Nidhan
Travis Head Scores 30 Runs From One Over: ఆస్ట్రేలియా విధ్వంసకారుడు ట్రావిస్ హెడ్ మరోమారు శివాలెత్తాడు. ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించాడీ కంగారూ ఓపెనర్. సిక్సుల వర్షం కురిపించి ప్రత్యర్థి జట్టును ముంచేశాడు.
Travis Head Scores 30 Runs From One Over: ఆస్ట్రేలియా విధ్వంసకారుడు ట్రావిస్ హెడ్ మరోమారు శివాలెత్తాడు. ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించాడీ కంగారూ ఓపెనర్. సిక్సుల వర్షం కురిపించి ప్రత్యర్థి జట్టును ముంచేశాడు.
Nidhan
ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ మరోమారు శివాలెత్తాడు. ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించాడీ కంగారూ బ్యాటర్. సిక్సుల వర్షం కురిపించి ప్రత్యర్థి జట్టును ముంచేశాడు. ఆ టీమ్‌తో జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒకే ఓవర్లో ఏకంగా 30 పరుగులు బాదేశాడు. హెడ్‌తో పాటు జోష్ ఇంగ్లిష్ రాణించడంతో భారీ స్కోరు చేసింది ఆసీస్. ఆ తర్వాత ఆ జట్టు బౌలర్లు అదరగొట్టడంతో ఇంగ్లండ్‌ను 28 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అయితే మ్యాచ్‌లో హెడ్ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. ఫస్ట్ బాల్ నుంచే ఉతుకుడు మొదలుపెట్టాడతను. బౌలర్ ఎవరనేది చూడకుండా దంచుడే దంచుడు అన్నట్లు అతడి ఇన్నింగ్స్ సాగింది. ముఖ్యంగా సామ్ కర్రన్‌ను లక్ష్యంగా చేసుకొని భారీ షాట్లు బాదాడు హెడ్. అతడి ఓవర్లో సిక్సుల వర్షం కురిపించాడు.
కర్రన్ వేసిన ఒక ఓవర్లో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు హెడ్. వరుసగా 3 సిక్సులు బాదాడు. అన్ని డెలివరీస్‌ను భారీ షాట్లుగా మలిచాడు కంగారూ ఓపెనర్. మొత్తంగా ఆ ఓవర్లో మూడు ఫోర్లు, మూడు సిక్సులతో కర్రన్‌కు చుక్కలు చూపించాడు. 23 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 59 పరుగులు చేశాడు. ఇందులో 8 బౌండరీలతో పాటు 4 భారీ సిక్సులు ఉన్నాయి. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు హెడ్. తద్వారా ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ సరసన అతడు స్థానం సంపాదించాడు. ఒకే ఓవర్లో హయ్యెస్ట్ రన్స్ చేసిన ఆరో కంగారూ బ్యాటర్‌గా నిలిచాడు. పాంటింగ్ 2005లో న్యూజిలాండ్ మీద ఈ ఫీట్ నమోదు చేశాడు. అతడి తర్వాత ఆరోన్ ఫించ్, గ్లెన్ మాక్స్వెల్, డాన్ క్రిస్టియాన్, మిచ్ మార్ష్ కూడా ఒకే ఓవర్లో 30 పరుగులు బాదారు. తాజాగా హెడ్ కూడా ఆ ఫీట్‌ను అందుకున్నాడు.
ఇక, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయింది. హెడ్, ఇంగ్లిస్‌తో పాటు ఓపెనర్ మ్యాట్ షార్ట్ (26 బంతుల్లో 41) రాణించడంతో మంచి స్కోరు చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ విజయానికి 28 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఆ టీమ్ 151 పరుగులకు కుప్పకూలింది. లియామ్ లివింగ్స్టన్ (37) తప్ప ఎవరూ రాణించలేదు. ఫిల్ సాల్ట్ (20), జోర్డాన్ కాక్స్ (17), జేమీ ఓవర్టన్ (15) మంచి స్టార్ట్ దొరికినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. హెడ్ మాదిరిగా ఒక్క బ్యాటర్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడినా ఇంగ్లీష్ టీమ్ ఒడ్డున పడేది. సీన్ అబాట్ (3/28)తో పాటు జోష్ హేజల్‌వుడ్ (2/32), ఆడమ్ జంపా (2/20) ప్రత్యర్థి బ్యాటర్లను క్రీజులో సెటిల్ కాకుండా చూసుకున్నారు. మార్కస్ స్టొయినిస్, కామెరాన్ గ్రీన్, జేవియర్ బార్ట్లెట్ చెరో వికెట్ తీసి వీళ్లకు మంచి సహకారం అందించారు. మరి.. హెడ్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
Travis Head smashed 30 runs in an over against Sam Curran. 🤯
– Head, the beast man! pic.twitter.com/KpNVOCySJ0
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2024