Rohit Sharma: ముంబై కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించడానికి అదే కారణం: భారత క్రికెటర్‌

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫుల్‌స్వింగ్‌లో ఉండగానే.. ముంబై ఇండియన్స్‌ అతన్ని కెప్టెన్‌గా తప్పించి.. హార్దిక్‌ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయంపై టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫుల్‌స్వింగ్‌లో ఉండగానే.. ముంబై ఇండియన్స్‌ అతన్ని కెప్టెన్‌గా తప్పించి.. హార్దిక్‌ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయంపై టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను తప్పించి, అతని స్థానంలో హార్ధిక్‌ పాండ్యాకు బాధ్యతలు అప్పగించడంతో మొదలైన వివాదం ఇంకా చల్లారలేదు. చాలా మంది రోహిత్‌ అభిమానులు ముంబై మేనేజ్‌మెంట్‌, పాండ్యాపై విమర్శలు చేసి.. ముంబై ఇన్‌స్టా అకౌంట్‌ను అన్‌ఫాలో చేశారు. తాజాగా ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్‌ ఒక ఇంటర్యూలో మాట్లాడుతూ.. రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించడానికి కారణం చెప్పుకొచ్చాడు. ఇదో క్రికెటింగ్‌ నిర్ణయమని, రోహిత్‌పై ఒత్తిడి తగ్గించేందుకే ముంబై యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే.. బౌచర్‌ వ్యాఖ్యలపై రోహిత్‌ శర్మ భార్య రితికా స్పందిస్తూ.. అవన్ని అబద్ధాలని సంచలన కామెంట్‌ చేసింది.

దీంతో.. ఇంకా వివాదం సమసిపోలేదని స్పష్టమైంది. తనను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఏనాడు డైరెక్ట్‌గా స్పందించని రోహిత్‌ శర్మ.. తాజాగా తన భార్య రితికా ఎల్లప్పుడూ తనవైపే ఉంటుందంటూ.. ఇన్‌డైరెక్ట్‌గా ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌కు వ్యతిరేకంగా ఆమె చేసిన కామెంట్‌కు మద్దతు పలికాడు. ఇప్పుడు ఈ విషయంపై భారత దిగ్గజ మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ స్పందిస్తూ.. రోహిత్‌ శర్మను ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా తప్పించడాన్ని సమర్ధించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ముంబై మేనేజ్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చాడు.

గవాస్కర్‌ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం రోహిత్‌ శర్మ వయసు 36 సంవత్సరాలు, కానీ, పాండ్యాకు చాలా కెరీర్‌ ఉంది. ఈ నేపథ్యంలో వాళ్లు తీసుకున్న నిర్ణయం కూడా సరైందే. పైగా రోహిత్‌ శర్మ టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా ఉన్నాడు. దీంతో.. అతనిపై ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. ఆ ఒత్తిడిని తగ్గించేందుకే కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఇక రానున్న ఐపీఎల్‌ సీజన్స్‌లో రోహిత్‌ శర్మ ఒత్తిడి లేకుండా చాలా ఫ్రీగా బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంది’ అని తెలిపారు. మరి రోహిత్‌ను ముంబై కెప్టెన్‌గా తప్పించడాన్ని గవాస్కర్‌ సమర్ధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments