Nidhan
టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ శర్మ చెప్పాకే ఆ ఇన్నింగ్స్ గొప్పతనం తెలిసిందన్నాడు.
టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ శర్మ చెప్పాకే ఆ ఇన్నింగ్స్ గొప్పతనం తెలిసిందన్నాడు.
Nidhan
ఆస్ట్రేలియాను వాళ్ల సొంత గడ్డపై ఓడించడం కష్టం. అది కూడా గబ్బా గ్రౌండ్లో అయితే అసాధ్యం. అక్కడ మ్యాచ్‌ను డ్రా చేసినా గొప్పే. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది టీమిండియా. ఇది జరిగి మూడేళ్లు అవుతోంది. 2021, జనవరి 19వ తేదీన కంగారూలను 3 వికెట్ల తేడాతో ఓడించింది భారత్. ఈ మ్యాచ్‌లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 336 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేసింది ఆసీస్. దీంతో భారీ టార్గెట్‌ను భారత్ ఛేజ్ చేయలేదని అంతా అనుకున్నారు. కానీ శుబ్‌మన్ గిల్ (91), ఛతేశ్వర్ పుజారా (56) రాణించడంతో ఆశలు చిగురించాయి. రిషబ్ పంత్ (89 నాటౌట్) టెయిలెండర్స్ సాయంతో టీమ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో గొప్ప విజయాల్లో ఒకటిగా నిలిచిన దీనిపై పంత్ తాజాగా రియాక్ట్ అయ్యాడు.
గబ్బా టెస్ట్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన పంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దాన్నో మామూలు విజయంగా, సాధారణ ఇన్నింగ్స్గానే చూశానన్నాడు. కానీ రోహిత్ శర్మ చెప్పాక గానీ ఆ ఇన్నింగ్స్ విలువ ఏంటో తనకు తెలియలేదన్నాడు. ‘రోహిత్ శర్మ చెప్పింది ఇంకా గుర్తుంది. ఆ మ్యాచ్‌లో గెలుపు తర్వాత నా రియాక్షన్స్‌ను హిట్‌మ్యాన్ చూశాడు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ నేను ఎక్సయిట్ కాకపోవడం అతడు గమనించాడు. నువ్వేం చేశావో నీకు అర్థం కావట్లేదని రోహిత్ అన్నాడు. మనం గెలిచామని, రెండోసారి సిరీస్ నెగ్గామని నేను చెప్పా. అయితే నువ్వు రిటైర్ అయ్యాక ఈ ఇన్నింగ్స్ గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతందని అన్నాడు. అప్పుడు నేనేం చేశానో నాకు అర్థమైంది’ అని పంత్ చెప్పుకొచ్చాడు.
ఇక, రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన పంత్ గ్రౌండ్లో కనిపించి ఏడాదికి పైనే అయిపోయింది. వేగంగా కోలుకుంటున్న అతడు.. జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న వీడియోలు అప్పుడప్పుడూ పోస్ట్ చేస్తున్నాడు. అతడి రాక కోసం భారత అభిమానులతో పాటు జట్టు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా అతడు టీమ్‌లోకి తీసుకొచ్చే బ్యాలెన్స్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. అందుకే అతడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తోంది. అయితే ఇంజ్యురీ నుంచి కోలుకున్న పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశాడు. కానీ ఎందుకైనా మంచిదని స్పెషలిస్ట్ దగ్గర కన్సల్టేషన్ కోసం అతడ్ని లండన్‌కు పంపాలని బీసీసీఐ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్లో అతడు కొన్ని మ్యాచులు మిస్ అవ్వొచ్చని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అయితే పంత్ ఫిట్నెస్ మీద ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి.. పంత్ కమ్‌బ్యాక్ కోసం మీరెంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rishabh Pant said – “After Gabba Test Win, I was not celebrating like others then Rohit Sharma bhai came & told ‘You don’t know what you have done, once you leave cricket then you will realise the importance of your innings’ then I realised that I have something great”. (Star) pic.twitter.com/hTLsPpcGxG
— CricketMAN2 (@ImTanujSingh) January 19, 2024
On this day #RishabhPant woke up and chose DESTRUCTION 🔥
His expertly paced 89* helped shatter a 32-year old streak of #Australia’s dominance at The Gabba & sealed for India a 2-1 series win in the dying moments of the Test!
Revisit this exceptional innings!#Cricket pic.twitter.com/C6Lif7h2wJ
— Star Sports (@StarSportsIndia) January 19, 2024