Nidhan
Mark Wood, One Handed Catch: క్రికెట్ లో సింగిల్ హ్యాండెడ్ క్యాచెస్ చాలానే చూసుంటారు. కానీ ఇది వాటన్నింటిలోకెల్లా చాలా డిఫరెంట్. ప్లేయర్ కాదు.. ఆడియెన్స్ లో ఒకరు ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నారు.
Mark Wood, One Handed Catch: క్రికెట్ లో సింగిల్ హ్యాండెడ్ క్యాచెస్ చాలానే చూసుంటారు. కానీ ఇది వాటన్నింటిలోకెల్లా చాలా డిఫరెంట్. ప్లేయర్ కాదు.. ఆడియెన్స్ లో ఒకరు ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నారు.
Nidhan
క్రికెట్ లో క్యాచెస్ పరంగా చూసుకుంటే సింగిల్ హ్యాండెడ్ క్యాచ్ చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేసినప్పుడు ఇలాంటి క్యాచెస్ ఎక్కువగా పడుతుంటారు ఫీల్డర్లు. అయితే ఇలాంటి క్యాచెస్ పట్టేటప్పుడు బాడీని బ్యాలెన్స్ చేయడంతో పాటు హ్యాండ్-ఐ కోఆర్డినేషన్ కూడా కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. మంచి ఫీల్డర్లు మాత్రమే ఇలాంటి క్లిష్టమైన క్యాచెస్ పట్టుకోగలరు. అయితే మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఆడియెన్స్ లో ఒకరు ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నారు. ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఇది చోటుచేసుకుంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ ఫ్యాన్ కూల్ గా బీర్ తాగుతూ సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ పట్టేశాడు. ఈ క్యాచ్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ టైమ్ లో మార్క్ వుడ్ కొట్టిన ఓ సిక్స్ వెళ్లి స్టాండ్స్ లో పడింది. మిడ్ వికెట్ మీద పడి దూసుకొచ్చిన బౌన్సర్ ను లెగ్ సైడ్ దిశగా బలంగా బాదాడు వుడ్. దెబ్బకు బాల్ సిక్స్ వెళ్లింది. స్టాండ్స్ దిశగా దూసుకొస్తున్న బంతిని అందుకునేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. ఆడియెన్స్ లో అందరూ తమ చేతుల్ని పైకి పెట్టారు. కానీ వాళ్లెవరూ పట్టలేదు. అప్పటివరకు కూల్ గా బీర్ తాగుతూ మ్యాచ్ ను ఎంజాయ్ చేసిన ఓ ఫ్యాన్ ఒక చేతిలో బీర్ గ్లాస్ ను పట్టుకొని, మరో చేతితో బాల్ ను ఒడిసిపట్టాడు. క్యాచ్ అందుకునే క్రమంలో కాస్త ఎగిరినా గ్లాస్ జారకుండా, బీర్ కింద పడకుండా జాగ్రత్త పడ్డాడు. క్యాచ్ పట్టాక ఇంకో సిప్ వేసి సెలబ్రేట్ చేసుకున్నాడు.
యువకుడు చేతిలో బీర్ గ్లాస్ ను పెట్టుకొని ఇంకో చేతితో క్యాచ్ అందుకున్న తీరుకు అందరూ అవాక్కయ్యారు. ఇంగ్లండ్ కోచింగ్ స్టాఫ్ కూడా దీన్ని చూసి నవ్వు ఆపుకోలేకపోయారు. భలేగా పట్టావంటూ ఆ ఫ్యాన్ ను మెచ్చుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. వీడు మామూలోడు కాదు అంటూ అతడ్ని మెచ్చుకుంటున్నారు. ప్రొఫెషనల్ క్రికెటర్లు కూడా ఇంత అలవోకగా సింగిల్ హ్యాండ్ క్యాచ్ పట్టరేమో అని అతడ్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో లంక 236 పరుగులకు కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 358 రన్స్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన లంక ఇప్పుడు 271/6తో ఉంది. ఆ టీమ్ లీడ్ 149 రన్స్ దాటింది. ఇంకో 120 నుంచి 150 పరుగులు చేస్తే మ్యాచ్ రసవత్తరంగా మారే ఛాన్స్ ఉంది. మరి.. బీర్ తాగుతూ క్యాచ్ పట్టిన ఈ ఘటనపై మీ ఒపీనియన్ ను కామెంట్ చేయండి.
One handed catch 🤝 saved the beer glass.
– One of the finest crowd catches. 🤣👌 pic.twitter.com/sRPxTehoye
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 24, 2024