వీడియో: తమ్ముడ్ని డకౌట్‌ చేశాడని.. ఆకాశ్‌ దీప్‌పై పగతీర్చుకున్న సర్ఫరాజ్‌ ఖాన్‌!

Sarfaraz Khan, Akash Deep, Duleep Trophy 2024: తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ను డకౌట్‌ చేసిన బౌలర్‌పై అన్న సర్ఫరాజ్‌ ఖాన్‌ పగతీర్చుకున్నాడు. ఈ రివేంజ్‌ స్టోరీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Sarfaraz Khan, Akash Deep, Duleep Trophy 2024: తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ను డకౌట్‌ చేసిన బౌలర్‌పై అన్న సర్ఫరాజ్‌ ఖాన్‌ పగతీర్చుకున్నాడు. ఈ రివేంజ్‌ స్టోరీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీమిండియా యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ దులీప్‌ ట్రోఫీలో ఆడుతూ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. దులీప్‌ ట్రోఫీ 2024లో భాగంగా ఇండియా ఏ, ఇండియా బీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇండియా-బీ తరఫున ఆడిన ముషీర్‌ ఖాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 181 పరుగుల భారీ స్కోర్‌ సాధించాడు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం డకౌట్‌ అయ్యాడు. ఆకాశ్‌ దీప్‌ వేసిన అద్భుతమైన బంతికి కీపర్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అదే టీమ్‌ తరఫున ఆడుతున్న సర్ఫరాజ్‌ తన తమ్ముడిని డకౌట్‌ చేసిన బౌలర్‌కు బుద్ధి చెప్పాలని అనుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో అద్బుతమైన సెంచరీతో అలరించిన తమ్ముడి ముషీర్‌ను డకౌట్‌ చేసిన ఆకాశ్‌ దీప్‌ను సర్ఫరాజ్‌ ఖాన్‌ టార్గెట్‌ చేసి మరీ కొట్టాడు. తమ్ముడు అవుట్‌ కాగా.. బ్యాటింగ్‌కి వచ్చిన సర్ఫరాజ్‌.. ఆకాశ్‌ దీప్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌లో అతనికి చుక్కలు చూపించాడు. తాను ఎదుర్కొన్న 8వ బంతి నుంచే బాదుడు మొదలు పెట్టాడు. తమ్ముడ్ని డకౌట్‌ చేసిన బౌలర్‌ను కసి తీరా బాదాశాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు వరుస బంతుల్లో ఐదు బౌండరీలు బాది.. ఒకే ఓవర్‌లో 20 పరుగులు పిండుకున్నాడు. మొత్తంగా 36 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 46 పరుగులు చేసి రాణించాడు. అలాగే అదే టీమ్‌లో ఆడిన రిషభ్‌ పంత్‌ 47 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 61 పరుగులు చేసి అదరగొట్టాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా-బీ టీమ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ముషీర్‌ ఖాన్‌ 181 పరుగులతో అదరగొట్టాడు. అలాగే టెయిలెండర్‌ నవదీప్‌ షైనీ 56 పరుగులతో రాణించాడు. ఇండియా ఏ టీమ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. శుబ్‌ మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌, రియాన్‌ పరాగ్‌, కేఎల్‌ రాహుల్‌, ధృవ్‌ జురెల్‌, శివమ్‌ దూబే లాంటి స్టార్లు ఉన్నా.. పెద్ద స్కోర్‌ చేయలేకపోయింది. ఏ ఒక్క బ్యాటర్‌ కూడా హాఫ్‌ సెంచరీ సాధించలేదు. ఒక మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా బీ టీమ్‌ 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. మరి ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ ఆకాశ్‌ దీప్‌ను ఒకే ఓవర్‌లో 5 ఫోర్లు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments