SNP
ఇంగ్లండ్ జట్టును రోహిత్ సేన చిత్తుచిత్తుగా ఓడిస్తే.. మరో వైపు భారత యువ క్రికెటర్లు దేశవాళి క్రికెట్‌లో సత్తా చాటుతున్నారు. అయితే.. తాజాగా ఓ యువ ఆటగాడు గాయంతో జట్టుకు దూరం అయ్యాడు. మరి అతనెవరు? ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఇంగ్లండ్ జట్టును రోహిత్ సేన చిత్తుచిత్తుగా ఓడిస్తే.. మరో వైపు భారత యువ క్రికెటర్లు దేశవాళి క్రికెట్‌లో సత్తా చాటుతున్నారు. అయితే.. తాజాగా ఓ యువ ఆటగాడు గాయంతో జట్టుకు దూరం అయ్యాడు. మరి అతనెవరు? ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఒక వైపు టీమిండియా ఇంగ్లండ్‌తో టెస్టుల సిరీస్‌లో అదరగొడుతుంటే.. మరోవైపు భారత యువ ఆటగాళ్లు ప్రతిష్టాత్మక దేశవాళి క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో దుమ్మురేపుతున్నారు. అయితే.. లాంగ్ టోర్నీలో ఇప్పటికే పలువురు ఆటగాళ్లు గాయాలపాలయ్యారు. తాజాగా మరో స్టార్ ఆటగాడు గాయంతో టోర్నీలోని మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ముంబై జట్టు తరఫున ఆడుతున్న టీమిండియా యువ క్రికెటర్ శివమ్ దూబే గాయంతో రంజీలోని కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. సైడ్ స్ల్రెయిన్ నొప్పితో దూబే టోర్నీకి దూరం అవుతున్నాడు. ఇప్పటి వరకు రంజీ ట్రోఫీలో దూబే మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కేవలం ఐదు మ్యాచ్‌లోనే 67.83 సగటుతో 407 పరుగులు చేశాడు.
అందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ దూబే ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో 12 వికెట్లు పడగొట్టాడు. మేటి ఆల్‌రౌండర్‌గా పేరుతెచ్చుకుంటున్న దూబే ఇప్పటికే టీమిండియా టీ20 జట్టు తరఫున అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇక వన్డే, టెస్టుల టీమ్‌లో చోటు కోసం దూబే ఎదురుచూస్తున్నాడు. కాగా, దూబే లాంటి ఇన్ ఫామ్ బ్యాటర్ దూరం అవ్వడం ముంబై జట్టుకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. మంగళవారం బరోడాతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కోసం ముంబై మేనేజ్‌మెంట్ జట్టును ఎంపిక చేయనుంది. మరి దూబే స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది. తాజాగా అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబే సైడ్ స్ట్రెయిన్‌తో బాధపడ్డాడు. దీంతో.. అతనికి రెస్ట్ ఇవ్వాలని ముంబై జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబై, బరోడాతో ఈ నెల 23 నుంచి క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే.. సెమీ ఫైనల్, అక్కడ కూడా గెలిస్తే ఫైనల్ ఆడే ఛాన్స్ ఉంది. అయితే.. కీలకమైన క్వార్టర్ ఫైనల్‌కి ముందు శివమ్ దూబే దూరం కావడం.. ముంబైకు గట్టి ఎదురుదెబ్బ. కాగా, దూబే స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్‌ను జట్టులోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ముగిసిన అండర్ 19 వరల్డ్ కప్‌లో ముషీర్ ఖాన్ అద్భుతంగా రాణించాడు. పైగా అతను కూడా మంచి ఆల్‌రౌండర్. దీంతో.. దూబే స్థానాన్ని ముషీర్ ఖాన్‌తో భర్తీ చేసే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shivam Dube is likely to be ruled out of the Ranji Trophy knock-outs due to side strain injury🏏🤕 [Gaurav Gupta from TOI] pic.twitter.com/ORJ11JOVQP
— CricketGully (@thecricketgully) February 20, 2024