కోహ్లీ కోసం ఏకంగా రూ.100 కోట్లు? IPL ఆక్షన్​లో పాత రికార్డులకు పాతర!

Virat Kohli Will Go For 100 Crore In IPL Auction: ఈ ఏడాది ఆఖర్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. దీనికి ఇంకా టైమ్ ఉంది. కానీ వేలంలో ఎవరు ఎంతకు అమ్ముడుపోతారు? ఎవరికి భారీ ధర దక్కుతుంది? లాంటి విషయాలను ఇప్పటి నుంచే ఫ్యాన్స్ డిస్కస్ చేస్తున్నారు.

Virat Kohli Will Go For 100 Crore In IPL Auction: ఈ ఏడాది ఆఖర్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. దీనికి ఇంకా టైమ్ ఉంది. కానీ వేలంలో ఎవరు ఎంతకు అమ్ముడుపోతారు? ఎవరికి భారీ ధర దక్కుతుంది? లాంటి విషయాలను ఇప్పటి నుంచే ఫ్యాన్స్ డిస్కస్ చేస్తున్నారు.

ఐపీఎల్-2025 మెగా ఆక్షన్​కు ఇంకా టైమ్ ఉంది. ఈ ఏడాది ఆఖర్లో వేలం నిర్వహించనున్నారు. కానీ ఆక్షన్​కు సంబంధించి అప్పుడే డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. వేలంలో ఏ ఆటగాడు ఎంతకు అమ్ముడుపోతాడు? ఎవరికి భారీ ధర దక్కుతుంది? లాంటి విషయాలను వెటరన్ క్రికెటర్లు, ఎక్స్​పర్ట్స్ దగ్గర నుంచి ఫ్యాన్స్ వరకు అంతా చర్చించుకుంటున్నారు. రోహిత్ శర్మ గురించి బాగా డిస్కషన్స్ నడిచాయి. కెప్టెన్సీ వివాదం కారణంగా ముంబై ఇండియన్స్​ నుంచి హిట్​మ్యాన్ బయటకు వచ్చేస్తాడనే ప్రచారం నేపథ్యంలో ఒకవేళ హిట్​మ్యాన్ గనుక వేలంలో పాల్గొంటే అతడు రూ.50 కోట్ల వరకు ధర పలికే ఛాన్స్ ఉందని రూమర్స్ వచ్చాయి. అతడి కోసం రెండు ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయని వినిపించింది. ఇప్పుడు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. కోహ్లీ కోసం ఏకంగా రూ.100 కోట్లు పెట్టేందుకు ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయట.

కోహ్లీ ఆక్షన్​లోకి దిగితే రూ.100 కోట్లు కొల్లగొట్టడం పక్కా అని సీనియర్ క్రికెటర్లు అంటున్నారు. విరాట్​తో పాటు సూర్యకుమార్ యాదవ్, జస్​ప్రీత్ బుమ్రా కూడా వేలంలోకి వస్తే సెంచరీ కొడతారని టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. వీళ్ల దెబ్బకు పాత రికార్డులకు పాతర పడటం ఖాయమని.. ఆల్​టైమ్ రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పాడు. ముఖ్యంగా కోహ్లీ గనుక వేలంలోకి వస్తే చాలా జట్లు ఎగబడతాయని తెలిపాడు. ఇదే విషయంపై మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా భిన్నంగా స్పందించాడు. ఒకవేళ విరాట్​కు 100 కోట్ల ఆఫర్ వచ్చినా అతడు ఆర్సీబీని వీడి వెళ్లడని చెప్పాడు. గతంలో ఎన్నో ఆఫర్లు వచ్చినా అతడు జట్టును వదల్లేదని.. ఇప్పుడు వంద కోట్లు ఇచ్చినా బెంగళూరును వీడడని పేర్కొన్నాడు ఆకాశ్ చోప్రా.

ఓటమిని కోహ్లీ అస్సలు సహించడని చెప్పిన ఆకాశ్ చోప్రా.. అతడు ఇంకా ఆర్సీబీతోనే ఉన్నాడని తెలిపాడు. ఆ టీమ్​తో అతడికి ఉన్న అనుబంధం అలాంటిదన్నాడు. లాయల్టీ అంటే రాయల్టీ అని కోహ్లీ నమ్ముతాడని.. అందుకే ఎన్ని ఆఫర్లు వచ్చినా బెంగళూరును కింగ్ వీడలేదన్నాడు ఆకాశ్ చోప్రా. ఆయన వ్యాఖ్యలతో ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఏకీభవిస్తున్నారు. ఫస్ట్ సీజన్ నుంచి కోహ్లీ ఒకే టీమ్​కు ఆడుతున్నాడని.. ఆ జట్టుపై ఎంత ప్రేమ, ఇష్టం ఉంటే ఇలా చేస్తాడో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. అంత ఈజీగా బంధం తెంచుకునే రకం కాదని చెబుతున్నారు. లాయల్టీకి బెస్ట్ ఎగ్జాంపుల్ విరాటేనని మెచ్చుకుంటున్నారు. అలా ఉన్నాడు కాబట్టే అతడికి అంతా గౌరవం ఇస్తారని అంటున్నారు. కెరీర్ ఆఖరి వరకు అతడు అదే టీమ్​కు ఆడతాడని చెబుతున్నారు. మరి.. ఈ మొత్తం వ్యవహారంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments