Nidhan
Virat Kohli, MS Dhoni: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంపాదనలో దూసుకెళ్తున్నాడు. భారత జట్టుకు ఆడటంతో పాటు ఐపీఎల్లో ఆడటం ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకుంటున్నాడు. యాడ్స్ రూపంలోనూ భారీ మొత్తాన్ని వెనకేసుకుంటున్నాడు.
Virat Kohli, MS Dhoni: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంపాదనలో దూసుకెళ్తున్నాడు. భారత జట్టుకు ఆడటంతో పాటు ఐపీఎల్లో ఆడటం ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకుంటున్నాడు. యాడ్స్ రూపంలోనూ భారీ మొత్తాన్ని వెనకేసుకుంటున్నాడు.
Nidhan
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంపాదనలో దూసుకెళ్తున్నాడు. ఏటికేడు ఆర్జనలో పరుగులు పెడుతున్నాడు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడటం ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకుంటున్నాడు కింగ్. ఇంక అడ్వర్టయిజ్‌మెంట్స్ ద్వారా వచ్చే డబ్బులు దీనికి అదనం. రెస్టారెంట్స్, క్లోతింగ్ స్టోర్స్ బిజినెస్ కూడా రన్ చేస్తున్న కోహ్లీ వాటి ద్వారా కూడా భారీగా ధనాన్ని వెనకేసుకుంటున్నాడు. ఇలా ఎన్నో మార్గాల ద్వారా సంపాదనలో దూసుకెళ్తున్న కోహ్లీ ఏడాదికి ఎంత ట్యాక్స్ కడతాడో చాలా మందికి తెలియదు. అయితే తాజాగా దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ ఏడాది కోహ్లీ ఎంత పన్ను చెల్లించాడో తెలిస్తే మైండ్‌బ్లాంక్ అవడం ఖాయం.
దేశంలో అత్యధిక పన్ను చెల్లించే క్రీడాకారుడిగా కోహ్లీ నిలిచాడు. ఇండియా ఫార్చూన్ నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ భారత స్టార్ ఏకంగా రూ.66 కోట్లు ట్యాక్స్ చెల్లించాడు. ట్యాక్స్ పేయర్స్ స్పోర్ట్స్‌పర్సన్ లిస్ట్‌లో టాప్‌లో ఉన్న విరాట్.. సెలెబ్రిటీస్ జాబితాలో ఓవరాల్‌గా 5వ స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అతడు ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.92 కోట్ల ట్యాక్స్ చెల్లించాడు. అత్యధిక పన్ను చెల్లించిన క్రీడాకారుల జాబితాలో కోహ్లీ తర్వాతి స్థానంలో లెజెండ్ మహేంద్ర సింగ్ ఉన్నాడు. అతడు రూ.38 కోట్ల ట్యాక్స్ కట్టాడు. బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ రూ.28 కోట్లు, దాదా సౌరవ్ గంగూలీ రూ.23 కోట్లు పన్ను రూపంలో చెల్లించారు. వీళ్ల తర్వాతి స్థానాల్లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉన్నారు.
పాండ్యా రూ.13 కోట్ల ట్యాక్స్ కట్టగా.. పంత్ రూ.10 కోట్లు పన్ను రూపంలో చెల్లించాడు. ఇక, అత్యధిక పన్ను చెల్లించే సెలెబ్రిటీల జాబితాను చూసుకుంటే షారుక్ తర్వాతి ప్లేస్‌లో దళపతి విజయ్ (80 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ.75 కోట్లు) నిలిచారు. వీళ్ల తర్వాతి స్థానాల్లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (రూ.71 కోట్లు), విరాట్ కోహ్లీ (రూ.66 కోట్లు), అజయ్ దేవగణ్ (రూ.42 కోట్లు), ఎంఎస్ ధోని (రూ.38 కోట్లు), రణ్‌బీర్ కపూర్ (రూ.36 కోట్లు) ఉన్నారు. ఇక, కోహ్లీ కడుతున్న ట్యాక్స్ గురించి తెలిసి సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇది మామూలు నంబర్ కాదని.. సంపాదనలో అతడు ఏ రేంజ్లో ఉన్నాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలని అంటున్నారు. కెరీర్ పీక్‌లో ఉన్న కింగ్ ఇదే రీతిలో ఉంటే వచ్చే ఏడాది హయ్యెస్ట్ ట్యాక్స్ పెయిడ్ సెలెబ్రిటీస్ లిస్ట్‌లోనూ టాప్‌లోకి దూసుకొచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
Virat Kohli has paid 66 Crores Tax from April 2023 to March 2024…!!!! (Fortune India).
– King Kohli is the Highest Tax payers by any Sportsperson & Cricketer in India. 🐐 pic.twitter.com/Tq2t3SvN7s
— Tanuj Singh (@ImTanujSingh) September 4, 2024