Virat Kohli: గర్వం తలకెక్కితే.. దేవుడు కిందికి లాగేస్తాడు! నా విషయంలో అదే జరిగింది: కోహ్లీ

గర్వం తలకెక్కితే ఆ దేవుడు కిందికి లాగేస్తాడని, నా విషయంలో కూడా అదే జరిగిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు విరాట్ కోహ్లీ. ఆ వివరాల్లోకి వెళితే..

గర్వం తలకెక్కితే ఆ దేవుడు కిందికి లాగేస్తాడని, నా విషయంలో కూడా అదే జరిగిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు విరాట్ కోహ్లీ. ఆ వివరాల్లోకి వెళితే..

‘మనిషి ఎదిగే కొద్ది ఒదిగుండాలి’.. అలా కాదని చిన్న విజయాలకే పొంగిపోయి, గర్వం తలకెక్కితే.. అక్కడి నుంచి అతడి పతనం మెుదలవుతుంది. ఇది చాలా మంది విషయాల్లో రుజువైంది కూడా. అందుకే విజయం సాధించిన తర్వాత ముందు వెనకా చూసుకుని, ఆచి తూచి అడుగులు గానీ, మాటలు గాని వదలాలి అన్నది పెద్దల మాట. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగిన వాడే చివరికి విజేతగా నిలుస్తాడు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్తున్నావ్ అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడికే వస్తున్నా.. గర్వం తలకెక్కితే ఆ దేవుడు కిందికి లాగేస్తాడని, నా విషయంలో కూడా అదే జరిగిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు విరాట్ కోహ్లీ.

విరాట్ కోహ్లీ.. టీమిండియా రన్ మెషిన్ గా ఫ్యాన్స్ చేత ముద్దుగా పిలిపిచ్చుకుంటూ.. రికార్డుల మీద రికార్డులు బద్ధలు కొడుతున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్ లో పరుగుల వరదపారించాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో అగ్రస్థానంలో నిలిచి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అయితే ఇదే జోరును టీ20 వరల్డ్ కప్ లోనూ కొనసాగిస్తాడని ఫ్యాన్స్ భావించారు. కానీ వారి అంచనాలు తలకిందులు అయ్యాయి. ఈ మెగాటోర్నీలో ఓపెనర్ గా బరిలోకి దిగిన విరాట్ లీగ్, సూపర్ 8 మ్యాచ్ ల్లో దారుణంగా విఫలం అయ్యాడు. ఫైనల్ మ్యాచ్ కు ముందు 7 మ్యాచ్ ల్లో కేవలం 75 రన్స్ మాత్రమే చేశాడు. కానీ కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో అద్భుత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు.

ఇదిలా ఉండగా.. టీమిండియా వరల్డ్ కప్ సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. గర్వం తలకెక్కితే.. ఆ దేవుడు కిందికి లాగేస్తాడని ఊహించని వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ మాట్లాడుతూ..”నిజాయితీగా చెప్పాలంటే ఈ వరల్డ్ కప్ నాకో గుణపాఠం. ఈ టోర్నీకి ముందు నేను గొప్పగా రాణించాను. దాంతో బహుశా నేను ఏదైనా సాధిస్తానని నమ్మకం, ఈగో నాలోపెరిగాయి అనుకుంటా. గర్వం తలకెక్కడంతో.. ఆ దేవుడు నన్ను కిందికి లాగేశాడు. ఈ టోర్నీ నాకో గుణపాఠం. పరిస్థితులకు తగ్గట్లుగా మనిషి మారినప్పుడే అతడు విజయం సాధిస్తాడు. ఇక ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో నేను యాంకర్ పాత్ర పోషించాను. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాను. బాల్ స్వింగ్ ఎక్కువగా అయ్యింది” అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. ఏ వ్యక్తి అయినా.. ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలన్న ఉద్దేశం, తన అనుభవాలను కలిపి ఈ వ్యాఖ్యలు చేశాడు కోహ్లీ. ప్రస్తుతం ఈ కామెంట్స్ క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరి కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments