Somesekhar
Team India Won The First Test Against Bangladesh: బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టు లో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ అద్భుత విజయానికి 5 కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం పదండి.
Team India Won The First Test Against Bangladesh: బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టు లో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ అద్భుత విజయానికి 5 కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం పదండి.
Somesekhar
బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా బోణీ కొట్టింది. చెపాక్ వేదికగా జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో 280 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 515 పరుగుల భారీ టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రవిచంద్రన్ అశ్విన్ మాయాజాలానికి 234 రన్స్ కు కుప్పకూలింది. బంగ్లా కెప్టెన్ షాంటో 82 పరుగులతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ.. జట్టును కాపాడలేకపోయాడు. అశ్విన్ 6 వికెట్లతో ప్రత్యర్థి ఓటమిని శాసించగా.. అతడికి అండగా 3 వికెట్లు తీసి రవీంద్ర జడేజా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 280 పరుగుల తేడాతో సూపర్ విక్టరీని సాధించింది. దాంతో సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఈ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించడానికి ప్రధాన కారణాల్లో బ్యాటింగ్ కూడా ఒకటి. తొలి ఇన్నింగ్స్ లో 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినప్పటికీ.. రవిచంద్రన్ అశ్విన్(113), రవీంద్ర జడేజా(86), జైస్వాల్ (56) పరుగులతో రాణించారు. దాంతో తొలి ఇన్నింగ్స్ లో 376 రన్స్ చేయగలిగింది. అనంతరం బంగ్లాను 149 రన్స్ కే కుప్పకూల్చి 227 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించి.. బంగ్లాపై ఒత్తిడి తెచ్చింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్(109), శుబ్ మన్ గిల్(119 నాటౌట్) సెంచరీలతో చెెలరేగడంతో.. 287/4 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దాంతో బంగ్లా ముందు 515 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది.
టీమిండియా బౌలర్లు కలిసికట్టుగా అద్భుతమైన బౌలింగ్ తో చెలరేగడంతో తొలి టెస్టులో బంగ్లా చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 149 పరుగులకు ఆలౌట్ అయ్యిందంటే దానికి కారణం జస్ప్రీత్ బుమ్రానే. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసి బంగ్లాను తక్కువ పరుగులకే కట్టడి చేశాడు. సిరాజ్, ఆకాశ్ దీప్ సైతం విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. మరోవైపు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ లు రెండో ఇన్నింగ్స్ లో బంతితో చెలరేగారు. 515 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ప్రత్యర్థిని 234 రన్స్ కే ఆలౌట్ చేశారు. మరీ ముఖ్యంగా అశ్విన్ దుమ్మురేపాడు. రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు పడగొట్టాడు. జడేజా 3 వికెట్లతో అశ్విన్ కు అండగా నిలుస్తూ విజయానికి కారణం అయ్యాడు.
ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించడానికి ప్రధాన కారణం కచ్చితంగా రవీంద్ర జడేజా – రవిచంద్రన్ అశ్విన్ పార్ట్ నర్ షిప్ అనే చెప్పాలి. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గిల్, కేఎల్ రాహుల్ లాంటి స్టార్లు అంతా విఫలం అయిన చోట.. ఈ జోడీ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. బంగ్లా బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ.. ఏడో వికెట్ కు ఏకంగా 199 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అశ్విన్ (113) సెంచరీతో చెలరేగగా, జడేజా(86) రన్స్ తో రాణించాడు. దాంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 376 పరుగులకు ఆలౌట్ అయ్యి.. పటిష్ట స్థితిలో నిలిచింది. వీరిద్దరి పార్ట్ నర్ షిప్ విజయంలో కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నెలన్నర సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతుండటంతో.. కొన్ని సందేహాలు క్రికెట్ లవర్స్ లో నెలకొన్నాయి. అయితే ఆ సందేహాలన్నింటికీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన అద్భుతమైన కెప్టెన్సీతో బదులిచ్చాడు. పాకిస్థాన్ ను ఓడించిన బంగ్లా కోసం ప్రత్యేకంగా వ్యూహాలను రచించాడు. నహీద్ రానాను ఎదుర్కోవడం కోసం ముందుగానే ప్లాన్ వేసి గుర్నూర్ బ్రార్ తో ప్రాక్టీస్ చేయించాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగుల భారీ ఆధిక్యం ఉన్నప్పటికీ.. బంగ్లాను తెలివితో ఫాలో ఆన్ ఆడించలేదు. ఇది అందరికి ఆశ్చర్యం కలిగించింది. ఇక గ్రౌండ్ లో పిచ్ పరిస్థితులను బట్టి బౌలర్లను ఉపయోగించుకున్న తీరు అద్భుతం. తొలి ఇన్నింగ్స్ లో పేస్ బౌలింగ్ కు అనుకూలిస్తుండటంతో బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్ లకు ఎక్కువ అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో పిచ్ స్పిన్ కు అనుకూలంగా మారడంతో.. అశ్విన్, జడేజాలతో బంగ్లా కథ ముగించాడు. ఈ విజయం అతడి సూపర్ కెప్టెన్సీకి నిదర్శనం.
టీమిండియా విజయంలో పిచ్ కూడా ఒక విధంగా భాగస్వామ్యం అయ్యింది. చెపాక్ పిచ్ ను పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉండేందుకు ఎర్ర నేలతో రెడీ చేయించారు. కొద్దిగా గ్రాస్ కూడా వదిలినట్లు సమాచారం వచ్చింది. బంగ్లా స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగలదు, బాగా వేయగలదు. అందుకే పేస్ పిచ్ తయారు చేయించాడు. అది వర్కౌట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆ టీమ్‌ను మన పేస్ బలంతో త్వరగా ఆలౌట్ చేశాం. బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్ పేస్ బౌలింగ్ తో బంగ్లాను 149 రన్స్ ఆలౌట్ చేశారు. అయితే సేమ్ టైమ్ లో స్పిన్ ను ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బంది పడుతున్న మన బ్యాటర్లకు కూడా ఈ వికెట్ హెల్ప్ అయ్యింది. పేస్ వికెట్ అవడంతో మనోళ్లు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మొదట్లో ఇబ్బంది పడినా ఆ తర్వాత నుంచి చెలరేగిపోయారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో పేస్ కు అనుకూలిస్తుందనుకున్న పిచ్.. కాస్త స్పిన్ కు రియాక్ట్ కావడంతో.. అశ్విన్, జడేజాలు బంగ్లా బ్యాటర్లను ఓ ఆటాడుకుని టీమిండియాకు భారీ విజయాన్ని కట్టబెట్టారు. మరి బంగ్లాదేశ్ పై టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ravi Ashwin has been awarded Player of the Match for his outstanding performance with both bat and ball 🙌 pic.twitter.com/pEaYYrjnfi
— CricTracker (@Cricketracker) September 22, 2024
A massive victory for India at home as they defeat Bangladesh by 280 runs in the first Test.
Ravichandran Ashwin shines with the ball in the second innings, claiming his 37th five-wicket haul! 🌟 pic.twitter.com/odOleQ28TN
— CricTracker (@Cricketracker) September 22, 2024