రోహిత్‌ గెస్ట్‌గా ఉన్న ఈవెంట్‌లో విరాట్‌ కోహ్లీకి అవార్డు!

Virat Kohli, CEAT Award, Rohit Sharma: రోహిత్‌ శర్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్న అవార్డు ఫంక్షన్‌లో విరాట్‌ కోహ్లీని ఓ అవార్డు వరించింది. మరి ఆ అవార్డు ఏంటో.. దాని విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli, CEAT Award, Rohit Sharma: రోహిత్‌ శర్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్న అవార్డు ఫంక్షన్‌లో విరాట్‌ కోహ్లీని ఓ అవార్డు వరించింది. మరి ఆ అవార్డు ఏంటో.. దాని విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. వన్డే క్రికెట్‌లో బెస్ట్‌ బ్యాటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023 అవార్డు కోహ్లీని వరించింది. సియట్‌ క్రికెట్‌ అవార్డ్స్‌ 2024లో భాగంగా.. సియట్‌ కంపెనీ బెస్ట్‌ వన్డే బ్యాటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును కోహ్లీకి ప్రకటించింది. అయితే.. కార్యక్రమానికి టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. రోహిత్‌ సమక్షంలో ఈ అవార్డును కోహ్లీకి ప్రకటించడంపై క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

2019లో కూడా విరాట్‌ కోహ్లీ సియట్‌ క్రికెట్‌ అవార్డులు గెలుచుకున్నాడు. బెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌తో పాటే బెస్ట్‌ టెస్ట్‌, వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులు కూడా అప్పుడు కోహ్లీనే గెల్చుకున్నాడు. కాగా.. 2023లో వన్డేల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అయితే.. విరాట్‌ కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. అన్ని మ్యాచ్‌ల్లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చి.. టీమిండియా ఫైనల్‌ ఆడటంలో తన వంతు పాత్ర పోషించాడు.

కోహ్లీ సూపర్ బ్యాటింగ్‌తో పాటు జట్టు మొత్తం సమిష్టిగా రాణించడంతో టీమిండియా ఒక్క మ్యాచ్‌ ఓడిపోకుండా ఫైనల్‌కు వెళ్లింది. కానీ, ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి వరల్డ్‌ కప్‌ను చేజార్చకుంది. అయితే.. ఆ వరల్డ్‌ కప్‌ టోర్నీలో విరాట్‌ కోహ్లీ 765 పరుగులు చేసి.. టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును కోహ్లీ బ్రేక్‌ చేశాడు. మొత్తంగా 2023లో విరాట్‌ కోహ్లీ వన్డేల్లో 1377 పరుగులు చేశాడు. ఆ ఏడాది అతను చూపించిన అద్భుత ప్రదర్శనకు సియట్‌ అవార్డు వరించింది. ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023 అవార్డు కూడా కోహ్లీనే వచ్చిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఈ సియట్‌ క్రికెట్‌ అవార్డు కూడా రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments