పాండ్యా ఈ స్థాయిలో ఉన్నాడంటే అది రోహిత్‌ పెట్టిన భిక్ష: రైనా

Hardik Pandya, Rohit Sharma, IPL 2024: రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ హార్ధిక్‌ పాండ్యాను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా పాండ్యా, రోహిత్‌ గురించి ఓ సంచలన వ్యాఖ్య చేశాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Hardik Pandya, Rohit Sharma, IPL 2024: రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ హార్ధిక్‌ పాండ్యాను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా పాండ్యా, రోహిత్‌ గురించి ఓ సంచలన వ్యాఖ్య చేశాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024లో అందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ గుజరాత్‌ టైటాన్స్‌. ఈ మ్యాచ్‌ కోసం చాలా మంది క్రికెట్‌ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఎందుకంటే.. ఈ మ్యాచ్‌లో హార్ధిక్‌ పాండ్యా కెప్టెన్సీలో రోహిత్‌ శర్మ ఆడుతున్నాడు. అలాగే గుజరాత్‌ టీమ్‌ నుంచి బయటికి వచ్చేసిన పాండ్యా.. తొలి మ్యాచ్‌లోనే గుజరాత్‌కు వ్యతిరేకంగా బరిలోకి దిగున్నాడు. ఇలా చాలా ఇంట్రెస్టింగ్‌ విషయాలతో ఈ మ్యాచ్‌పై అందరి దృష్టి నెలకొంది. అయితే.. ఈ మ్యాచ్‌ నుంచి అందరూ ఊహించిన దానికంటే ఎక్కువ స్టఫే దొరికింది. కెప్టెన్‌గా పాండ్యా చేసిన ఓవరాక్షన్‌, ప్రేక్షకులు పాండ్యాను దారుణంగా ర్యాగింగ్‌ చేయడం, గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోవడం ఇలా అన్ని పాండ్యాకు వ్యతిరేకంగా జరిగాయి.

అయితే.. ఈ మ్యాచ్‌లో అందర్ని చాలా బాధపెట్టిన విషయం ఏంటంటే.. రోహిత్‌ శర్మను పాండ్యా బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌కు పంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీనియర్‌ ప్లేయర్‌, మాజీ కెప్టెన్‌ అనే విషయాలను కూడా పక్కనపెడితే.. బౌండరీ లైన్‌ వద్ద రోహిత్‌ చేసే ఫీల్డింగ్‌ సెట్‌ కాదు. అయినా కూడా తన ఇగోను స్యాటిస్‌ఫై చేసుకోవడానికే పాండ్యా, రోహిత్‌ను లాంగ్‌ ఆన్‌లో ఫీల్డింగ్‌కు పంపాడనే విమర్శలు వస్తున్నాయి. పైగా రోహిత్‌ శర్మ నన్నేనా అని కూడా అడిగినా.. పాండ్యా పట్టించుకోకుండా రోహిత్‌ను బౌండరీ లైన్‌ వద్దకి పంపాడు. ఆ దృశ్యాలు క్రికెట్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిత్‌ శర్మ అభిమానులే కాదు సగటు క్రికెట్‌ ఫ్యాన్స్‌ కూడా దీనిపై పాండ్యాను తప్పుబడుతున్నారు.

ఈ క్రమంలోనే రోహిత్‌ శర్మ, హార్ధిక్‌ పాండ్యా గురించి టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. హార్ధిక్‌ పాండ్యా ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాడంటే.. అందుకే రోహిత్‌ శర్మనే కారణం అంటూ సురేష్‌ రైనా పేర్కొన్నాడు. పాండ్యా ముంబై ఇండియన్స్‌లోకి వచ్చిన టైమ్‌లో రోహిత్‌ శర్మ ముంబైకి కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే టీమిండియాలో కూడా పాండ్యా వచ్చేందుకు రోహిత్‌ శర్మ ఎంతో హెల్ప్‌ చేశాడు. అందుకే రైనా ఈ వ్యాఖ్యలు చేశాడు. అలాంటి రోహిత్‌ శర్మ పట్ట కనీస గౌరవం పాండ్యా చూపించడంలేదని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. మరి పాండ్యా, రోహిత్‌ గురించి రైనా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments