Somesekhar
రెండో టెస్ట్ లో వెస్టిండీస్ చేతిలో ఆస్ట్రేలియా 8 పరుగుల తేడాతో ఓడిపోవడంతో.. బ్రియన్ లారాతో కలిసి నవ్వులు చిందిస్తూ.. సెలబ్రేషన్స్ చేసుకున్నాడు ఆసీస్ దిగ్గజ ప్లేయర్ ఆడమ్ గిల్ క్రిస్ట్.
రెండో టెస్ట్ లో వెస్టిండీస్ చేతిలో ఆస్ట్రేలియా 8 పరుగుల తేడాతో ఓడిపోవడంతో.. బ్రియన్ లారాతో కలిసి నవ్వులు చిందిస్తూ.. సెలబ్రేషన్స్ చేసుకున్నాడు ఆసీస్ దిగ్గజ ప్లేయర్ ఆడమ్ గిల్ క్రిస్ట్.
Somesekhar
ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య గబ్బా వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ప్రేక్షకులకు అసలైన టెస్ట్ మజాను అందించింది. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠతతో జరిగిన ఈ పోరులో 8 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది విండీస్ టీమ్. 27 సంవత్సరాల చరిత్రను తిరగరాసింది. దీంతో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా భావోద్వేగానికి గురైయ్యాడు. ఇక అక్కడే కామెంట్రీ బాక్స్ లో ఉన్న ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్ క్రిస్ట్ సైతం విండీస్ విజయ సంబరాలను లారాతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్ టీమ్ ను 8 పరుగులతో ఓడించింది పర్యాటక వెస్టిండీస్ టీమ్. ఈ చారిత్రాత్మక విజయంతో 27 సంవత్సరాల హిస్టరీని బ్రేక్ చేసింది కరేబియన్ టీమ్. ఇక ఈ మ్యాచ్ ఏమాత్రం టీ20లకు తీసిపోని ఉత్కంఠతను రేకెత్తించింది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీక ప్రేక్షకులు గుండెలు చేతిలో పెట్టుకుని మ్యాచ్ చూశారు. చివరి వరకు ఆస్ట్రేలియా పోరాడినప్పటికీ.. షమర్ జోసెఫ్ బౌలింగ్ దాటికి దాసోహం అయ్యింది. కంగారూ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 91 పరుగులతో మరపురాని అజేయ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. విజయం మాత్రం కరేబియన్ టీమ్ నే వరించింది.
దీంతో 27 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో తొలి విజయం సాధించింది వెస్టిండీస్ టీమ్. ఈ ఆనందాన్ని కామెంట్రీ బాక్స్ లో ఉన్న విండీస్ దిగ్గజం బ్రియన్ లారా, ఆసీస్ లెజెండ్ ఆడమ్ గిల్ క్రిస్ట్ లు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆసీస్ చివరి వికెట్ పడగానే గిల్ క్రిస్ట్ బిగ్గరగా నవ్వులు చిందిస్తూ.. పక్కనే ఉన్న లారాను కౌగిలించుకున్నాడు. అయితే ఆసీస్ ఓడిపోయింది అన్న విషయాన్ని మర్చిపోయి స్పూర్తివంతమైన క్రికెట్ ను ఆస్వాదించాడు గిల్ క్రిస్ట్. 27 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై గెలుపును చూసి కన్నీరు పెట్టుకున్నాడు విండీస్ దిగ్గజం బ్రియన్ లారా. వీరిద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. సొంత జట్టు ఓడిపోతే నవ్వుతూ సంబరాలు చేసుకోవడం ఏంటి? అని కొందరు రాసుకురాగా.. మరికొందరు మాత్రం ఇదే నిజమైన క్రీడా స్ఫూర్తి అంటూ గిల్ క్రిస్ట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Gilchrist hugging Lara in commentary box after the historic win in West Indies at Gabba.
– What a moment. 👌pic.twitter.com/8T9N1qjf8J
— Johns. (@CricCrazyJohns) January 28, 2024