వీడియో: లంక క్రికెటర్‌కు లైఫ్‌ లాంగ్‌ గుర్తుండిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన కోహ్లీ

వీడియో: లంక క్రికెటర్‌కు లైఫ్‌ లాంగ్‌ గుర్తుండిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన కోహ్లీ

Virat Kohli, Kusal Mendis, IND vs SL: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ ముగిసిన తర్వాత.. విరాట్‌ కోహ్లీ ఓ శ్రీలంక స్టార్‌ క్రికెటర్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చాడు. మరి గిఫ్ట్‌ అందుకున్న ఆ లక్కీ క్రికెటర్‌ ఎవరు? ఆ గిఫ్ట్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, Kusal Mendis, IND vs SL: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ ముగిసిన తర్వాత.. విరాట్‌ కోహ్లీ ఓ శ్రీలంక స్టార్‌ క్రికెటర్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చాడు. మరి గిఫ్ట్‌ అందుకున్న ఆ లక్కీ క్రికెటర్‌ ఎవరు? ఆ గిఫ్ట్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ టీమిండియాకు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది. టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత.. సూపర్‌ జోష్‌లో ఉన్న రోహిత్‌ సేన, లంకను 3-0 తేడాతో వన్డే సిరీస్‌ను క్వీన్‌స్వీప్‌ చేస్తుంది అంతా భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. టీమిండియాపై శ్రీలంక 0-2 తేడాతో సిరీస్‌ గెలిచింది. ఈ సిరీస్‌లో భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ స్పిన్‌ బౌలింగ్‌లోనే లెగ్‌ బిఫోర్‌గా అవుట్‌ అయ్యాడు. అయితే.. చివరి మ్యాచ్‌ తర్వాత మాత్రం ఓ లంక బ్యాటర్‌కు జీవితకాలం గుర్తుండిపోయేలా అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చాడు.

అయితే.. కోహ్లీ నుంచి ఆ గిఫ్ట్‌ కావాలని ఆ లంక క్రికెటరే అడిగి తీసుకున్నాడు. కోహ్లీపై అంత అభిమానం చూపించిన ఆ క్రికెటర్‌ ఎవరంటే.. ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన కుసల్‌ మెండిస్‌. సైన్‌ చేసిన జెర్సీ కావాలని.. మూడో మ్యాచ్‌ తర్వాత మెండిస్‌ కోహ్లీ కోరాడు. అతని కోరికను మన్నిస్తూ.. మ్యాచ్‌ ముగిసిన తర్వాత విరాట్‌ కోహ్లీనే స్వయంగా వెళ్లి జెర్సీ తీసుకొచ్చి తన ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని మెండిస్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు కోహ్లీ. సిరీస్‌లో ఫలితం ఎలా ఉన్నా.. ఆటగాళ్ల మధ్య ఇలాంటి స్నేహపూర్వక వాతావరణం ఉండటం మంచిదే అంటున్నారు క్రికెట్‌ అభిమానులు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. బుధవారం కొలంబో వేదికగా జరిగిన చివరిదైన మూడో వన్డేలో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ చేసి.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. పథుమ్‌ నిస్సంకా 45, అవిష్క ఫెర్నాండో 96, కుసల్‌ మెండిస్‌ 59 పరుగులు చేసి రాణించారు. ఇక 249 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా.. అత్యంత దారుణంగా 26.1 ఓవర్లలో కేవలం 138 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయి.. 110 పరుగులు భారీ తేడాతో ఓటమి పాలైంది. భారత బ్యాటర్లలో రోహిత్‌ శర్మ 35, వాషింగ్టన్‌ సుందర్‌ 30 పరుగులతో పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం అయ్యారు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శనతో పాటు కుసల్‌ మెండిస్‌కు కోహ్లీ గిఫ్ట్‌ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments