SNP
Heinrich Klaasen, IPL 2024, KKR vs SRH: ఈ ఐపీఎల్ సీజన్‌లో క్వాలిఫైయర్ వన్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ కంటే ముందు తన సపోర్ట్ కేకేఆర్‌కే అని ప్రకటించాడు క్లాసెన్. అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు చూద్దాం..
Heinrich Klaasen, IPL 2024, KKR vs SRH: ఈ ఐపీఎల్ సీజన్‌లో క్వాలిఫైయర్ వన్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ కంటే ముందు తన సపోర్ట్ కేకేఆర్‌కే అని ప్రకటించాడు క్లాసెన్. అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు చూద్దాం..
SNP
క్రికెట్ అభిమానులకు అంతులేని వినోదాన్ని పంచిన ఐపీఎల్ 2024 సీజన్‌లో లీగ్ దశ ముగిసింది. అన్ని టీమ్స్ తమ 14 మ్యాచ్‌లు ఆడేశాయి. ఆదివారం కేకేఆర్, రాజస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో చివరి లీగ్ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అన్ని టీమ్స్ పద్నాలుగేసి మ్యాచ్‌లు ఆడిన తర్వాత.. అత్యధిక విజయాలతో కోల్‌కత్తా నైట్ రైడర్స్ పాయింట్స్ టేబుల్‌లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. రెండో ప్లేస్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, మూడో స్థానంలో రాజస్థాన్ రాయల్స్, నాలుగో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులు నిలిచాయి. ఈ నాలుగు టీమ్స్ ప్లే ఆఫ్స్‌కి చేరాయి. మిగిలిన ఆరు జట్లు లీగ్ దశలోనే ఎలిమినేట్ అయి తమ ప్రస్థానం ముగించాయి. అయితే.. చివరి లీగ్ మ్యాచ్ అయిన కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్‌కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ సారి తన సపోర్ట్ కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు ఇస్తున్నట్లు తెలిపాడు. తనతో పాటు అంతా కేకేఆర్‌కు సపోర్ట్ చేయాలని సూచించాడు. అదేంటి.. క్లాసెన్ ఎస్‌ఆర్‌హెచ్‌లో అంత బాగా ఆడుతూ.. కేకేఆర్‌కు సపోర్ట్ చేయమంటాడు ఏంటి? పైగా ఈ సీజన్ తొలి క్వాలిఫైయర్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తలపడబోయేది కేకేఆర్ తోనే కదా.. ఇలాంటి టైమ్‌లో మన ప్రత్యర్థికి సపోర్ట్ చేయమని క్లాసెన్ కోరడం ఏంటని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. అయితే.. క్లాసెన్ చెప్పింది ఈ సీజన్ మొత్తానికో, లేదా తొలి క్వాలిఫైయర్‌లో కేకేఆర్‌ను సపోర్ట్ చేయమని కాదు.. కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్‌లో.. కేకేఆర్‌కు సపోర్ట్ చేయమని కోరాడు. ఎందుకంటే.. ఆ మ్యాచ్‌తో సన్‌రైజర్స్ ప్లేస్ ఆధారపడి ఉండటమే అందుకు కారణం.
ఆదివారం జరగాల్సిన కేకేఆర్ వర్సెస్ ఆర్‌ఆర్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. కానీ, ఈ మ్యాచ్ కంటే ముందు.. క్లాసెన్ మాట్లాడుతూ.. కేకేఆర్‌కు సపోర్ట్ చేస్తామన్నాడు. ఎందుకంటే.. రాజస్థాన్‌పై కేకేఆర్ విజయం సాధిస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి చేరుకుంటుంది. రాజస్థాన్ గెలిస్తే.. ఎస్‌ఆర్‌హెచ్ మూడో ప్లేస్‌కు పరిమితం అవుతుంది. అందుకే కేకేఆర్ గెలవాలనపి క్లాసెన్ కోరుకున్నాడు. పాయింట్ల పట్టికలో ఒకటి, రెండు స్థానాల్లో ఉంటే.. క్వాలిఫైయర్ వన్‌లో ఓడిపోయినా.. క్వాలిఫైయర్-2లో ఎలిమినేటర్ విజేతతో ఆడే అవకాశం ఉంటుంది. అందుకే ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు.. ఒకటి రెండు స్థానాల్లో నిలవాలని కోరుకుంటాయి. క్లాసెన్ కోరుకున్నట్లు కేకేఆర్ గెలవకపోయినా.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో రాజస్థాన్ మూడో స్థానానికే పరిమితం అయింది. సన్‌రైజర్స్ రెండో స్థానంలో నిలిచి.. ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. మంగళవారం కేకేఆర్‌తో క్వాలిఫైయర్ వన్ అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడనుంది. మరి క్లాసెన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#klaasen #srh #kkrvssrh pic.twitter.com/bKEvgJxoAA
— Sayyad Nag Pasha (@nag_pasha) May 20, 2024