వీడియో: సంచలనం.. సూపర్‌ ఓవర్‌తో తేలిన ఫలితం! గెలిపించిన హీరోలు వీళ్లే..

వీడియో: సంచలనం.. సూపర్‌ ఓవర్‌తో తేలిన ఫలితం! గెలిపించిన హీరోలు వీళ్లే..

IND vs SL, Super Over, Suryakumar Yadav, Rinku Singh: శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా అద్భుతమే చేసింది. దాదాపు ఓడిపోయిన మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌ వరకు తీసుకెళ్లి గెలిచింది. ఈ విజయానికి కారణమై హీరోలుగా నిలిచింది ఎవరో ఇప్పుడు చూద్దాం..

IND vs SL, Super Over, Suryakumar Yadav, Rinku Singh: శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా అద్భుతమే చేసింది. దాదాపు ఓడిపోయిన మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌ వరకు తీసుకెళ్లి గెలిచింది. ఈ విజయానికి కారణమై హీరోలుగా నిలిచింది ఎవరో ఇప్పుడు చూద్దాం..

నామమాత్రమైన మ్యాచ్‌.. అయినా నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. ఓటమి కోరల్లో చిక్కుకున్న టీమిండియాను బౌలర్లుగా మారిన స్టార్‌ బ్యాటర్లు గెలిపించారు. ఆల్‌మోస్ట్‌ గెలిచేసిన లంకను.. విజయం గడపను దాటకుండా వెనక్కి గుంచుకొచ్చి మరీ ఓడించారు. కేవలం 137 పరుగులు చేసి కూడా టీమిండియా ఆ స్కోర్‌ డిఫెండ్‌ చేసుకోగలిగింది. సూర్యకుమార్‌ యాదవ్‌, రింకూ సింగ్‌, రియాన్‌ పరాగ్‌.. టీ20 క్రికెట్‌లో హార్డ్‌ హిట్టింగ్‌కు పెట్టింది పేరు.. కానీ, నిన్న మాత్రం.. ఒక ముత్తయ్య మురళీధరణ్‌, ఒక అనిల్‌ కుంబ్లే, ఒక షేన్‌ వార్న్‌లా మారి.. మ్యాచ్‌ను మలుపుతిప్పేశారు. 138 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 15 ఓవర్లు ముగిసే సరికి.. కేవలం ఒక్క వికెట్‌ కోల్పోయి 110 పరుగులు చేసి శ్రీలంక పటిష్టస్థితిలో నిచిలించి.

ఇక్కడి నుంచి శ్రీలంక మ్యాచ్‌ ఓడిపోతుందని.. ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ, కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుతమై చేశాడు. ప్రధాన బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చుకుంటుంటే.. ఇలా అయితే లాభం లేదని.. శ్రీలంక ఊహించని విధంగా రింకూ సింగ్‌ను బౌలింగ్‌కు దించడమే కాకుండా.. చివరి ఓవర్‌లో శ్రీలంక విజయానికి 6 పరుగులు అవసరమైన సమయంలో.. తానే స్వయంగా బౌలింగ్‌ వేసి.. తొలి మూడు బంతుల్లో రెండు వికెట్లు తీసి.. కేవలం 5 పరుగులు ఇచ్చి మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌కు తీసుకెళ్లాడు. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కానీ షాక్‌లో ఉన్న శ్రీలంక.. సూపర్‌ ఓడి.. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసింది. ఇక సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. తొలి బంతికే సూర్య ఫోర్‌ కొట్టడంతో మ్యాచ్‌ గెలిచేసింది. ఇలా ఊహకందని రీతిలో టీమిండియా ఈ మ్యాచ్‌ గెలిచింది.

తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవడంతో చివరి మ్యాచ్‌లో బెంచ్‌లో ఉన్న ఆటగాళ్లందరికీ ఛాన్స్‌ ఇచ్చింది టీమిండియా మేనేజ్‌మెంట్‌. తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన హార్ధిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, అర్షదీప్‌ సింగ్‌, రిషభ్‌ పంత్‌లకు రెస్ట్‌ ఇచ్చి.. వారి స్థానంలో సంజు శాంసన్‌, ఖలీల్‌ అహ్మద్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శివమ్‌ దూబేలకు అవకాశం ఇచ్చింది. కానీ, తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కేవలం 137 పరుగులు మాత్రమే చేసింది. జైస్వాల్‌, సంజు శాంసన్‌, రింకూ సింగ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శివమ్‌ దూబే దారుణంగా విఫలం అయ్యారు. ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ 39, రియాన్‌ పరాగ్‌ 26, వాషింగ్టన్‌ సుందర్‌ 25 పరుగులు చేసి రాణించడంతో ఆ మాత్రం స్కోర్‌ దక్కింది.

ఇక 138 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంకకు టాపార్డర్‌ బ్యాటర్లు గట్టి పునాది వేశారు. పథుమ్‌ నిస్సంకా 26, కుసల్‌ మెండిస్‌ 43, కుసల్‌ పెరీరా 46 పరుగులు చేసి.. ఆల్‌మోస్ట్‌ మ్యాచ్‌ గెలిపించేశారు. కానీ.. ఆ తర్వాత టీమిండియా చెలరేగిపోయింది. చివరి 26 బంతుల్లో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 7 వికెట్లు కుప్పకూల్చింది. టాపార్డర్‌లోని ముగ్గురు బ్యాటర్లు తప్పితే.. మిగతా బ్యాటర్లు ఎవరూ కూడా 4 పరుగులకు మించి స్కోర్‌ చేయలేదు. భారత పార్ట్‌టైమ్‌ బౌలర్లు రియాన్‌ పరాగ్‌, రింకూ సింగ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుతమై చేశారు. వారితో పాటు వాషింగ్టన్‌ సుందర్‌ కూడా ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. శ్రీలంక విజయానికి 12 బంతుల్లో 9 పరుగులు కావ్సాలిన సమయంలో రింకూ సింగ్‌ 19వ ఓవర్‌ వేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. రింకూ ఇచ్చిన షాక్‌లో ఉన్న శ్రీలంకకు.. సూర్య బంతి అందుకోని ఊహించిన మరో షాక్‌ ఇచ్చాడు.

6 బంతుల్లో 6 పరుగులు కావ్సాలిన లంకకు కేవలం 5 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు. తొలి బంతి డాట్‌, రెండు, మూడు బంతుల్లో రెండు వికెట్లు.. ఆ తర్వాత సింగ్‌, చివరి రెండు బంతుల్లో రెండేసి పరుగులు రావడంతో మ్యాచ్‌ టై అయింది. ఇక సూపర్‌ ఓవర్‌లో లంక రెండు రన్స్‌ చేసి రెండు వికెట్లు కోల్పోయింది. సూపర్‌ ఓవర్‌లో గిల్‌తో కలిసి బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ సూర్య ఫస్ట్‌ బాల్‌కే బౌండరీ కొట్టి మ్యాచ్‌ గెలిపించాడు. టీమిండియా చేసిన ఈ ప్రదర్శన చూసి.. సూర్యను సూర్య మురళీధరణ్‌ అని, రింకూను.. రింకూ కుంబ్లే, రియాన్‌ పరాగ్‌ను.. రియాన్‌ వార్న్‌ అని క్రికెట్‌ అభిమానులు సరదాగా పేర్కొంటున్నారు. టీమిండియా ఇన్ని రోజులు ఇలాంటి పార్టటైమ్‌ బౌలర్లను మిస్‌ అయిందని, పార్ట్‌టైమ్‌ బౌలర్ల పవరేంటో ఈ ముగ్గురు చూపించారంటూ క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విజయంతో టీమిండియా మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments