బంగ్లాపై గిల్ సూపర్ సెంచరీ.. ఒక్క ఇన్నింగ్స్​తో వాళ్ల నోళ్లు మూయించాడు!

Shubman Gill Smashes One More Century: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్ట్​లో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు.

Shubman Gill Smashes One More Century: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్ట్​లో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు.

టీమిండియాను ఓడిస్తామంటూ టెస్ట్ సిరీస్​కు ముందు ఓవరాక్షన్ చేసిన బంగ్లాదేశ్​ ఇప్పుడు పరువు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్​లో ఆ టీమ్​కు రోహిత్ సేన చుక్కలు చూపిస్తోంది. భారత్​తో మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తోంది. టెస్ట్ మ్యాచుల్లో ఉండే మజాను ఆడియెన్స్​కు కూడా రుచి చూపిస్తోంది మెన్ ఇన్ బ్లూ. చెన్నై టెస్ట్​లో మొదటి రోజు నుంచి డామినేషన్ చూపిస్తున్న రోహిత్ సేన.. డే-3 కూడా అదే కంటిన్యూ చేస్తోంది. యంగ్ బ్యాటర్స్ శుబ్​మన్ గిల్, రిషబ్ పంత్ సూపర్బ్ బ్యాటింగ్​తో టీమిండియాకు 515 పరుగుల భారీ ఆధిక్యం దక్కేలా చేశారు. పంత్ బ్యాటింగ్​ను కాసేపు అటుంచితే.. సెకండ్ ఇన్నింగ్స్​లో గిల్ ఆడిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఎంతో ఎక్స్​పీరియెన్స్ ఉన్న సీనియర్ బ్యాటర్స్ మాదిరి క్రీజులో స్తంభంలా పాతుకుపోయాడు. సెంచరీతో టీమ్​ విజయానికి గట్టి పునాది వేశాడు. అతడి ఇన్నింగ్స్ ఎలా సాగింది, గిల్​ బ్యాటింగ్ స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

డే-3ని పాజిటివ్​గా స్టార్ట్ చేసిన గిల్.. తన సహజశైలికి బదులు డిఫెన్స్​కు కాస్త ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఒక్కసారి క్రీజులో సెటిల్ అయ్యాక న్యాచురల్ స్టైల్​లో షాట్లు ఆడుతూ పోయాడు. మొత్తంగా 176 బంతుల్లో 119 పరుగులు చేశాడు. ఇందులో 10 బౌండరీలతో పాటు 4 భారీ సిక్సులు ఉన్నాయి. ఆ బౌలర్, ఈ బౌలర్ అనే తేడా లేకుండా అందర్నీ ఉతికిఆరేశాడు శుబ్​మన్. టీమిండియా మంచి లీడ్ సాధిస్తే మ్యాచ్​లో మరింత పట్టుబిగించే అవకాశం ఉండటం, అప్పటికే రోహిత్, కోహ్లీ సహా జైస్వాల్ కూడా ఔట్ అవడంతో బ్యాటింగ్ భారాన్ని తన భుజాల మీద వేసుకున్నాడు గిల్. ఒక ఎండ్​లో రిషబ్ పంత్ (128 బంతుల్లో 109) చెలరేగి ఆడినా శుబ్​మన్ మాత్రం ఎక్కువగా స్ట్రైక్ రొటేషన్ చేస్తూ, వికెట్ కాపాడుతూ కూల్​గా ఇన్నింగ్స్​ను బిల్డ్ చేశాడు. ఇలా ఆడాడు కాబట్టే అంత ఆధిక్యం వచ్చింది. అందుకే ఈ ఇన్నింగ్స్ ఎంతో స్పెషల్​గా నిలిచిపోతుందని చెప్పొచ్చు.

ఒక్క ఇన్నింగ్స్​తో విమర్శకులకు గిల్ గట్టిగా ఇచ్చిపడేశాడని చెప్పొచ్చు. టెస్టులకు అతడు పనికిరాడు, అతడి కంటే మంచి ఆటగాళ్లు ఉన్నారని కొందరు గిల్​ను క్రిటిసైజ్ చేయడం వినే ఉంటారు. అనవసరంగా అతడికి హైప్ ఇస్తున్నారని.. వన్డేలు, టీ20ల్లో వైస్ కెప్టెన్సీ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. బోర్డు ఇంత పుష్ చేస్తున్నా అతడు బెస్ట్ ఇవ్వట్లేదని, అతడికి బదులు ఇతర యంగ్​స్టర్స్​కు ఛాన్సులు ఇవ్వడం కరెక్ట్ అనే కామెంట్స్ వచ్చాయి. ఈ తరుణంలో బంగ్లా సిరీస్​కు ముందు భీకరంగా ప్రాక్టీస్ చేసిన గిల్.. దులీప్ ట్రోఫీలోనూ ఆడాడు. అక్కడ విఫలమైనా తన తప్పులు తెలుసుకొని బ్యాటింగ్​ను మెరుగుపర్చుకున్నాడు. ఇప్పుడు సూపర్ సెంచరీతో టీమిండియా ఫ్యూచర్ స్టార్ తానేనని, తన మీద కామెంట్స్ చేసే వారి నోళ్లు మూయించాడనే చెప్పాలి. మరి.. గిల్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments