T20 వరల్డ్ కప్ ఫైనల్ చేరేది ఆ రెండు జట్లే.. ఎక్స్​పర్ట్స్​ ప్రిడిక్షన్ వైరల్!

టీ20 వరల్డ్ కప్-2024 సందడి మొదలైపోయింది. మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న యూఎస్​ఏలో ఇప్పుడు అంతా పొట్టి కప్పు గురించి డిస్కషన్ నడుస్తోంది. ఈ టైమ్​లో కొందరు ఎక్స్​పర్ట్స్​ వరల్డ్ కప్ ఫైనల్​పై ప్రిడిక్షన్ చెప్పారు.

టీ20 వరల్డ్ కప్-2024 సందడి మొదలైపోయింది. మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న యూఎస్​ఏలో ఇప్పుడు అంతా పొట్టి కప్పు గురించి డిస్కషన్ నడుస్తోంది. ఈ టైమ్​లో కొందరు ఎక్స్​పర్ట్స్​ వరల్డ్ కప్ ఫైనల్​పై ప్రిడిక్షన్ చెప్పారు.

టీ20 వరల్డ్ కప్-2024 సందడి మొదలైపోయింది. మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న యూఎస్​ఏలో ఇప్పుడు అంతా పొట్టి కప్పు గురించి డిస్కషన్ నడుస్తోంది. ఏ జట్టు బలంగా ఉంది, ఏది బలహీనంగా ఉంది అనే చర్చలు ఊపందుకున్నాయి. ఎవరు సెమీస్ వరకు వెళ్లగలరు, ఫైనల్​ వరకు వెళ్లి కప్ కొట్టే సత్తా ఎవరి సొంతం అనేది కూడా ఫ్యాన్స్ డిస్కస్ చేస్తున్నారు. ఇదే తరుణంలో మాజీ క్రికెటర్లు కూడా ప్రపంచ కప్ గురించి ప్రిడిక్షన్స్ మొదలుపెట్టారు. ఏ టీమ్ ఎంత వరకు వెళ్లగలదనేది అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో కొందరు ఎక్స్​పర్ట్స్​ వరల్డ్ కప్ ఫైనల్​పై ప్రిడిక్షన్ చెప్పారు. ఈసారి ఫైనల్ చేరేది ఆ రెండు జట్లేనని అంటున్నారు. ఎక్స్​పర్ట్స్ చెబుతున్న ఆ టీమ్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, టీమిండియా లెజెండ్ సునీల్‌ గవాస్కర్​, ఆసీస్ గ్రేట్ మాథ్యూ హేడెన్​తో పాటు మాజీ క్రికెటర్లు క్రిస్ మోరిస్, ఎస్​ శ్రీశాంత్, పాల్ కాలింగ్​వుడ్ వరల్డ్ కప్​పై ప్రిడిక్షన్ చెప్పారు. ఓ స్పోర్ట్స్ ఛానెల్​లో మాట్లాడుతూ మెగా టోర్నీల్లో ఫైనల్ చేరే జట్లు ఇవేనంటూ కామెంట్ చేశారు. భారత్, వెస్టిండీస్ ఈసారి పైనల్​కు వెళ్లడం పక్కా అని లారా అన్నాడు. టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా టైటిల్ ఫైట్​కు క్వాలిఫై అవుతుందని గవాస్కర్ అంచనా వేశాడు. హేడెన్, శ్రీశాంత్ కూడా ఈ రెండు జట్లే తుదిపోరుకు అర్హత సాధిస్తాయని చెప్పారు. ఇండియాతో పాటు సౌతాఫ్రికా ఫైనల్స్​ చేరడం పక్కా అని క్రిస్ మోరిస్ పేర్కొన్నాడు.

ఇంగ్లండ్ దిగ్గజం పాల్ కాలింగ్​వుడ్ మాత్రం మిగతా అందరి కంటే డిఫరెంట్​గా ప్రిడిక్షన్ చెప్పాడు. ఫైనల్స్​కు ఇంగ్లండ్, వెస్టిండీస్ వెళ్తాయని.. భారత్​కు అంత సీన్ లేదన్నాడు. కాలింగ్​వుడ్ తప్పితే మిగతా అందరు ఎక్స్​పర్ట్స్ ఫైనల్ చేరే జట్లలో భారత్ ఒకటని చెప్పారు. టీమిండియా తర్వాత తుదిపోరుకు అర్హత సాధించే టీమ్​గా ఆసీస్​ను చూపించారు. ఈ ప్రిడిక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీన్ని చూసిన నెటిజన్స్ రోహిత్ సేన ఫైనల్​కు చేరడం పక్కా అని అంటున్నారు. కప్పు కూడా మనదేనని.. రాసిపెట్టుకోండి అంటూ నమ్మకంగా చెబుతున్నారు. ఎక్స్​పర్ట్స్​ చెప్పిన టీమ్స్​లో ఏది వరల్డ్ కప్ నెగ్గుతుందనేది కాలమే నిర్ణయించాలి. మరి.. ఈసారి మెగా టోర్నీలో ఏ టీమ్స్ ఫైనల్​కు చేరతాయని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments