SNP
Virat Kohli, IND vs NZ, Cricket News: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. ఓ చెత్త రికార్డును మూటగట్టకున్నాడు. ఆ రికార్డు ఏంటో తెలుస్తే బహుషా క్రికెట్ అభిమానులు తట్టుకోలేరేమో అనిపిస్తోంది. మరి ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Virat Kohli, IND vs NZ, Cricket News: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. ఓ చెత్త రికార్డును మూటగట్టకున్నాడు. ఆ రికార్డు ఏంటో తెలుస్తే బహుషా క్రికెట్ అభిమానులు తట్టుకోలేరేమో అనిపిస్తోంది. మరి ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
విరాట్ కోహ్లీ.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఒక ఎమోషన్. కేవలం కోహ్లీ కోసమే క్రికెట్ చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు. క్రికెట్ గురించి తెలియని వాళ్లకు, క్రికెట్ ఆడటం రాని వాళ్లకు, క్రికెట్ చూడని చాలా మందికి కూడా కోహ్లీ తెలుసు. అది కోహ్లీ రేంజ్. ఫేస్ ఆఫ్ ది వరల్డ్ క్రికెట్‌గా ఉన్నాడు. అలాంటి ఆటగాడు ఈ మధ్య రన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతని బ్యాట్ నుంచి పరుగులు రావడం కష్టమైపోతుంది. ఈ క్రమంలోనే ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆ రికార్డు గురించి తెలుసుకుంటే.. బహుషా విరాట్ కోహ్లీ అభిమానులు పాపం చాలా బాధపడతారు. ఇంతకీ ఆ చెత్త రికార్డ్ ఏంటంటే.. అత్యధిక సార్లు డకౌట్ అయిన టీమిండియా టాప్ 5 క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడిగా నిలిచాడు.
న్యూజిలాండ్‌తో ప్రారంభమైన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ అయిన విషయం తెలిసిందే. ఈ డకౌట్‌తో కలుపుకొని కోహ్లీ తన కెరీర్‌లో 38 సార్లు డకౌట్ అయ్యాడు. మొత్తం 596 ఇన్నింగ్స్‌ల్లో టెస్టుల్లో 15 సార్లు, వన్డేల్లో 16 సార్లు, టీ20ల్లో 7 సార్లు.. ఇలా అన్ని ఫార్మాట్లు కలుపుకొని 38 డకౌట్లు ఉన్నాయి. ఈ లిస్ట్‌లో ఫస్ట్‌లో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఉన్నాడు. అతను 43 సార్లు డకౌట్ అయ్యాడు. రెండో ప్లేస్‌లో ఇషాంత్ శర్మ ఉన్నాడు. ఇషాంత్ 40 సార్లు సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. మూడో ప్లేస్‌లో కోహ్లీ, నాలుగో ప్లేస్‌లో హర్భజన్ సింగ్ 37 సార్లు డకౌట్ అయ్యాడు. ఐదో ప్లేస్‌లో అనిల్ కుంబ్లే ఉన్నాడు. కుంబ్లే 35 సార్లు డకౌట్ అయ్యాడు.
టీమిండియా నుంచి ఎక్కువ సార్లు డకౌట్ అయిన టాప్ 5 ప్లేయర్ల లిస్ట్ ఇది. ఇందులో ఒక విషయం గమనించారా? టాప్ 5లో విరాట్ కోహ్లీ ఒక్కడే క్వాలిటీ బ్యాటర్. మిగతా వాళ్లంతా బౌలర్లు. జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ పేసర్లు, హార్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే స్పిన్నర్లు. నిజానికి బ్యాటింగ్ విషయంలో వీళ్లను టెయిలెండర్లు అంటారు. వీళ్ల నుంచి రన్స్ ఆశించకూడదు. ఎందుకంటే.. వాళ్ల పని బాల్ వికెట్లు తీసి.. మ్యాచ్ గెలిపించడం. బ్యాట్‌తో రన్స్ చేస్తే అది టీమ్‌కు బోనస్ అవుతుంది. కానీ, విరాట్ కోహ్లీ అలా కాదు. అతనో నిఖార్సయిన బ్యాటర్. రన్స్ చేయడానికే అతను టీమ్‌లో ఉన్నాడు. కానీ, అత్యధిక సార్లు డకౌట్ అయిన టాప్ 5 ప్లేయర్ల లిస్ట్‌లో కోహ్లీ టాప్ 3లో ఉండటం చాలా చెత్త రికార్డ్.
ఈ రికార్డును కోహ్లీ ఫ్యాన్స్ జీర్ణించుకోవడం కాస్త కష్టమే. అయితే.. ఈ ఒక్క రికార్డు పట్టుకొని.. కోహ్లీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.. అతనో గొప్ప బ్యాటర్. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. 27 వేలకు పైగా ఇంటర్నేషనల్ రన్స్ ఉన్నాయి. రేపో మాపో పాంటింగ్, సంగార్కరను దాటేసి.. సెకండ్ ప్లేస్‌కి వెళ్లి.. సచిన్ తర్వాత నిలుస్తాడు. ఇప్పటే 80 సెంచరీలు కొట్టేశాడు. సచిన్ 100 సెంచరీల తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ కోహ్లీనే. ఇన్ని అద్భుతమైన రికార్డుల మధ్య.. ఈ చెత్త రికార్డు చంద్రుడిపై మచ్చలాంటింది. మరి ఈ చెత్త రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.