Rohit Sharma: బంగ్లాదేశ్ కోసం భారీ ప్లాన్.. రోహిత్ గట్టిగా బిగించేలా ఉన్నాడు!

Rohit Sharma, IND vs BAN: బంగ్లాదేశ్ సిరీస్ కోసం టీమిండియా భారీ ప్లాన్ చేస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ జోరు చూస్తుంటే ప్రత్యర్థిని గట్టిగా బిగించేలా ఉన్నాడు. మనోళ్ల దెబ్బకు బంగ్లా విలవిల్లాడటం ఖాయంగా కనిపిస్తోంది.

Rohit Sharma, IND vs BAN: బంగ్లాదేశ్ సిరీస్ కోసం టీమిండియా భారీ ప్లాన్ చేస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ జోరు చూస్తుంటే ప్రత్యర్థిని గట్టిగా బిగించేలా ఉన్నాడు. మనోళ్ల దెబ్బకు బంగ్లా విలవిల్లాడటం ఖాయంగా కనిపిస్తోంది.

టీమిండియా మ్యాచ్​లు లేక కొన్ని వారాల నుంచి డల్​గా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పుడు మేల్కోవాల్సిన టైమ్ వచ్చేసింది. ఇంకో పది రోజుల్లో భారత స్టార్లు యాక్షన్​లోకి దిగనున్నారు. బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్​కు ప్రిపేర్ అవుతోంది భారత్. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఈ సిరీస్ మొదలవనుంది. ఇప్పటికే ఈ సిరీస్​ కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన టీమ్​ను కూడా అనౌన్స్ చేసింది బీసీసీఐ. బంగ్లాదేశ్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోచ్ గౌతమ్ గంభీర్ భారీ ప్లానింగ్ చేస్తున్నారు. ఎలాంటి పొరపాట్లు, సంచలనాలకు తావివ్వొద్దని భావిస్తున్నారట. చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలనే ఉద్దేశంతో గట్టిగా బిగించాలని డిసైడ్ అయ్యారట. అందుకోసం స్కెచ్​ను రెడీ చేశారని తెలుస్తోంది.

పాకిస్థాన్​ను వాళ్ల సొంతగడ్డపై క్లీన్​స్వీప్ చేసిన బంగ్లాదేశ్​ను రోహిత్-గౌతీ లైట్ తీసుకోవడం లేదట. వాళ్ల స్పిన్ అటాక్ బలంగా ఉండటంతో అస్సలు రిస్క్ తీసుకోవద్దని భావిస్తున్నారట. అందుకే బలమైన టీమ్​ను ఎంపిక చేయించారట. రెస్ట్ మోడ్​లో ఉన్న పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రాను ఆడించాలని అనుకోవడం కూడా దీంట్లో భాగమేనట. రెండేళ్లుగా టీమ్​కు దూరంగా ఉన్న రిషబ్ పంత్, ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​లో అదరగొట్టిన ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్​ను టీమ్​లోకి తీసుకోవడానికి కూడా ఇదే రీజన్ అని తెలుస్తోంది. ఫస్ట్ టెస్ట్​కు వారం ముందే అంటే సెప్టెంబర్ 12న చెన్నైకి వెళ్లనుందట టీమిండియా. అక్కడి చెపాక్ స్టేడియంలో 5 రోజుల పాటు ట్రెయినింగ్ క్యాంప్ నిర్వహిస్తారట. ఇందులో రోహిత్, కోహ్లీ, బుమ్రా సహా జట్టుకు ఎంపికైన ప్రతి ఆటగాడు హాజరవుతాడని క్రికెట వర్గాల సమాచారం.

సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​ను పోలిన యాక్షన్​తో బౌలింగ్ చేసే హిమాన్షు సింగ్​ను ట్రెయినింగ్ క్యాంప్​కు ఎంపిక చేసిందట బీసీసీఐ. చీఫ్​ సెలెక్టర్ అజిత్ అగార్కర్​కు అతడి బౌలింగ్ నచ్చిందట. బంగ్లా టీమ్​లో స్పిన్నర్లు ఎక్కువగా ఉండటం, చెపాక్ పిచ్ టర్న్​కు సహకరిస్తుంది కాబట్టి హిమాన్షుతో మన బ్యాటర్లకు ఎక్కువ ప్రాక్టీస్​ దొరికేలా రోహిత్-గంభీర్ ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తోంది. బంగ్లా స్పిన్​ను సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు ఆ టీమ్​ను మన జట్టు స్పిన్నర్ల ఉచ్చులో పడేలా భారీ స్కెచ్ వేస్తున్నారని సమాచారం. అశ్విన్, అక్షర్, కుల్దీప్​తో రెగ్యులర్ డెలివరీస్​తో పాటు కొన్ని ప్రత్యేక అస్త్రాలను కూడా సిద్ధం చేయించే పనిలో ఉన్నారట. కొడితే బంగ్లా తిరిగి లేవకుండా గట్టిగా బిగించాలని భావిస్తున్నారట. ఇక, ఈ సిరీస్​కు ఎంపికైన తుషార్ దేశ్​పాండే మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మరి.. బంగ్లాను భారత్ క్వీన్​స్వీప్ చేస్తుందా? లేదా? ఈ సిరీస్ రిజల్ట్ ఎలా ఉండబోతోందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments