Wanindu Hasaranga: లంక కెప్టెన్ హసరంగా సంచలన నిర్ణయం.. ఇలా షాక్ ఇచ్చాడేంటి?

Sri Lanka: లంక కెప్టెన్, ఆల్​రౌండర్ వనిందు హసరంగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అతడి డెసిషన్​తో అభిమానులంతా షాక్ అవుతున్నారు.

Sri Lanka: లంక కెప్టెన్, ఆల్​రౌండర్ వనిందు హసరంగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అతడి డెసిషన్​తో అభిమానులంతా షాక్ అవుతున్నారు.

శ్రీలంక.. ఒకప్పుడు ఈ పేరు వింటేనే అన్ని జట్లు వణికేవి. ఆస్ట్రేలియా, టీమిండియా, ఇంగ్లండ్ లాంటి టాప్ టీమ్స్ కూడా సింహళ జట్టును చూసి వణికేవి. దీనికి కారణం ఆ టీమ్ ఆటతీరే. సనత్ జయసూర్య, మార్వన్ ఆటపట్టు, అరవింద డిసిల్వా, కుమార సంగక్కర, జయవర్దనే, చమిందా వాస్, ముత్తయ్య మురళీధరన్ వంటి ఎందరో దిగ్గజాలను క్రికెట్​కు అందించింది లంక. వీళ్లందరూ కలసి ఆడిన టైమ్​లో ఆ టీమ్​ క్రికెట్​లో హవా నడిపించింది. ద్వైపాక్షిక సిరీస్​లతో పాటు వరల్డ్ కప్స్​లోనూ బాగా అదరగొట్టేది లంక. కనీసం సెమీస్, అప్పుడప్పుడు ఫైనల్స్​కు చేరుకోవడం, కప్పు కొట్టడం కూడా చూశాం. అలాంటి జట్టు ఇప్పుడు దారుణమైన ఆటతీరుతో పసికూనలా మారిపోయింది. ఆ టీమ్​తో మ్యాచ్ అంటే అందరూ లైట్ తీసుకుంటున్నారు.

లంక టీమ్​తో మ్యాచ్ అంటే గెలిచేస్తాంలే అనే భరోసాతో ఉన్నాయి ప్రత్యర్థి జట్లు. ఆ జట్టు చెత్తాటే దీనికి కారణం. టీ20 వరల్డ్ కప్-2024లోనూ ఇదే జరిగింది. మెగాటోర్నీలో వరుస ఓటములతో గ్రూప్ దశ నుంచి ఇంటిదారి పట్టింది సింహళ జట్టు. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ చేతుల్లో ఓడి టోర్నీ నుంచి తప్పుకుంది. అభిమానులు పెట్టుకున్న గంపెడాశల్ని టీమ్ నిలబెట్టుకోలేకపోయింది. దీంతో ఆ కంట్రీ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఇదేం ఆటతీరు అని ఫైర్ అవుతున్నారు. బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్, యూఎస్​ఏ లాంటి జట్లు అదరగొడుతుంటే లంక మాత్రం పేలవ ప్రదర్శనతో ఇంటిదారి పట్టడాన్ని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. దీంతో తీవ్ర విమర్శల మధ్య లంక టీ20 కెప్టెన్ వనిందు హసరంగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు హసరంగా ప్రకటించాడు. పొట్టి ప్రపంచ కప్​లో జట్టు వైఫల్యానికి బాధ్యతగా కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు అనౌన్స్ చేశాడు. హసరంగా నిర్ణయంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఓటమికి అతనొక్కడే బాధ్యత తీసుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. టీమ్ మొత్తం సరిగ్గా ఆడలేదని కామెంట్స్ చేస్తున్నారు. హసరంగా కంటే అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేరని.. ఈ ఫెయిల్యూర్​ను సవాల్​గా తీసుకొని అతడు టీమ్​ను నడిపించి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. లంక జట్టులో గెలవాలనే కసి, తపన మిస్ అయ్యాయని చెబుతున్నారు. కాగా, పొట్టి కప్పులో హసరంగా 6 వికెట్లు పడగొట్టాడు. మరి.. లంక టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి హసరంగా తప్పుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments