Nidhan
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. క్రికెట్లో ఆ ఫీట్ నమోదు చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి ప్లేయర్‌గా నిలిచాడు.
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. క్రికెట్లో ఆ ఫీట్ నమోదు చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి ప్లేయర్‌గా నిలిచాడు.
Nidhan
టీమిండియాలో తక్కువ టైమ్‌లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో షార్ట్ టైమ్‌లో స్టార్ ప్లేయర్ హోదా తెచ్చుకున్నాడు. అతడికి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇటు ఇంటర్నేషనల్ క్రికెట్లో భారత్ తరఫున దుమ్మురేపుతూనే అటు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపునా అదరగొడుతున్నాడు. టీమిండియాలో టీ20లు అనగానే మిస్టర్ 360నే అందరికీ గుర్తుకొస్తాడు. పొట్టి ఫార్మాట్లో సూర్య భాయ్ ఆట అలా ఉంటుంది మరి. ప్రత్యర్థి ఎవరైనా, అవతల ఉన్నది ఎలాంటి బౌలర్ అయినా పట్టించుకోకుండా టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. ఫామ్‌లో ఉంటే ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌ను ఆపడం ఎంతటి బౌలర్‌కు అయినా కష్టమే. అంతాగా టీ20 క్రికెట్ మీద తన మార్క్ వేశాడతను. అలాంటి సూర్య ఇప్పుడు చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని ఓ రికార్డును క్రియేట్ చేశాడు.
టీ20 క్రికెట్లో సూర్యకుమార్ ప్రతాపానికి ఐసీసీ తగిన గుర్తింపును ఇచ్చింది. వరుసగా రెండో సంవత్సరం అతడ్ని టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు సెలక్ట్ చేసింది. దీంతో అతడు అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20ల్లో రెండుసార్లు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని నెగ్గిన మొట్టమొదటి క్రికెటర్‌గా సూర్య రికార్డు నెలకొల్పాడు. 2022లోనూ అతడు ఈ అవార్డు అందుకున్నాడు. గతేడాది పొట్టి ఫార్మాట్లో 17 ఇన్నింగ్స్‌ల్లో 48.86 యావరేజ్, 155.95 స్ట్రయిక్ రేట్‌తో 733 పరుగులు చేశాడు సూర్య. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడటంతో.. ఆసీస్, సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ల్లో భారత జట్టు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. దీంతో అతడ్ని టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్‌కు కెప్టెన్‌గానూ నియమించింది ఐసీసీ.
ఇప్పుడంటే టీమిండియాలో స్టార్ ప్లేయర్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ఈ స్థితికి చేరుకునేందుకు సూర్యకుమార్ ఎంతో కష్టపడ్డాడు. 2012 నుంచి ఐపీఎల్లో ఆడుతూ వస్తున్నాడు మిస్టర్ 360. తొలి మూడు సీజన్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడినా.. ఎక్కువ ఛాన్సులు రాలేదు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌కు మారినప్పటి నుంచి అతడి ఫేట్ మారిపోయింది. దుమ్మురేపే పెర్ఫార్మెన్స్‌లతో అందరి దృష్టిని ఆకర్షించాడు. వరుసగా మూడు సీజన్లలో 512, 424, 480 పరుగులు చేశాడు. అయినా అతడ్ని తీసుకోకపోవడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు 2021, మార్చిలో భారత జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడిన సూర్య.. అక్కడి నుంచి ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం గాయానికి సర్జరీ చేయించుకొని ఆస్పత్రిలో ఉన్న సూర్య.. ఈసారి ఐపీఎల్ ఆరంభంలో కొన్ని మ్యాచులు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి.. సూర్య చరిత్ర సృష్టించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Suryakumar Yadav becomes the first Men’s cricketer to win the ICC T20I player of the year award twice.
– SKY, One of the greatest ever. 🫡 pic.twitter.com/lRvIZcDoDx
— Johns. (@CricCrazyJohns) January 24, 2024