోని రెండు మ్యాచ్‌ల్లో కూడా స్పిన్నర్లకే అవుట్‌ అయ్యాడు. టీ20 మూడ్‌లో ఉండటం, స్పిన్నర్లను ఎదుర్కొవడంలో ఇబ్బంది వల్లే.. టీమిండియా ఇలా ఇబ్బండి పడుతోంది. ఇక వీటికి తోడు.. స్లో పిచ్‌లు కూడా టీమిండియా చెత్త ప్రదర్శనకు కారణం అవుతున్నాయి. స్లో పిచ్‌లపై కూడా బాగా ఆడతారని పేరున్న విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ సైతం.. శ్రీలంక పిచ్‌లపై తేలిపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే.. శ్రీలంకతో మూడో వన్డేలో కూడా ఓటమే ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. చివరి వన్డే కూడా కొలంబోలోనే జరగనుంది. చివరి వన్డేలోనైనా విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌.. తమ స్థాయికి తగ్గట్లు ఆడాలని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments