Nidhan
టీమిండియా లెజెండ్ ధోని పేరు తలచుకోగానే ధనాధన్ బ్యాటింగ్, అద్భుతమైన కెప్టెన్సీనే గుర్తుకొస్తుంది. సారథిగా కంటే ముందు విధ్వంసక బ్యాటింగ్‌తో అతడు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి బాల్ వేసినా స్టాండ్స్‌లోకి తరలించే మాహీ.. ఇప్పుడు కూడా అదే రేంజ్లో ఆడుతున్నాడు.
టీమిండియా లెజెండ్ ధోని పేరు తలచుకోగానే ధనాధన్ బ్యాటింగ్, అద్భుతమైన కెప్టెన్సీనే గుర్తుకొస్తుంది. సారథిగా కంటే ముందు విధ్వంసక బ్యాటింగ్‌తో అతడు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి బాల్ వేసినా స్టాండ్స్‌లోకి తరలించే మాహీ.. ఇప్పుడు కూడా అదే రేంజ్లో ఆడుతున్నాడు.
Nidhan
టీమిండియా లెజెండ్ ధోని అంటే ధనాధన్ బ్యాటింగ్, అద్భుతమైన కెప్టెన్సీనే గుర్తుకొస్తుంది. సారథిగా కంటే ముందు విధ్వంసక బ్యాటింగ్‌తో అతడు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి బాల్ వేసినా స్టాండ్స్‌లోకి తరలించే మాహీ.. ఇప్పుడు కూడా అదే రేంజ్లో ఆడుతున్నాడు. క్రికెట్లో ఎంతో డేంజరస్‌గా చెప్పే యార్కర్ బంతుల్ని కూడా అలవోకగా హెలికాప్టర్ షాట్ సాయంతో సిక్సులుగా మలుస్తుంటాడతను. బౌలర్ కాస్త లెంగ్త్ తప్పాడా బంతి ఆడియెన్స్‌లో పడాల్సిందే అనేలా మాహీ బ్యాటింగ్ సాగుతుంది. ఈసారి ఐపీఎల్లో ఇదే జరిగింది. గాయం కారణంగా ఎక్కువ డెలివరీస్ ఆడని ధోని.. ఆఖరి ఒకట్రెండు ఓవర్లలో బ్యాటింగ్‌కు దిగాడు. చివర్లో వచ్చి బౌండరీలు, సిక్సులతో సీఎస్కేకు భారీ స్కోర్లు అందించాడు. అలాంటోడ్ని ఓ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ తీసిపారేశాడు.
సన్‌రైజర్స్ యంగ్ గన్ నితీష్ కుమార్ రెడ్డి ధోని మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. టాలీవుడ్ హీరో కార్తికేయతో కన్వర్జేషన్లో మాహీ గురించి పలు వ్యాఖ్యలు చేశాడు నితీష్. ‘ధోనీకి టాలెంట్ ఉంది. కానీ అతడి బ్యాటింగ్‌లో టెక్నిక్ లేదు. విరాట్ కోహ్లీతో పోల్చుకుంటే మాహీ బ్యాటింగ్‌లో ఆ రేంజ్లో టెక్నిక్ కనిపించదు’ అని నితీష్ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నితీష్ కామెంట్స్‌ను కొందరు సమర్థిస్తే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ధోని బ్యాటింగ్ స్టైల్ రఫ్‌గా ఉంటుందని, టెక్నిక్ కంటే కూడా భుజ బలం, టైమింగ్ ఆధారంగా అతడి బ్యాటింగ్ సాగుతుందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీతో కంపేర్ చేస్తే ధోని టెక్నికల్‌గా అంత స్ట్రాంగ్ కాదని అంటున్నారు.
టెక్నిక్ తెలియందే ధోని ఇన్ని వేల పరుగులు చేశాడా? ఇన్నేళ్లుగా క్రికెట్లో కంటిన్యూ అవుతున్నాడా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఒక్క సీజన్లో బాగా ఆడినంత మాత్రాన లెజెండ్ మాహీ గురించి కామెంట్ చేయడం కరెక్ట్ కాదంటూ నితీష్‌కు చురకలు అంటిస్తున్నారు. ఈ సన్‌రైజర్స్ స్టార్ తన బ్యాటింగ్, బౌలింగ్‌ను మెరుగుపర్చుకొని టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం మీద ఫోకస్ చేయాలని.. అనవసర కామెంట్స్‌తో కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తే కెరీర్‌కే ప్రమాదమని ఇంకొందరు హెచ్చరిస్తున్నారు. ఇక, ఐపీఎల్-2024లో ఎస్ఆర్హెచ్ తరఫున ఆడుతూ 303 పరుగులు చేశాడు నితీష్. అలాగే మూడు వికెట్లు కూడా తీశాడు. ఆరెంజ్ ఆర్మీ ఫైనల్ వరకు చేరుకోవడంలో అతడిది కీలక పాత్ర. మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగుతూ విలువైన రన్స్ చేస్తూ టీమ్‌కు భారీ స్కోర్లు అందించాడు. మరి.. నితీష్-ధోని వివాదంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.