Shreyas Iyer: పరువు తీసుకున్న అయ్యర్.. బిల్డప్ ఇచ్చి తుస్సుమన్నాడు!

Shreyas Iyer Wears Sunglasses While Batting: స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దులీప్ ట్రోఫీలో మరోమారు ఫెయిల్ అయ్యాడు. భారీ ఇన్నింగ్స్ ఆడతాడనుకుంటే దారుణంగా నిరాశపర్చాడు. బ్యాటింగ్​ టైమ్​లో అనవసర బిల్డప్ ఇచ్చి పరువు తీసుకున్నాడు.

Shreyas Iyer Wears Sunglasses While Batting: స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దులీప్ ట్రోఫీలో మరోమారు ఫెయిల్ అయ్యాడు. భారీ ఇన్నింగ్స్ ఆడతాడనుకుంటే దారుణంగా నిరాశపర్చాడు. బ్యాటింగ్​ టైమ్​లో అనవసర బిల్డప్ ఇచ్చి పరువు తీసుకున్నాడు.

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దులీప్ ట్రోఫీలో మరోమారు ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ రౌండ్​ మ్యాచ్​లో ఒక ఇన్నింగ్స్​లో 9 పరుగులు చేసిన అయ్యర్.. ఇంకో ఇన్నింగ్స్​లో ఫిఫ్టీ కొట్టి ఫర్వాలేదనిపించాడు. కానీ అతడి నుంచి ఇంకా భారీ ఇన్నింగ్స్ ఆశించిన సెలెక్టర్లు బంగ్లాదేశ్​తో సిరీస్​కు ఎంపిక చేయలేదు. టీమ్​లో భారీ పోటీ ఉండటంతో తీసుకోలేదు. దీంతో మరింత కసితో అతడు బ్యాటింగ్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ దులీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్​లో అతడు ఫెయిల్ అయ్యాడు. అయితే అతడి వైఫల్యం కంటే పరువు తీసుకోవడం గురించి ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. బ్యాటింగ్​కు వస్తున్న టైమ్​లో అయ్యర్ బిల్డప్ ఇచ్చాడు. పోజు కొట్టిన స్టైలిష్ బ్యాటర్.. ఆ తర్వాత తుస్సుమన్నాడు.

ఇండియా-సీతో జరిగిన మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో డకౌట్ అయ్యాడు అయ్యర్. 7 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. కళ్లకు సన్​గ్లాసెస్ వేసుకొని స్టైల్​గా క్రీజులోకి వచ్చాడు అయ్యర్. కానీ సింగిల్ డిజిట్ కూడా చేయకుండానే పెవిలియన్​ దిశగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. అంత బిల్డప్ ఇచ్చావ్ కదా కూలింగ్ గ్లాసెస్ వేసుకొని.. కనీసం ఒక్క పరుగు కూడా చేయలేదేంటని అతడి గాలి తీస్తున్నారు నెటిజన్స్. అది టెస్ట్ మ్యాచ్, ఫ్యాషన్ షో కాదని.. అంత పోజు అక్కర్లేదని ట్రోల్ చేస్తున్నారు. ఎండ కూడా పెద్దగా లేదు.. సన్​గ్లాసెస్ అవసరమా? ఇలాంటివి మానుకోవాలని సూచిస్తున్నారు. బ్యాటింగ్ మీద ఫోకస్ పెడితే బాగుంటుందని సజెస్ట్ చేస్తున్నారు.

ఇక, ఈ మ్యాచ్​లో ఇండియా-డీ ఫస్ట్ ఇన్నింగ్స్​లో 183 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ అయ్యర్ సహా సంజూ శాంసన్ (5), రికీ భుయ్ (23), యష్​ దూబె (14), అధర్వ టైడే (4) లాంటి టాప్ బ్యాటర్స్ అంతా ఫెయిల్ అవడంతో ఆ టీమ్​ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. దేవ్​దత్ పడిక్కల్ (124 బంతుల్లో 92) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఆఖరి వరకు ఫైట్ చేసి టీమ్​ను మంచి స్కోరుకు అందించే ప్రయత్నం చేశాడు. పడిక్కల్ కూడా త్వరగా ఔట్ అయి ఉంటే ఇండియా-డీ వంద లోపే చాప చుట్టేసేది. అతడు ఒక ఎండ్​లో అడ్డుగోడలా నిలబడిపోయాడు. వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతో పాటు స్కోరు బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇండియా-ఏ రెండో రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 115 రన్స్​తో ఉంది. ఆ జట్టు ఆధిక్యం 222 పరుగులకు చేరింది. అయ్యర్ సేన నెగ్గాలంటే ప్రత్యర్థి జట్టును త్వరగా ఆలౌట్ చేయడంతో పాటు అద్భుతంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. మరి.. శ్రేయస్ పరువు తీసుకున్న ఘటనపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments