David Miller Confirms He Has Not Retired: మిల్లర్ రిటైర్మెంట్ అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన సౌతాఫ్రికా స్టార్!

David Miller: మిల్లర్ రిటైర్మెంట్ అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన సౌతాఫ్రికా స్టార్!

టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్​లో ఓటమితో సౌతాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్ కెరీర్​కు గుడ్​బై చెప్పేశాడంటూ వార్తలు వచ్చాయి. దీనిపై అతడు తాజాగా క్లారిటీ ఇచ్చాడు.

టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్​లో ఓటమితో సౌతాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్ కెరీర్​కు గుడ్​బై చెప్పేశాడంటూ వార్తలు వచ్చాయి. దీనిపై అతడు తాజాగా క్లారిటీ ఇచ్చాడు.

సౌతాఫ్రికా జట్టు హార్ట్ బ్రేక్ అయింది. టీ20 వరల్డ్ కప్-2024 ట్రోఫీ చేతుల దాకా వచ్చి మిస్సవడంతో ఆ టీమ్ నిరాశలో కూరుకుపోయింది. సీజన్ మొత్తం అద్భుతమైన ఆటతీరుతో అలరించారు ప్రొటీస్ ఆటగాళ్లు. ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండానే ఫైనల్​కు వచ్చిన సఫారీలు.. తుదిపోరులో భారత్ జోరు ముందు తలొంచక తప్పలేదు. రోహిత్ సేనను కూడా ఓడిస్తామని అనుకున్నారు. అందుకు తగ్గట్లే మ్యాచ్​ ఆఖరి బంతి వరకు ఆ టీమ్ ప్లేయర్లు సూపర్బ్​గా ఆడారు. ఓ దశలో సౌతాఫ్రికాదే విజయమని అంతా అనుకున్నారు. క్లాసెన్-మిల్లర్ క్రీజులో ఉండటం, 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉండటంతో కప్పు మార్క్రమ్ సేనదేనని చాలా మంది భావించారు. బంతికో పరుగు చొప్పున చేసినా గెలిచే అవకాశం ఉండటంతో ఇక టైటిల్ చేజారిందని భారత అభిమానులు టెన్షన్ పడ్డారు.

కీలక టైమ్​లో క్లాసెన్ ఔట్ అవడం, స్వల్ప వ్యవధిలో మిల్లర్ కూడా పెవిలియన్ బాట పట్టడంతో సౌతాఫ్రికా కప్పుకు ఆమడ దూరంలో ఆగిపోయింది. జస్​ప్రీత్ బుమ్రా, అర్ష్​దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అద్భుత బౌలింగ్​తో ప్రొటీస్ నుంచి మ్యాచ్​ను లాగేసుకున్నారు. క్లాసెన్ ఔట్ అయినా ఆఖరి వరకు మిల్లర్ ఉండటంతో సౌతాఫ్రికా ఫ్యాన్స్ గెలుపుపై ఆశలు పెంచుకున్నారు. కానీ సూర్యకుమార్ యాదవ్ ఫెంటాస్టిక్ క్యాచ్​తో మ్యాచ్​ను మలుపు తిప్పాడు. కప్పు మిస్సవడంతో మిల్లర్ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఎంత కష్టపడినా టైటిల్ దక్కలేదని అతడు బోరున విలపించాడు. ఇక, కప్పు కోల్పోయిన బాధలో ఉన్న మిల్లర్ రిటైర్మెంట్ ప్రకటించాడంటూ వార్తలు వచ్చాయి. వరల్డ్ కప్ ఓటమితో అతడు కెరీర్​కు గుడ్​బై చెప్పాడంటూ రూమర్స్ వచ్చాయి. దీనిపై అతడు తాజాగా క్లారిటీ ఇచ్చాడు.

రిటైర్మెంట్ వార్తల్ని కొట్టిపారేశాడు మిల్లర్. తాను టీ20 క్రికెట్​కు గుడ్​బై చెప్పానంటూ వస్తున్న రిపోర్ట్స్​లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశాడు. ‘నేను రిటైర్ అయ్యానంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. అవన్నీ అవాస్తవాలు. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ నుంచి నేను వైదొలగలేదు. సౌతాఫ్రికా టీమ్ సెలెక్షన్​కు నేను అందుబాటులో ఉంటా. నా నుంచి ఇంకా బెస్ట్ రావాల్సి ఉంది’ అని మిల్లర్ క్లారిటీ ఇచ్చాడు. తాను రిటైర్మెంట్ ప్రకటించలేదంటూ స్వయంగా సౌతాఫ్రికా స్టార్ స్పష్టత ఇవ్వడంతో అతడి అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. మిల్లర్​లో ఇంకొన్నాళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉందని, ప్రొటీస్ టీమ్​కు అతడి అవసరం ఉందని చెబుతున్నారు. సఫారీ క్రికెట్​కు అతడి ఎక్స్​పీరియెన్స్ అవసరమని కామెంట్స్ చేస్తున్నారు.

Show comments